Begin typing your search above and press return to search.

ఆస్ట్రేలియాలో నలుగురు భారతీయలు దుర్మరణం!

విదేశాల్లో ఉన్న భారతీయులు ప్రమాదాల బారిన పడుతున్న ఘటనలు ఇటీవల కాలంలో మీడియాలో ఎక్కువగా దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   25 Jan 2024 8:33 AM GMT
ఆస్ట్రేలియాలో నలుగురు భారతీయలు దుర్మరణం!
X

విదేశాల్లో ఉన్న భారతీయులు ప్రమాదాల బారిన పడుతున్న ఘటనలు ఇటీవల కాలంలో మీడియాలో ఎక్కువగా దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... రోడ్డు ప్రమాదాలు, జాత్యహంకార దాడులు, పిచ్చొడి చేతిలో తుపాకీ పనులు... కారణాలు ఏవైనా, కంట్రీ మరేదైనా... విదేశాల్లో ప్రమాదాల బారిన పడుతున్న భారతీయుల సంఖ్య ఇటీవల కాలంలో పెరిగిపోతూ ఉంది. ఈ క్రమంలోనే తాజాగా నలుగురు భారతీయులు ఆస్ట్రేలియాలో దుర్మరణం పాలయ్యారు.

అవును... విదేశాల్లో ఉంటున్న భారతీయుల ప్రమాదాలకు సంబంధిచిన వార్తలు ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆస్ట్రేలియాలో నలుగురు భారతీయలు దుర్మరణం చెందారు. బీచ్ వద్ద నీట మునగడమే వీరి మరణానికి కారణం అని తెలుస్తుంది. ఆ ప్రదేశంలో ఇలాంటి ప్రమాదలు జరగడం ఇదే తొలిసారి కాకపోవడం గమనార్హం.

వివరాళ్లోకి వెళ్తే... ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలోని ఫిలిప్ ఐలాండ్‌ కు చెందిన బీచ్ వద్ద బుధవారం మధ్యాహ్న సమయంలో నలుగురు భారతీయులు సరదాగా గడుపుతున్నారు! ఈ సమయంలో బీచ్ వద్ద వీరంతా నీట మునిగిపోయారు. బీచ్ వద్ద వారిని గుర్తించిన సిబ్బంది కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో... నలుగురూ ప్రాణాలు కోల్పోయారు.

వీరిలో ముగ్గురు అక్కడిక్కడే మరణించగా, ఇంకొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ నలుగురు మృతుల్లోనూ ముగ్గురు మహిళలున్నారు. ఈ విషయాలపై స్పందించిన అధికారులు... ఆ ప్రాంతంలో ఈ తరహా విషాదం చోటు చేసుకోవడం 20 ఏళ్లలో ఇదే తొలిసారని తెలిపారు.

ఈ విషయాలపై స్పందించిన కాన్‌ బెర్రాలోని భారత హైకమిషన్... ఆస్ట్రేలియాలో విషాదకర ఘటన చోటుచేసుకుందని.. నీటమునిగి నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారని.. ఈ సందర్భంగా వారి కుటుంబానికి ప్రగాఢసానుభూతి తెలియజేస్తున్నామని వెల్లడించింది. ఇదే సమయంలో... ఇతర సహాయచర్యల నిమిత్తం మెల్‌ బోర్న్‌ అధికారులు మృతుల సన్నిహితులతో టచ్‌ లో ఉన్నారని తెలిపింది.