టెర్రరిస్టుని ఇంటర్వ్యూ చేయబోయి బందీగా మారిన యూట్యూబర్!
ఇతడిని విడుదల చేయడానికి భారీ ఎత్తున డబ్బు డిమాండ్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 30 March 2024 5:43 PM GMTకొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందని సామెత... అది సెట్ కాకపోతే... పాలు పోసి పెంచినా పాము విషయమే కక్కుతుంది తప్ప అమృతం కాదు! ఈ ప్రయత్నం సంగతి కాసేపు పక్కనపెడితే... ఒక టెర్రరిస్టును ఇంటర్వ్యూ చేయాలని ప్రయత్నించి ఒక యూట్యూబర్ తిరిగి వారికే బందీగా చిక్కాడు. ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది. ఇతడిని విడుదల చేయడానికి భారీ ఎత్తున డబ్బు డిమాండ్ చేస్తున్నారు.
వివరాళ్లోకి వెళ్తే... ఒక అమెరికన్ యూట్యూబర్ వ్యక్తిగతంగా హైతీకి ప్రయాణించాడు. యువర్ ఫెలో అరబ్ గా ఫేమస్ అయిన అడిసన్ పియర్ మలైఫ్... జిమ్మీ బార్బెక్యూ చెరిజియర్ ను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లాడు. ఈ సమయంలో అతనితో పాటు అతడితో పాటు పనిచేసే వ్యక్తిని 400 మంది మవోజో ముఠాసభ్యులు మార్చి 14న కిడ్నాప్ చేశారు. ఈ సందర్భంగా... 6,00,000 డాలర్లు డిమాండ్ చేశారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇక ఆడిసన్ పియర్ యూట్యూబ్ ఛానల్ కు 1.4 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇతడు సాధారణంగా.. సామాన్య ప్రజలు వెళ్లడానికి భయపడే ప్రమాదకరమైన ప్రదేశాలను అన్వేషిస్తుంటాడు. ఈ క్రమంలోనే జిమ్మీని బార్బెక్యూ ని ఇంటర్వ్యూ చేయాలని హైతీ వెళ్లాడు. అయితే అతడిని కిడ్నాపొ ఏసిన మావోజో గ్యాంగ్ భారీగా డబ్బులు డిమాండ్ చేస్తుంది. ఈ విషయాలపై తోటి యూట్యూబర్లు కీలకంగా స్పందిస్తున్నారు.
ఇందులో భాగంగా ఆడిసన్ బందీగా మారిన విషయాన్ని ధృవీకరించిన తోటి యూట్యూబర్లు... అతడి విడుదలకు అమెరికా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మరి ఈ యూట్యూబర్ విడుదల ఎప్పుడు, ఎలా జరగబోతుందనేది వేచి చూడాలి!