Begin typing your search above and press return to search.

ఇంట్రస్టింగ్ ఫొటో : చంద్రబాబుతో వీహెచ్.. అసలు కథేంటి?

అయితే రాజకీయాల్లో టీడీపీ శాశ్వత శత్రువు అన్న కాంగ్రెస్ పై ఆ అపప్రద పోయింది..

By:  Tupaki Desk   |   25 Feb 2025 12:21 PM IST
ఇంట్రస్టింగ్ ఫొటో : చంద్రబాబుతో వీహెచ్.. అసలు కథేంటి?
X

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు అంటారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పుట్టించే కాంగ్రెస్ ను వ్యతిరేకించి.. ఎన్టీఆర్ ఆ పార్టీని స్థాపించి కాంగ్రెస్ ను ఓడించి 9 నెలల్లో అధికారం సంపాదించారు. దేశంలో తెలుగోడి సత్తాచాటాడు. కాంగ్రెస్ పార్టీ పెద్దలను ఎదురించాడు. ఆ నాటి నుంచి మొన్నటి 2019 సార్వత్రిక ఎన్నికల వరకూ టీడీపీకి, కాంగ్రెస్ అంటే పడదు. కానీ ఈ సంప్రదాయాన్ని చంద్రబాబు అధిగమించి.. మోడీపై వ్యతిరేకతతో కాంగ్రెస్ తో కలిశారు. అదే పెద్ద మిస్టేక్ గా మారి ఆయన ఓటమికి దారితీసింది. అయితే రాజకీయాల్లో టీడీపీ శాశ్వత శత్రువు అన్న కాంగ్రెస్ పై ఆ అపప్రద పోయింది..

చంద్రబాబుకు కాంగ్రెస్ దోస్తీ కుదిరింది. ఇప్పుడు బీజేపీతో ఉన్నా కూడా ఆయన అనుయాయులు, సన్నిహితులు కాంగ్రెస్ లోనూ ఉన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒకప్పుడు చంద్రబాబు శిష్యుడే.. ఇప్పుడు కాంగ్రెస్ సీఎంగా ఉన్నారు. ఆయనతోనూ బాబుకు సత్సబంధాలు ఉన్నాయి. అందుకే పాతపగలు అన్నీ పక్కనపెట్టి కాంగ్రెస్ వారితోనూ బాబు గారు బాగానే ఉంటున్నారు.

తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఉప్పు నిప్పుగా ఇరు పార్టీలో ఉండే వీరిద్దరి కలయిక అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబును ఎన్నో సార్లు వ్యక్తిగతంగా వీహెచ్ తిట్టిపోశారు. ఆయన పాలనను, పార్టీ తీరును.. చంద్రబాబు రాజకీయ అడుగులను తప్పుపట్టారు. తీవ్ర విమర్శలు చేశారు.

అయితే ఉమ్మడి ఏపీ విడిపోవడం.. పక్కరాష్ట్రంలో బాబు సీఎం కావడం.. కాంగ్రెస్ తోనూ గతంలో కలిసిపోవడంతో ఇప్పుడు బాబుపై కోపం వీహెచ్ సహా తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో తగ్గిపోయింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని మరీ తిరిగిన బాబును ఇప్పుడు పగోడిగా ఎవ్వరూ చూడడం లేదు. అందుకే వీహెచ్ పాత పగలన్నీ పక్కనపెట్టి బాబు గారిని సృహ్రుద్భావ వాతావరణంలో కలిశాడు. ఓ పనిచేయాలని విజ్ఞప్తి చేశాడు. చంద్రబాబు నాయుడును కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు (వీహెచ్) విజయవాడలో కలిశారు. ఈ భేటీ సందర్భంగా రాష్ట్రంలో దళితులకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు.

వీహెచ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య నిజాయితీ పరుడు అని ప్రశంసించారు. ఆయన పేరిట ఒక స్మృతి వనం ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబును కోరారు. అలాగే, రాష్ట్రంలోని ఒక జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని కూడా విజ్ఞప్తి చేశారు.

ఈ ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు వీహెచ్ తెలిపారు. ఈ అంశాలపై ప్రభుత్వం త్వరలో చర్యలు తీసుకుంటుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. దామోదరం సంజీవయ్య సేవలను గుర్తు చేసుకునేలా ఈ ప్రాతిపదికలో చర్యలు తీసుకోవడం అభినందనీయమని వీహెచ్ పేర్కొన్నారు.

ఈ సమావేశంలో రాజకీయ పరిణామాలు, దళితుల అభివృద్ధికి సంబంధించి మరికొన్ని అంశాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. సీఎం చంద్రబాబు, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తూ అన్ని వర్గాలను సమానంగా ఆదరించేందుకు అంకితభావంతో ఉన్నారని వీహెచ్ అభిప్రాయపడ్డారు.