Begin typing your search above and press return to search.

16 సంవత్సరాలు వచ్చే వరకు అది నో అంటున్న ఆస్ట్రేలియన్ గవర్నమెంట్..

ప్రపంచంలో మిగిలిన వారు కూడా ఇదే మార్గాన్ని ఫాలో అయితే యువత భవిత బాగుంటుంది అని నెటిజన్స్ కూడా భావిస్తున్నారు.

By:  Tupaki Desk   |   10 Sep 2024 9:30 PM GMT
16 సంవత్సరాలు వచ్చే వరకు అది నో అంటున్న ఆస్ట్రేలియన్ గవర్నమెంట్..
X

సోషల్ మీడియా ఎక్కడ పట్టిన ట్రెండింగ్ లో ఉంది.. మరీ ముఖ్యంగా 16 సంవత్సరాల లోపు పిల్లలు కూడా ఈ వ్యసనానికి బానిసలవుతున్నారు. దీని ప్రభావం వారి మానసిక ఎదుగుదలపై తీవ్రంగా పడుతోంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియన్ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం తల్లిదండ్రులకు ఎంతో ఊరట కలిగిస్తుంది. ప్రపంచంలో మిగిలిన వారు కూడా ఇదే మార్గాన్ని ఫాలో అయితే యువత భవిత బాగుంటుంది అని నెటిజన్స్ కూడా భావిస్తున్నారు.

ఇంతకీ ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమిటో తెలుసా.. 16 సంవత్సరాల లోపు పిల్లలు పై ఆన్లైన్ వల్ల కలుగుతున్న దుష్ప్రభావాన్ని తగ్గించడం కోసం వార సోషల్ మీడియా వినియోగంపై ఆంక్షలు తీసుకువచ్చింది. మితిమీరిన సోషల్ మీడియా వాడకం వల్ల పిల్లలు ఎంతగా దారి తప్పుతున్నారో మన కళ్ళముందే ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మార్పు కి నాంది పలుకుతోంది.

సోషల్ మీడియాకి ఎడిట్ అవ్వడంతో పిల్లలు అసలు మైదానంలోకి వచ్చి ఆడుకోవడమే మర్చిపోతున్నారు. ఎప్పుడు చూసినా ఫోన్లు చేతిలో పట్టుకొని అలా సోఫాలపై పడి ఉంటున్నారు. దీనివల్ల వారి ఆరోగ్యంతో పాటు మానసిక ఎదుగుదలపై కూడా తీవ్రమైన ప్రభావం పడుతుంది. కొందరు చూడకూడనివి చూడడానికి కూడా అలవాటు పడుతున్నారు. పిల్లలలో సోషల్ మీడియా వాడకం పెరిగే కొద్దీ వయసుకు మించిన ఆలోచనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలు ఫోన్లను వీడి బయట ప్రపంచంలో మెలగడం నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆస్ట్రేలియన్ పీఎం పేర్కొన్నారు.

16 సంవత్సరాల లోపు పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించడానికి వీలులేదు అంటూ ఆస్ట్రేలియన్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే సోషల్ మీడియా వల్ల దుష్ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో ప్రయోజనాలు కూడా అన్నే ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రుల పర్యవేక్షణలో మాత్రమే వారు సోషల్ మీడియాని ఉపయోగించాల్సి ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ విషయంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.. కొందరు దీన్ని సమర్థిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. కానీ చాలామంది పిల్లల భవిష్యత్తుకి ఇటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందే అని అంటున్నారు. అంటే ఇప్పటినుంచి ఆస్ట్రేలియాలో ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా, టిక్ టాక్ వంటివి వాడాలి అంటే కనీస వయసు పరిమితి 16 సంవత్సరాలు దాటాల్సిందే..