Begin typing your search above and press return to search.

అయ్య‌న్న‌ను డిఫెన్స్‌లో ప‌డేసిన వైఎస్‌. జ‌గ‌న్‌...?

అయితే.. ఎటొచ్చీ ఇప్పుడు స్పీక‌ర్ స్థానంలో ఉన్న అయ్య‌న్న‌కు మాత్రం ఇబ్బందులు , ఇర‌కాటాలు పెరిగాయి.

By:  Tupaki Desk   |   28 Jun 2024 6:05 AM GMT
అయ్య‌న్న‌ను డిఫెన్స్‌లో ప‌డేసిన వైఎస్‌. జ‌గ‌న్‌...?
X

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా కొత్త‌గా ఎంపికైన న‌ర్సీప‌ట్నం ఎమ్మెల్యే, సీనియర్ మోస్టు నాయ‌కుడు.. అయ్య‌న్న పాత్రుడికి ఇప్పుడు సంక‌ట స్థితి ఏర్ప‌డింది. 164 స్థానాల‌తో అసెంబ్లీలోకి అడుగు పెట్టిన‌.. కూట‌మి పార్టీలు జోష్ లో ఉన్నాయి. స‌భ‌లోనూ.. ప్ర‌జల్లోనూ త‌మ‌కు తిరుగులేద‌ని భావిస్తున్నాయి. అయితే.. ఎటొచ్చీ ఇప్పుడు స్పీక‌ర్ స్థానంలో ఉన్న అయ్య‌న్న‌కు మాత్రం ఇబ్బందులు , ఇర‌కాటాలు పెరిగాయి. ఆయన ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా.. కొంత మేర‌కు ఇబ్బంది త‌ప్ప‌దు.

విష‌యం ఏంటంటే.. వైసీపీకి 11 స్థానాలు మాత్ర‌మే ద‌క్కాయి. దీంతో స‌భ‌లో ప్ర‌తిప‌క్ష హోదా వ్య‌వ‌హారం వివాదంగా మారింది. 10 శాతం సీట్లు మాత్ర‌మే ద‌క్కిన పార్టీకి ప్ర‌తిప‌క్షం హోదా ద‌క్కుతుంద‌ని.. స‌భా వ్య‌వహారాల మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ స‌హా.. ఆ పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. దీనిపై సీఎం కానీ, డి ప్యూటీ సీఎం కానీ.. రియాక్ట్ కాలేదు. ఇక‌, స్పీక‌ర్ స్థానంలో ఉన్న అయ్య‌న్న కూడా.. దీనిపై స్పందించ‌లే దు. అయితే.. ఇంత‌లోనే వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్.. సుదీర్ఘ లేఖ‌ను సంధించారు.

స‌భ‌లో త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా క‌ల్పించాల‌ని స్పీక‌ర్‌ను కోరారు. ఇలా.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇచ్చేందుకు 10 శాతం నిబంధ‌న అంటూ ఏమీలేద‌ని ఆయ‌న ఆధారాల‌తో స‌హా వెల్ల‌డించారు. ఈ విష యాల‌ను ప‌లువురు మేధావులు కూడా.. రాజ‌కీయాల‌కు అతీతంగా చెప్పుకొచ్చారు. నిబంధ‌న‌ల్లో ఎక్క‌డా 10 శాతం సీట్లు వ‌స్తేనే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తార‌నేది లేద‌న్నారు. అధికారంలో లేని ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వ‌స్తే.. ఆ పార్టీకి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం హోదా ద‌క్కుతుంద‌ని చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో వాటినే ఉటంకిస్తూ.. జ‌గ‌న్ రాసిన లేఖ పై ఇప్పుడు స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే.. రాజ‌కీయంగా చూస్తే.. జ‌గ‌న్ అధికారంలో ఉన్న‌ప్పుడు.. టీడీపీని వేధించారు. నాయ‌కుల‌ను ఇబ్బంది పెట్టారు. చంద్ర‌బాబును జైల్లో పెట్టారు. సో.. అలా చూసుకుంటే.. ఒక ర‌కంగా స్పందించాలి. హోదా ఇవ్వ‌కుండా చేయాలి. కానీ, నిబంధ‌న‌ల్లో ఇలా లేన‌ప్పుడు.. వాటిని పాటించ‌క‌పోతే.. రేపు న్యాయ‌ప రమైన చిక్కులు వ‌స్తే.. కోర్టుల ముందు.. స‌భాప‌తిగా ఇబ్బంది ప‌డాలి. దీంతో ఇస్తే..పార్టీ నాయ‌కుల నుంచి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌క‌పోతే.. న్యాయ‌ప‌రంగాను అయ్య‌న్న‌కు సంక‌ట స్థితి ఎదురు కానుంద‌ని అంటున్నారు.