Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ వ్యూహానికి అవినాష్ సిద్ధ‌మేనా?

ఈ నేపద్యంలో ఎంపీ పదవికి వైయస్ అవినాష్ రెడ్డిని రాజీనామా చేయ‌మంటే ఆయ‌న చేస్తారా? అనేది సందేహం.

By:  Tupaki Desk   |   9 July 2024 1:30 AM GMT
జ‌గ‌న్ వ్యూహానికి అవినాష్ సిద్ధ‌మేనా?
X

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ వ్యూహానికి క‌డ‌ప ఎంపీగా తాజా ఎన్నిక‌ల్లో వరుస విజ‌యం ద‌క్కించుకు న్న సొంత సోద‌రుడు అవినాష్‌రెడ్డి సిద్ధ‌మ‌య్యారా? లేక .. జ‌గ‌న్‌కు ఈ సారికి `సారీ` చెబుతారా? అనేది ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే.. జ‌గ‌న్‌కు ముఖ్య‌మంత్రి పీఠం ఎంత ముఖ్య‌మని భావిస్తున్నారో.. ఎంపీ పీఠాన్ని అంతే ఇంపార్టెంటుగా అవినాష్‌రెడ్డి కూడా భావిస్తున్నారు. ఈ నేపద్యంలో ఎంపీ పదవికి వైయస్ అవినాష్ రెడ్డిని రాజీనామా చేయ‌మంటే ఆయ‌న చేస్తారా? అనేది సందేహం.

ఎందుకంటే ప్రస్తుతం అవినాష్ రెడ్డి దివంగ‌త వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే బెయిలుపై ఉన్న ఆయన ఎంపీ పదవి కూడా కోల్పోతే మరిన్ని చిక్కుల్లో పడే అవకాశం కచ్చితంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను ఆయన ఏమేర‌కు పాటిస్తారనేది సందేహమే. ఎందుకంటే ఎంపీ పదవిని కూడా వదిలేసుకుంటే మున్మందు కోర్టుల నుంచి ఎదుర‌య్యే ఇబ్బందులు, న్యాయపరమైన సమస్యలతో అవినాష్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతార‌నే చ‌ర్చ సాగుతోంది.

కాబట్టి ఎంపీ ప‌ద‌విని వదులుకునే విషయంలో జగన్మోహన్ రెడ్డిని అవినాష్ రెడ్డి ఎదిరించినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. గత ఏడాది సీబీఐ అరెస్టు చేసిన సమయంలో తాను ఎంపీ పదవిలో ఉన్నానని, ప్రజల సమస్యల కోసం పోరాడాల్సి ఉందని చెబుతూ బెయిల్ తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే పదవిని గనుక అవినాష్‌ వదులుకుంటే..రేపు ప‌రిస్థితి ఏంటి? అనేది చ‌ర్చ‌. బెయిల్ రద్దు చేయడంతో పాటు మరిన్ని చెక్కుల్లో పడే ఛాన్స్ కూడా ఉంది.

కాబట్టి ఈ విషయంలో జగన్‌కు.. ఈ సారి అవినాష్ సహకరించటం సమస్యేనని పరిశీలకులు భావిస్తు న్నారు. కాగా.. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న చ‌ర్చ‌ల నేప‌థ్యంలోనే ఇవ‌న్నీ.. తెర‌మీదికి వ‌స్తున్నాయి. జ‌గ‌న్ త‌న ఎమ్మెల్యే పీఠానికి రాజీనామా చేసి.. ఎంపీగా పోటీ చేస్తార‌ని.. సోష‌ల్ మీడియాలో చ‌ర్చ సాగుతోంది. ఈ క్ర‌మంలోనే క‌డ‌ప ఎంపీగా ఉన్న అవినాష్‌తో రాజీనామా చేయిస్తార‌ని అంటు్నారు. కానీ, ఎట్టి ప‌రిస్థితిలోనూ అవినాష్ రాజీనామా చేసే ప‌రిస్థితి ఉండ‌బోద‌న్న‌ది మెజారిటీ వ‌ర్గాల అభిప్రాయం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.