బాబు ఏజ్ తో వైసీపీ పాలిటిక్స్ బూమరాంగేనా ?
అంతే కాదు ఆయన చాలా మంది యంగ్ లీడర్స్ కంటే చాలా బెటర్ అని కూడా అంటారు.
By: Tupaki Desk | 6 Dec 2024 8:30 PM GMTచంద్రబాబు ఏజ్ అందరికీ తెలుసు. అయితే అది బయటకు చెబితే తప్ప ఎవరూ అవునా అంత ఏజ్ నా అని ఆలోచిస్తారు. ఎందుకంటే బాబు ఏజ్ ని ఎపుడో దాటేసి తనదైన యంగ్ అండ్ ఎనర్జీ పవర్ తో పాలిటిక్స్ చేస్తూ వస్తున్నారు. చంద్రబాబు వయసు ఏడున్నర పదులే కానీ ఆయన ఈ రోజున దేశంలో ఉన్న చాలా మంది ఓల్డ్ లీడర్స్ కంటే యంగ్ అని చెప్పాల్సి ఉంటుంది. అంతే కాదు ఆయన చాలా మంది యంగ్ లీడర్స్ కంటే చాలా బెటర్ అని కూడా అంటారు. ఇక ఆయన ఆలోచనలు ఇంకా యంగ్ గా ఉంటాయని అంటారు. ఆయన 2000లో ఉమ్మడి ఏపీకి సీఎం గా ఉంటే విజన్ 2020 అని ఆలోచించారు. ఇపుడు విజన్ 2047 అని అంటున్నారు.
అలా దశాబ్దాల ముందు చూపుతో ఆయన వ్యవహరిస్తూంటారు అని అంటారు. అటువంటి బాబు ఏజ్ విషయంలో పాలిటిక్స్ కి వైసీపీ తెర తీసింది ఆయనను ఓల్డ్ మాన్ అంటోంది. ఆయన నాయకత్వం యంగ్ ఏపీకి తగదు అని అంటోంది. అయితే ఇది సమంజసమైన వాదనేనా అన్న చర్చ సాగుతోంది. రాజకీయాల్లో ఉన్న వారి శక్తియుక్తులను జనాలు చూస్తారు. వారి పనితీరుని చూసి ఎన్నుకుంటారు.
ఇటీవలే అమెరికా అధ్యక్షుడిగా ఎనభై ఏళ్ల ట్రంప్ ఎన్నిక అయ్యారు. ఇక దిగిపోతున్న బైడెన్ వయసు 84 ఏళ్ళు అంటున్నారు. పుతిన్ చూసిన ఇతర దేశాధినేతల ఏజ్ చూసినా ఏడు పదులు దాటిన వారే. మరి బాబు ఏజ్ నే ఎందుకు ముందుకు తెస్తున్నారు. ఆ మాటకు వస్తే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఏజ్ 75 ఏళ్లే కదా అన్న చర్చనూ తెస్తున్నారు. ఇక 78 ఏళ్ళ వయసులో వాజ్ పేయి మురార్జీ దేశాయ్, మన్ మోహన్ సింగ్ వంటి వారు దేశానికి ప్రధానులు అయ్యారు. అలాగే పీవీ నరసింహారావు వంటి వారు అదే ఏజ్ కి దేశ పగ్గాలు చేపట్టారు.
పాలిటిక్స్ లో టాలెంట్ ప్రధానం కానీ ఏజ్ కాదని అంటున్నారు. ఇక బాబు ఒక్కరే ఏడున్నర పదుల వయసులో సీఎంగా ఉన్నారు అని వైసీపీ అంటోంది. కానీ పొరుగున ఉన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఏజ్ చూస్తే 77 ఏళ్ళు అని అంటున్నారు. కేరళ సీఎం పినరాయ్ విజయన్ ఏజ్ అక్షరాలా 79 ఏళ్ళు, తమిళనాడు సీఎం స్టాలిన్ ఏజ్ 73 ఏళ్ళు, పాండిచ్చేరీ సీఎం రంగస్వామి ఏజ్ 74 ఏళ్ళుగా ఉంది.
ఇక నిన్నటిదాకా ఒడిషాను ఏలిన నవీన్ పట్నాయక్ ఏజ్ దాదాపుగా ఎనభై అని గుర్తు చేస్తున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఏజ్ 69 అయితే బీహార్ సీఎం నితీష్ కుమార్ ఏజ్ 73గా ఉంది. నాగాలాండ్ సీఎం నీపీయూ రియో ఏజ్ 74 ఏళ్ళుగా ఉంది.
మరి దేశంలో ఏడు పదులు దాటిన వారు, టచ్ చేస్తున్న వారు దాదాపుగా డజను మంది దాకా ఉంటే ఒక్క చంద్రబాబుకే ఏజ్ ప్రాబ్లం వచ్చిందా అన్న చర్చ ఉంది. అంతే కాదు చంద్రబాబు విషయం తీసుకుంటే ఆయన రోజుకు 18 గంటలు పనిచేస్తారు. ఆయన రోజుకు ఎంత దూరమైనా ఏ అలుపూ సొలుపూ లేకుండా ప్రయాణం చేస్తారు.
ఆయన విజనరీ కూడా గొప్పగా ఉంటుంది. ఏపీ ఈ రోజు విభజన వల్ల గాయపడి పసికూనగా ఉంటే దానిని లాలించి పాలించే అనుభవశాలి సీఎం కావాలి కదా అన్నదే అంతా అంటున్నారు. అందుకే బాబుని ఎన్నుకున్నారు అని గుర్తు చేస్తున్నారు. రాజకీయాల్లో ఏజ్ కి పెద్దగా ప్రాముఖ్యత లేదని తెలిసినా వైసీపీ పదే పదే అదే విషయాన్ని ప్రస్తావించడంలో అంతరార్ధం ఏంటి అన్నది కూడా చర్చిస్తున్నారు.
బాబు సీఎం గా ఉంటే వైసీపీకి తట్టుకోవడం కష్టమనే ఈ విధంగా బాబు ఓల్డ్ పవన్ బెస్ట్ అని ముందుకు తెస్తున్నారు అని అంటున్నారు. నిజానికి వైసీపీ ఈ రోజు కొత్తగా బాబు ఏజ్ ని ప్రస్తావించడం లేదు. 2014లోనూ వైసీపీ అధినేత జగన్ తాను యువకుడిని అని తనకు ఏపీ సీఎం చాన్స్ ఇవ్వాలని ప్రచారం చేశారు. కానీ జనాలు బాబుకే పట్టం కట్టారు అంటే అది ఆయన అనుభవం చూసి మాత్రమే అని అంటున్నారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా రాజకీయాల్లో వృద్ధ నేతల పాత్ర గణనీయంగా ఉంది. దేశంలోనూ ఉంది. అలాంటపుడు బాబుని ఒక్కడితే పాయింట్ అవుట్ చేసి మాట్లాడడం ద్వారా వైసీపీ సాధించేది ఏమీ ఉండదని అంటున్నారు.