Begin typing your search above and press return to search.

షాకింగ్... అయోధ్యలో ఏమిటి రామా ఈ ధరలు?

ఉత్తరప్రదేశ్‌ అయోధ్య గర్భగుడిలో రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేపట్టనున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   11 Jan 2024 11:18 AM GMT
షాకింగ్... అయోధ్యలో ఏమిటి రామా  ఈ ధరలు?
X

ఉత్తరప్రదేశ్‌ అయోధ్య గర్భగుడిలో రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కోసం కోట్ల మంది ఎదురుచూస్తున్నారు. మరికొంతమంది స్వయంగా వీక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇక్కడి హోటళ్ల బుకింగ్స్‌ ఇప్పటికే సుమారు 80 శాతం మేరకు పూర్తయ్యాయి. ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని హోటళ్ల యజమానులు ఫుల్ గా క్యాష్ చేసుకుంటున్నారని తెలుస్తుంది.

అవును... అయోధ్యలో ఈ నెల 22న జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ‍భక్తులు కూడా అక్కడికి వెళ్లేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఆ రోజున దేశ విదేశాలనుంచి సుమారు ఐదు లక్షల మంది వరకూ భక్తులు అయోధ్యకు వస్తారనే అంచనాలున్నాయి. ఈ నేపధ్యంలో అయోధ్యలోని హోటల్ రూం బుకింగ్ ధరలు గతంలో కంటే సుమారు ఐదు నుంచి 10 రెట్లు పెరిగినట్లు తెలుస్తుంది.

ఇందులో భాగంగా... కొన్ని హోటల్ యజమానులు రూంస్ ధరను ఒక్కసారిగా ఊహించని స్థాయిలో పెంచేశారని తెలుస్తుంది. నార్మల్ హోటల్ నుంచి లగ్జరీ హోటల్ వరకూ ఈ విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా టారిఫ్ లు పెంచేశారని అంటున్నారు. ఈ క్రమంలో హోటల్ అయోధ్య ప్యాలెస్‌ లో సాధారణంగా గది అద్దె రూ.3,700 ఉండగా... ఇప్పుడు సుమారు రూ.18,500 పలుకుతోందని తెలుస్తుంది.

ఇదే సమయంలో ది రామాయణ హోటల్‌ లో రోజువారీ గది అద్దె 2023లో రూ.14,900గా ఉండగా... అదికాస్తా రూ. 40 వేలకు పెరిగినట్లు చెబుతున్నారు. ఇదే క్రమంలో... సిగ్నెట్ కలెక్షన్ హోటల్‌ లో రూం అద్దె రూ. 16,800 నుంచి సుమారు రూ.70,500కు పెరిగినట్లు చెబుతున్నారు. దీంతో ఈ అద్దె గదులు భక్తులకు గట్టి షాక్ ఇస్తున్నాయని అంటున్నారు.

ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం... ఈ హోటళ్లలోని గదులు జనవరి 20 నుండి 23 వరకు ఇప్పటికే బుక్ అవ్వగా... వాటిలోని గది అద్దె రోజుకు రూ.10,000 నుంచి రూ.25,000 వరకూ పెరిగిందని తెలుస్తుంది. అయితే ఈ లెక్క రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తోందని చెబుతుండటం గమనార్హం.