అయోధ్యలో బీజేపీకి షాక్ !
ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సమాజ్‌వాదీ పార్టీ-కాంగ్రెస్‌తో కూడిన విపక్ష ఇండియా కూటమి నుంచి కాషాయ పార్టీకి ప్రతిఘటన ఎదురవుతోంది
By: Tupaki Desk | 4 Jun 2024 1:32 PM GMTఉత్తరప్రదేశ్ లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సమాజ్‌వాదీ పార్టీ-కాంగ్రెస్‌తో కూడిన విపక్ష ఇండియా కూటమి నుంచి కాషాయ పార్టీకి ప్రతిఘటన ఎదురవుతోంది. యూపీలో గత ఎన్నికల్లో బీజేపీకి 62 స్ధానాలు లభించగా ఈసారి 30 కోల్పోయి 32 స్ధానాలకు పరిమితం అయింది. సమాజ్ వాది పార్టీ 38, కాంగ్రెస్ 6, ఆర్ఎల్డీ 2, ఇతరులు చెరోస్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో ఈసారి 400 లోక్‌సభ స్ధానాలు సాధిస్తామనే నినాదంతో హోరెత్తించిన కాషాయ పార్టీకి అయోధ్యలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫైజాబాద్ లోక్‌సభ స్దానం పరిధిలో ఉన్న అయోధ్యలో ఈ స్ధానంలో ఎస్పీ అభ్యర్ధి విజయం దిశగా సాగుతున్నారు.
బీజేపీ అభ్యర్ధి లల్లూ సింగ్‌పై ఎస్పీ అభ్యర్ధి అవధేష్ ప్రసాద్ 54 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 296 స్దానాల్లో ఆధిక్యంలో ఉండగా విపక్ష ఇండియా కూటమి 229 స్ధానాల్లో గెలుపు దిశగా సాగుతుండగా ఇతరులు 18 స్ధానాల్లో ముందంజలో ఉన్నారు