Begin typing your search above and press return to search.

హైదరాబాద్ మొత్తం తెలుగు జాతిది... బాబు సంచలనం

అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్ర కీలకంగా ఉంది అని చెప్పాలి. ఈ నేపధ్యంలో హైదరాబాద్ తో ఏపీకి ఎమోషనల్ బాండేజ్ అన్నది ఏర్పడింది.

By:  Tupaki Desk   |   25 Jan 2025 4:15 PM GMT
హైదరాబాద్ మొత్తం తెలుగు జాతిది... బాబు సంచలనం
X

హైదరాబాద్ బేసికల్ గా చూస్తే తెలంగాణా స్టేట్ లో ఉంది. దానికి రాజధానిగా ఉంది. అయితే అరవై ఏళ్ళ పాటు ఉమ్మడి ఏపీకి అది రాజధానిగా ఉంది. అలా అనాడు దాదాపుగా పదిహేను మంది ముఖ్యమంత్రులు ఉమ్మడి ఏపీని ఏలి హైదరాబాద్ ని విశేషంగా అభివృద్ధి చేశారు. అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్ర కీలకంగా ఉంది అని చెప్పాలి. ఈ నేపధ్యంలో హైదరాబాద్ తో ఏపీకి ఎమోషనల్ బాండేజ్ అన్నది ఏర్పడింది.

విభజన తరువాత ఏపీ అమరావతిని రాజధానిగా చేసుకుని నిర్మాణం సాగిస్తున్నా హైదరాబాద్ విషయంలో మాత్రం ఆ భావోద్వేగ సెంటిమెంట్ అలాగే కంటిన్యూ అవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ గురించి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇపుడు వైరల్ అవుతున్నాయి.

ఈ నేపధ్యంలో హైదరాబాద్ గురించి బాబుకు మీడియా నుంచి ఒక ప్రశ్న వచ్చింది. ఏపీకి హైదరాబాద్ లేదని అది తెలంగాణా వద్ద ఉందని ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఒక లేడీ జర్నలిస్ట్ బాబు దృష్టికి తెచ్చారు. దానికి బదులిస్తూ ఆయన హైదరాబాద్ మొత్తం తెలుగు జాతిది అన్నారు. తాను హైదరాబాద్ అభివృద్ధిలో ఎంతో కీలకమైన పాత్ర పోషించాను అని అన్నారు. హైదరాబాద్ ఏ ఒక్కరితో కాదని అన్నారు.

తాను యావత్తు తెలుగు జాతి కోసం హైదరాబాద్ కి క్రియేట్ చేశాను అని ఆయన చెప్పారు. కొందరి కోసం హైదరాబాద్ కాదు అని ఆయన అన్నారు. అలా ఎవరైనా అనుకుంటే తాను ఏమీ చేయలేనని ఆయన అన్నారు. తనతో సహా ప్రతీ ఒక్కరూ సమాజం కోసం ఆలోచిస్తారని ఆయన అన్నారు.

హైదరాబాద్ సమాజం మొత్తం కోసం ఉందని అన్నారు. తెలుగు జాతి చాలా గర్వించ తగినది అన్నారు. తెలుగు వాడిగా మరో జన్మ ఉంటే పుట్టాలని తాను కోరుకుంటాను అని తాను పదే పదే చెప్పిన సంగతిని ఆయన గుర్తు చేశారు. తెలుగు వారు చాలా చురుకుగా ఉంటారు అని కొత్తగా ఆలోచిస్తారు అని ఆయన అన్నారు.

ఈ రోజు ప్రపంచం మొత్తం తెలుగు జాతి ఉందని ఆయన అన్నారు. ఈ రోజులో అగ్ర స్థానంలో ఉన్నారని అన్నారని అన్నారు. అదే సమయంలో భారతీయులు కుటుంబ బంధాలు గొప్పవని ఆయన అన్నారు. అయితే తెలుగు వారు ఏ చిన్న అవకాశం వచ్చినా అంది పుచ్చుకుని ట్రెండ్ సెట్టర్లు అయ్యారని ఆయన వ్యాఖ్యానించారు.

అందులో తన పాత్ర కూడా చాలా ఉందని బాబు చెప్పారు. ఎన్టీఆర్ తెలుగు జాతికి ఆత్మ గౌరవం ఇస్తే తాను ఆత్మ విశ్వాసం ఇచ్చానని వారి చేతిలో టెక్నాలజీ అన్న ఆయుధాన్ని అందించాను అని ఆయన గుర్తు చేశారు. ఈ రోజు దానితో ప్రపంచం అంతా వారు తమ ప్రతిభను చాటుతున్నారు అని అన్నారు.

మొత్తానికి చూస్తే హైదరాబాద్ మీద బాబు తన మనసులో మాటను స్పష్టంగా చెప్పారు. నిజానికి 1995 ప్రాంతంలో సీఎం అయిన చంద్రబాబు హైదరాబాద్ ని అభివృద్ధి చేశారు. ఆనాడు ఆయన తలచుకుని ఉండకపోతే విశ్వనగరంగా హైదరాబాద్ ఇంత వేగంగా అభివృద్ధి చెందేది కాదు అన్న భావన అందరిలో ఉంది.

హైదరాబాద్ అన్నది ఒక బ్రాండ్ గా మారింది. దానికి ఆనాటి ఉమ్మడి ఏపీ సీఎం గా చంద్రబాబు ప్రధాన కారణం అని అంటారు. ఇక బాబు హైదరాబాద్ విషయంలో మీడియా అడిగిన ప్రశ్నకు ఈ విధంగా పూర్తి వివరణతో జవాబు చెప్పడం మాత్రం సంచలంగానే ఉంది.