Begin typing your search above and press return to search.

చలో దావోస్.. బాబు ఫుల్ బిజీ

వరసబెట్టి నాలుగు రోజుల పాటు దావోస్ లో బాబు భేటీలు మీటింగ్స్ తో ఊపిరి సలపనంత బిజీగా మారనున్నారు అంటున్నారు.

By:  Tupaki Desk   |   19 Jan 2025 3:19 AM GMT
చలో దావోస్.. బాబు ఫుల్ బిజీ
X

దావోస్ టూర్ కి చంద్రబాబు రెడీ అయిపోయారు. బాబు ఆయన బృందం దావోస్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ పూర్తి స్థాయిలో ఖరారు అయింది. దీని ప్రకారం చూస్తే బాబు దావోస్ టూర్ ఫుల్ బిజీగా సాగనుంది. వరసబెట్టి నాలుగు రోజుల పాటు దావోస్ లో బాబు భేటీలు మీటింగ్స్ తో ఊపిరి సలపనంత బిజీగా మారనున్నారు అంటున్నారు. పెట్టుబడులు భారీగా ఏపీకి సాధించడమే లక్ష్యంగా బాబు దావోస్ టూర్ ని పెట్టుకున్నారు

ఈ క్రమంలో ఆయన ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలను కలుసుకుంటారు. వారితో భేటీలు వేయడం ద్వారా ఏపీ బ్రాండ్ ఇమేజ్ కి కొత్త రూపు తీసుకుని వస్తారని అంటున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం సాయంత్రం ఆయన గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా ఢిల్లీ చేరుకుంటారు. అక్కడ నుండి బయలుదేరి తన బృందంతో జ్యూరిచ్ కు చేరుకుంటారు. ముందుగా జ్యూరిచ్ లో ఉన్న ఇండియన్ అంబాసిడర్ తో భేటీ అవుతారు. అనంతరం బాబు హిల్టన్ హోటల్ లో దాదాపుగ పది మంది దాకా పారిశ్రామికవేత్తలతో తొలి భేటీ వేస్తారు అని అంటున్నారు. మరో నాలుగు గంటల పాటు రోడ్డు మార్గం ద్వారా ఆయన ప్రయాణించి దావోస్ చేరుకుంటారని అంటున్నారు.

ఇక దావోస్ లో తొలి రోజు రాత్రి అనేక మంది పారిశ్రామికవేత్తలతో ఆయన కలసి డిన్నర్ మీటింగు లో పాల్గొంటారు అని తెలుస్తోంది. ఆ తరువాత రెండో రోజు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులకు సంబంధించిన పెట్టుబడుల మీద ఆయన పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు అని అంటున్నారు. అదే విధంగా ఇంపల్స్, కోకాకోలా, వెల్ స్పన్, ఎల్ జి, కార్ల్స్ బర్గ్, సిస్కో, వాల్ మార్ట్ ఇంటర్ నేషనల్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ వంటి సంస్థల సీఈవోలతో, చైర్మన్ లతో రెండో రోజు సమావేశం అవుతారు. యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తో సీఎం చంద్రబాబు సమావేశం అవుతారని తెలుస్తోంది.

ఇక మూడవ రోజు షెడ్యూల్ చూస్తే అనేక మాంది ప్రపంచ వ్యాపార దిగ్గజాలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. అలా తొలి మూడు రోజుల్లోనే బాబు పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలతో వరస భేటీలు వేయడం ద్వారా ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులను తీసుకుని వస్తారు అని అంటున్నారు.

ఇక దావోస్ లో స్పెషల్ ఏంటి అంటే చంద్రబాబు అనేక జాతీయ అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో కూడా ఇంటరాక్ట్ అయి ఏపీకి ఉన్న బలాలు వనరులు పెట్టుబడులకు ఉన్న అవకాశాల మీద వివరిస్తారు అని అంటున్నారు. దావోస్ పర్యటనను చంద్రబాబు ఒక సవాల్ గా తీసుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో సక్సెస్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. బాబు వెంట మంత్రులు లోకేష్ టీజీ భరత్ తో పాటు పదిహేను మందితో అధికారుల బృందం కూడా దావోస్ టూర్ చేయనుంది. మొత్తానికి నాలుగో సారి సీఎం గా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఏపీ నుంచి దావోస్ కి వెళ్తున్న చంద్రబాబు తన టార్గెట్ ని సాధించేందుకు రెడీ అవుతున్నారు.