కింజరాపు ఫ్యామిలీకి మరో గిఫ్ట్ ఇచ్చిన బాబు
1983లో దివంగత ఎర్రన్నాయుడు తొలిసారి రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు.
By: Tupaki Desk | 5 Jan 2025 4:16 AM GMTశ్రీకాకుళం జిల్లాకు చెందిన కింజరాపు కుటుంబానికి జిల్లావ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. 1983లో దివంగత ఎర్రన్నాయుడు తొలిసారి రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. అది లగాయితూ ఆ కుటుంబం ఈ రోజుకీ జిల్లాలో తన రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. ఎర్రన్నాయుడు వారసుడిగా అచ్చెన్నాయుడు రాజకీయాల్లోకి వచ్చి కీలక పదవులు ఎన్నో అందుకున్నారు.
ఇక కుమారుడు రామ్మోహన్ నాయుడు అయితే కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. ఇపుడు అదే కుటుంబంలో ఎర్రన్నాయుడు తమ్ముడు అయిన రిటైర్డ్ పోలీసు అధికారి కింజరాపు ప్రభాకర నాయుడుకి న్యూ ఇయర్ గిఫ్ట్ ని కూటమి ప్రభుత్వం అందించింది.
ఆయన పోలీసు శాఖలో దశాబ్దాల పాటు పనిచేసి పదవీ విరమణకు కొద్ది రోజుల ముందు అడిషనల్ ఎస్పీ గా పదోన్నతిని పొందారు. కూటమి ప్రభుత్వంలో ఆయనకు దక్కిన ఒక కీలక బహుమతి అది. అలా ఆయన ఉన్నత స్థాయిలో పదవీ విరమణ చేసి కొద్ది నెలలుగా రెస్ట్ తీసుకుంటున్నారు.
అయితే ఇపుడు ఆయనకు ప్రభుత్వం మరో కీలక పదవిని ఇచ్చింది. ఆయనను తాజాగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఓఎస్డీగా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఎక్స్ అఫీషియో కార్యదర్శి, బిజీ హరీష్ కుమార్ గుప్తా ఆయన నియామకాన్ని ధృవీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈ పదవిలో ప్రభాకర్ నాయుడు ఏడాది పాటు సేవలు అందిస్తారు.
ఈ పరిణామంతో కింజరాపు కుటుంబం పట్ల చంద్రబాబుకు ఉన్న అభిమానం ఎంతటితో మరోమారు చర్చకు వస్తొంది. ఆయన కింజరాపు కుటుంబానికి ఎంతో గౌరవం ఇస్తూ వస్తున్నారు. నిజానికి టీడీపీలో ఎంతో మంది రాజకీయంగా ఎదిగారు. అందులో కింజరాపు ఫ్యామిలీ ఒకటి. అయితే ఆ కుటుంబం పార్టీకి నిబద్ధతతో చేస్తున్న సేవలను గుర్తించిన చంద్రబాబు వారిని సముచితంగా గుర్తింపు ఇచ్చి ఆదరిస్తున్నారు
కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడుకు ఇవ్వడం ద్వారా బాబు ఆ ఫ్యామిలీకి ఇచ్చిన విలువ ఏంటో చెప్పారు. ఇపుడు ప్రభాకరనాయుడు పదవి విషయం తీసుకుంటే కనుక ఇంకా ప్రయారిటీ దక్కింది. ఏది ఏమైనా కింజరాపు ఫ్యామిలీ టీడీపీకి అంకితం అయి పనిచేస్తోంది. బాబు పట్ల టీడీపీ పట్ల విశ్వాసంతో ఉంటోంది. దానికి తగినట్లుగానే ఈ అవకాశాలు అని అంటున్నారు. అది కూడా సమర్ధతను చూసి మాత్రమే ఇస్తున్నారు అని గుర్తు చేస్తున్నారు.