Begin typing your search above and press return to search.

అక్కడి వారు కాళ్లకు చెప్పులు లేకుండా ఎందుకు నడుస్తారో తెలుసా?

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ప్రజలు చెప్పులు వేసుకోకుండా రోడ్లపై సంచరిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

By:  Tupaki Desk   |   16 May 2024 5:30 PM GMT
అక్కడి వారు కాళ్లకు చెప్పులు లేకుండా ఎందుకు నడుస్తారో తెలుసా?
X

సాధారణంగా మనం చెప్పులేసుకుని నడుస్తాం. చెప్పులు లేకుండా ఎటు వెళ్లం. ఎందుకంటే మన పాదాలకు ఏదైనా గుచ్చుకుంటుందనే భయంతో పాదరక్షలు వేసుకుంటాం. కానీ ఆ నగరాల్లో ప్రజలు కాళ్లకు చెప్పులు లేకుండానే తిరుగుతారు. ఎటు వెళ్లినా ఖాళీ కాళ్లతోనే తిరగడం వారికి అలవాటు. అలా వారి జీవితంలో చెప్పులు వేసుకోవడం అనేది మరిచేపోయారు.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ప్రజలు చెప్పులు వేసుకోకుండా రోడ్లపై సంచరిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దీంతో అందరు వింతగా చూస్తున్నారు. వారు ఎందుకు చెప్పులు వేసుకోవడం లేదని ఆరా తీస్తున్నారు. అది అక్కడి ఆచారమో ఏమో అని అనుకుంటున్నారు. ఇంతకీ వారు చెప్పులు వేసుకోకపోవడంలో ఔచిత్యమేమిటో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

2012లో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన సేత్ కుగెల్ అనే రచయిత అక్కడ పరిస్థితిని చూసి ఆశ్చర్యపోయారు. వీధులు, సూపర్ మార్కెట్లలో అక్కడి ప్రజలు చెప్పులు లేకుండా తిరగడం చూసి పరేషాన్ అయ్యాడట. ఇదో అద్భుత విషయంగా అభివర్ణించాడు. నగరంలోని కాలిబాటలు చాలా శుభ్రంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నాడు.

పెద్దలే కాదు పిల్లలు కూడా చెప్పులు లేకుండా నడవడం వల్ల వారి శారీరక, మానసిక స్థితి బాగుంటుంది. కొన్ని పాఠశాలల్లో షూలు కూడా ధరించరు. ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టు 2019లో ఇంగ్లండ్ పర్యటనలో చెప్పుల్లేకుండా నడిచారు. పిచ్ చుట్టు చెప్పుల్లేకుండా నడవడానికే ఇష్టపడ్డారు. దీంతో వారిలో పాజిటిల్ ఎలక్ట్రాన్ లు శరీరంలోకి ప్రవేశిస్తాయని వారి నమ్మకం.

ఇలా ఈ దేశాల్లో ప్రతి ఒక్కరు చెప్పులు లేకుండా నడవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని వారి విశ్వాసం. కాళ్లకు చెప్పులు లేకుండా తిరడం వల్ల మట్టి మీద నడిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. దీంతో మన శారీరక, మానసిక సమస్యలు లేకుండా పో తాయి. అందుకే అక్కడి వారు ఖాళీ కాళ్లతో నడవడానికే మొగ్గు చూపుతారని సర్వేలు చెబుతున్నాయి.