Begin typing your search above and press return to search.

బాబా సిద్ధిఖ్ హత్య కేసు... షూటర్లు ఎక్కడ శిక్షణ పొందారో తెలిస్తే షాకే!

ఎన్సీపీ నాయకుడు, మహారాష్ట్ర మాజి మంత్రి బాబా సిద్ధిఖ్ హత్య తీవ్ర సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   16 Oct 2024 3:54 AM GMT
బాబా సిద్ధిఖ్  హత్య కేసు... షూటర్లు ఎక్కడ శిక్షణ పొందారో తెలిస్తే  షాకే!
X

ఎన్సీపీ నాయకుడు, మహారాష్ట్ర మాజి మంత్రి బాబా సిద్ధిఖ్ హత్య తీవ్ర సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసును ముంబై పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ హత్య అనంతరం ముంబైలో గ్యాంగ్ స్టర్స్ రీ ఎంట్రీపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో సిద్ధిఖ్ ని చంపేందుకు షూటర్లు ఎలా ప్రిపేర్ అయ్యారనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది!

అవును... మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖ్ హత్య కేసు ముంబై నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయలో ఈ హత్య దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ సమయంలో.. పట్టుబడిన నిందితులు.. సిద్ధిఖ్ ని చంపేందుకు రోజులు, వారాలు తరబడి ఎలా ప్లాన్ చేశారో బయటపెట్టినట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో హత్య చేసేందుకు ఎలాంటి పద్ధతులో పాటించారో కూడా వెల్లడించినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా... సిద్ధీఖ్ ని హతమార్చడానికి పక్క ప్రణాళికను పూణెలో వేసినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో రెక్కీలో భాగంగా ఆయుధాలు లేకుండా నిందితులు అనేకసార్లు సిద్ధిఖ్ నివాసాన్ని సందర్శించారట.

ఈ నేపథ్యంలో ముంబై క్రైమ్ బ్రాంచ్ తెలిపిన వివరాల ప్రకారం.. బాబా సిద్ధిఖ్ హత్యకు సంబంధించిన మొత్తం ప్లానింగ్ మొత్తం పూణెలో జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ 15 మంది వాంగ్మూలాలను నమోదు చేశారు. ఈ నేపథ్యంలో షూటర్లు శిక్షణ ఎక్కడ, ఎలా తీసుకున్నారనేది ఆసక్తిగా మారింది.

అక్టోబర్ 12న ఘటన జరిగిన కాసేపటికే అరెస్టైన షూటర్లు గుర్మైల్ సింగ్, ధరంరాజ్ కశ్యప్ లు యూట్యూబ్ వీడియోలు చూసి శిక్షణ పొందారని తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం నలుగురిని అరెస్ట్ చేయగా.. వారిలో పూణేకు చెందిన ప్రవీణ్ లోంకర్ ఈ హత్యలో కీలక పాత్ర పోషించినట్లు భావిస్తున్నారు!

ఇదే సమయంలో... నిందితులు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లపై ఎక్కువగా ఆధారపడినట్లు దర్యాప్తులో తేలిందని తెలుస్తోంది. ఇందులో భాగంగా కమ్యునికేషన్ కోసం స్నాప్ చాట్, ఇన్ స్టా గ్రామ్ లను ఉపయోగించినట్లు చెబుతున్నారు. హత్యకు సుమారు 25 రోజులపాటు సిద్ధిఖ్ ఇళ్లు, ఆఫీస్ లపై నిఘా పెట్టారని అంటున్నారు!