అసహజ శృంగారం... యువకుడిని "ఒత్తిడి" చేసిన యువకుడు హత్య!
దీంతో... హుట్తాహుటిన బయలుదేరి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని పరిసీలించారు.
By: Tupaki Desk | 30 Jan 2024 5:30 PM GMTజనవరి 19న ఢిల్లీలోని మోరీ గేట్ కు సమీపంలోగల డీడీఏ పార్క్ దగ్గర ఒక గుర్తు తెలియని మృతదేహం కనిపించింది. దీంతో... ఆ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. దీంతో... హుట్తాహుటిన బయలుదేరి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని పరిసీలించారు. ఈ సమయంలో మృతుడి శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయని గుర్తించారు!!
దీంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించిన పోలీసులు... కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తులో భాగంగా ఆ పార్క్ పరిసరాలతో పాటు స్థానికంగా ఉన్న సుమారు 50 సీసీ కెమెరా ఫుటేజ్ లను పరిశీలించారు. ఈ సమయంలో... మృతుడి ఆచూకీ తెలిసింది. ఇందులో భాగంగా... మృతుడు ఉత్తర్ ప్రదేశ్ లోని జలాన్ జిల్లాకు చెందిన ప్రమోద్ కుమార్ శుక్లా (20)గా గుర్తించారు.
ఈ సమయంలో అతడి గురించిన వివరాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. దీంతో... ప్రమోద్ కుమార్ శుక్లా కోయా మండిలోని ఓ దుకాణంలో పనిచేసేవాడని.. నైట్ షెల్టర్ లో ఉంటుండేవాడని తెలుసుకున్నారు. ఈ సమయంలో హత్యజరిగినట్లు అనుమానిస్తున్న రోజు సీసీ టీవీ ఫుటేజ్ లో ప్రమోద్ కుమార్ శుక్లాతో పాటు ఒక వ్యక్తి చివరిసారిగా కనిపించాడు.
దీంతో ఆ వ్యక్తి ఫోటోలను కాప్చర్ చేసిన పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. ఈ సమయంలో పట్నాలో అతడిని అదుపులోకి తసుకున్నారు. ఈ సందర్భంగా అతడి పేరు రాజేష్ అని తెలుసుకున్నారు. ఇక శుక్లా హత్య గురించి అతడిని తమదైన శైలిలో విచారించగా... అసలు విషయం బయటకు వచ్చిందని తెలుస్తుంది!
ఇందులో భాగంగా... తనను ప్రమోద్ కుమార్ శుక్లా అసహజ శృంగారంలో పాల్గొనాలని నిత్యం ఒత్తిడి చేసేవాడని నిందితుడు చెప్పాడు. దీంతో అతడిని హత్య చేసేందుకు ప్రణాళిక వేసుకున్నట్లు తెలిపాడు. ఈ నేపథ్యంలో శుక్లాను తలపై బండ రాయితో మోది హత్య చేసినట్లు రాజేష్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు రాజేష్ ను అదుపులోకి తీసుకున్నారు!!