రొటీన్ కి భిన్నంగా ఫ్యాషన్ షో... వీడియో వైరల్!
రొటీన్ కి భిన్నంగా ఆలోచిస్తుండటం వల్లో ఏమో కానీ తాజాగా నిర్వహించిన ఫ్ర్యాషన్ షో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం...!
By: Tupaki Desk | 27 Feb 2024 6:38 AM GMTజిహ్వకో రుచి, పుర్రెకో బుద్ది అంటారు! అలా అనుకోవాలో.. లేక, కాదేదీ క్రియేటివిటీకి అనర్హం అనుకోవాలో తెలియదు కానీ... తాజాగా జరిగిన ఒక ఫ్యాషన్ షో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సందర్భంగా ర్యాంప్ పై క్యాట్ వాక్ చేస్తున్న మోడల్స్ పై చెత్త వేస్తూ, కూల్ డ్రింక్స్ విసురడం చేశారు ఆహుతులు!! ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది! ఇది సరికొత్త ట్రెండ్ అనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.
అవును... ఇటాలియన్ ఫ్యాషన్ బ్రాండ్ "అవవావ్" మిలన్ ఫ్యాషన్ వీక్ 2024లో మరోసారి తనదైన ప్రత్యేకతను చూపించింది. వాస్తవానికి అవవావ్ నిర్వహించే ఫ్యాషన్ షోలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. రొటీన్ కి భిన్నంగా ఆలోచిస్తుండటం వల్లో ఏమో కానీ తాజాగా నిర్వహించిన ఫ్ర్యాషన్ షో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం...!
తాజాగా మిలాన్ ఫ్యాషన్ వీక్ లో ఇటాలియన్ బ్రాండ్ అవవావ్ నిర్వహించిన ఫ్యాషన్ షో వైరల్ అవుతోంది. కారణం... ఈ సమయంలో అవవావ్ బ్యాచ్ రోటీన్ కి భిన్నంగా ఆలోచించడమే. ఇందులో భాగంగా మోడల్స్ ర్యాంప్ పై వాక్ చేస్తున్న సమయంలో వారి పై చెత్త, సాస్ ప్యాకెట్లు, కాగితం ముక్కలు, డ్రింక్స్ వంటివి విసిరారు. దీంతో దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
అయితే... తమపై వచ్చిన ట్రోల్స్ నుంచి ప్రేరణ పొంది అవవావ్ యజమాని కార్ల్ సన్ ఈ విచిత్ర థీం ను రూపొందించినట్లు చెబుతున్నారు. దీంతో... ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియోలపై నెటిజనలు సోషల్ మీడియా వేదికగా రకరకాల కామెంట్లు పెడుతున్నారు. మోడల్స్ పై చెత్త వేసిన ఈ షో.. ఒక చెత్త షో అంటూ ఒకరు కామెంట్ చేయగా... డిఫరెంట్ గా థింక్ చేశారంటూ మరొకరు స్పందించారు.
కాగా... డిజైనర్ బీట్ కార్ల్ సన్ సంచలన సృష్టించడం, ఫలితంగా వైరల్ అవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ అనేకసార్లు వింతైన ఫ్యాషన్ షోలు నిర్వహించి ఆశ్చర్యపరిచాడు. ఇందులో భాగంగా గత సెప్టెంబర్ లో... "డిజైన్ చేయడానికీ టైం లేదు.. వివరించడానికీ టైం లేదు" అనే కాన్సెప్ట్ తో సమ్మర్ - 2024 కలెక్షన్ ను ప్రదర్శించారు!