Begin typing your search above and press return to search.

అయోధ్య.. మిస్ కాకుండా తెలుసుకోవాల్సిన 5 అప్డేట్స్

యావత్ దేశం మొత్తం ఇప్పుడు అయోధ్య రాములోరి గురించి మాట్లాడుకుంటున్నారు

By:  Tupaki Desk   |   24 Jan 2024 4:46 AM GMT
అయోధ్య.. మిస్ కాకుండా తెలుసుకోవాల్సిన 5 అప్డేట్స్
X

యావత్ దేశం మొత్తం ఇప్పుడు అయోధ్య రాములోరి గురించి మాట్లాడుకుంటున్నారు. 500 ఏళ్ల కల సాకారం కావటం ఒక ఎత్తు అయితే.. ఇంతకాలం అయోధ్య రామాలయానికి సంబంధించి ఉన్న వివరాలకు అదనంగా.. గడిచిన కొద్ది రోజులుగా బయటకు వస్తున్న అంశాలు.. అయోధ్య రాములోరికి దేశ ప్రజల్ని మరింత కనెక్టు అయ్యేలా చేశాయి. ఇప్పుడు దేశంలోని ఏ ప్రాంతంలో అయినా అయోధ్య రామాలయం గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.

జనవరి 22న అయోధ్యలోని బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిన అనంతరం.. తర్వాతి రోజు (జనవరి 23, మంగళవారం) పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీటికి సంబంధించి కీలకమైన 5 అప్డేట్స్ విషయానికి వస్తే..

1. అయోధ్యలో కొలువు తీరిన బాలరాముడ్ని ఇకపై ‘‘బాలక్ రామ్’’గా వ్యవహరించాలని పేర్కొన్నారు. మందిరంలో కొలువుదీరిని లల్లా ఐదేళ్ల పసి బాలుడిగా దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే బాలక్ రామ్ గా పేరును డిసైడ్ చేసినట్లుగా ట్రస్టు పూజారి అరుణ్ దీక్షిత్ వెల్లడించారు. అంతేకాదు.. ఆలయాన్ని బాలక్ రామ మందిర్ గా పిలుస్తామని చెప్పారు.

2. బాలక్ రామ్ కు రోజు ఆరుసార్లు హారతిని ఇవ్వనున్నట్లుగా పేర్కొన్నారు. ట్రస్టు నిర్వాహకులుగా వ్యవహరిస్తున్న ఆచార్య మిథిలేశ్ నందిని మాట్లాడుతూ కీలక అంశాల్ని వెల్లడించారు. రోజు మొత్తంలో ఆరుసార్లు హారతి కార్యక్రమాన్నినిర్వహించనున్నారు.

- మంగళ

- శ్రింగార

- భోగ

- ఉతపన్

- సంధ్యా

- శయన హారతిలు ఇవ్వనున్నారు. అంతేకాదు.. బాలక్ రామ్ కు నైవేధ్యంలో పూరి కూరతో పాటు పాలు, పండ్లు, రబ్ డీ ఖీర్.. పాలతో చేసిన స్వీట్లను సమర్పించనున్నట్లుగా పేర్కొన్నారు. నిత్యం ఆరు సార్లు హారతి ఇవ్వనున్నారు.

3. అయోధ్యకు వెళ్లాలనుకునే తెలంగాణ వాసులకు తీపికబురు. ప్రస్తుతం అయోధ్య మీద నెలకొన్న ఆసక్తి నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి గోరఖ్ పూర్ కు ప్రత్యేకంగా ఒక ఎక్స్ ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది కాకుండా మరో ప్రత్యేక రైలును అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 28 వరకు మొత్తం 41 ట్రిప్పులను తిప్పేలా ప్లాన్ చేశారు. జనవరి 29, 31 తర్వాత ఫిబ్రవరి 2, 5, 7, 9, 11, 13, 15, 17, 18, 19, 21, 23., 25. 27 రజుల్లో ఈ రైళ్లు ఉన్నాయి.

ప్రతి శుక్రవారం వెళ్లే గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్లో ఉదయం 10.40 గంటలకు బయలుదేరి నేరుగా అయోధ్యకు తర్వాతి రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుతుంది. ఇదికాకుండా ప్రతి రోజు సికింద్రాబాద్ నుంచి దానాపూర్ కు ఒక ఎక్స ప్రెస్ రైలును నడుపుతున్నారు. ఉదయం 9.25 గంటలకు బయలుదేరే ఈ రైలు తర్వాతి రోజు అయోధ్యకు చేరుకుంటుంది. కానీ.. ఇందులో రిజర్వు టికెట్ల దొరకటం కష్టంగా మారింది.

4. అయోధ్యలో బాలక్ రామ్ ను దర్శించుకోవటానికి సామాన్యులకు మంగళవారం నుంచి అవకాశం కల్పించటంతో భారీ ఎత్తున పోటెత్తారు. దీంతో.. కొద్దిసమయం తొక్కిసలాట లాంటి పరిస్థితి చోటు చేసుకుంది. దీంతో.. అయోధ్య ఆలయ ట్రస్ట్ ప్రతినిధులు షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆలయ తలుపుల్ని మూసేశారు. అయితే.. అదే మసయంలో ఆలయంలోకి కొత్త వారిని రాకుండా నిలువరించారు. గుడిలో ఉన్న భక్తుల రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా వెల్లడించారు. రామాలయం ప్రారంభమైన రెండో రోజునే అనూహ్య పరిణామం చోటు చేసుకోవటం ఆసక్తికరంగా మారింది.

5. అయోధ్యలో రామాలయానికి భక్తుల ప్రవాహం భారీగా ఉంది. అంచనాలకు మించి దేశం నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు తరలి వస్తుండటంతో అయోధ్య జనసంద్రంగా మారింది. ఒక్క మంగళవారం 5 లక్షల మంది భక్తులు బాలక్ రామ్ ను దర్శించుకున్నట్లుగా చెబుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల స్వల్ప కాలానికే ఇంత భారీగా భక్తులు వస్తే.. మరిన్ని గంటలు దర్శనానికి కేటాయిస్తే.. మరింత భారీగా భక్తులు దర్శించుకునే వీలు ఉంటుందని చెబుతున్నారు.