మగవాళ్లు కూడా వంటలు నేర్చుకోవాలి: చంద్రబాబు చమత్కారం
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని ఈదుపురం గ్రామంలో పర్యటించిన సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 1 Nov 2024 11:54 AM GMTప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలతో మహిళలు కూడా బిజీబిజీగా మారిపోతు న్నారని ఈ నేపథ్యంలో మగవాళ్లు సైతం వంటలు నేర్చుకోవాలని సీఎం చంద్రబాబు చమత్కరించారు. డ్వాక్రా సంఘాలకు భారీ ఎత్తున రుణ సదుపాయం కల్పించడంతోపాటు.. వారికి ఉపాధిమార్గాలను కూడా పెంచుతున్నట్టు చెప్పారు. దీంతో గతంలో మాదిరిగా మహిళలు ఇంటి పట్టున ఉండే సమయం తగ్గిపో తోందన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని ఈదుపురం గ్రామంలో పర్యటించిన సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా అసలు ఈ ఆలోచన తనకు ఎలా వచ్చిందో చెప్పుకొచ్చారు. 1995-97 మధ్య ఉన్న కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి నాయక్‌తో తనకు సత్సంబంధాలు ఉండే వని, ఆ సమయంలోనే తనకు ఉచిత గ్యాస్ సిలిండర్ ఆలోచన వచ్చిందన్నారు. దీనిని ఆయనతో పంచుకోగా.. ఇది అసాధ్యమని పక్కన పెట్టారన్నారు. కానీ, ఆతర్వాతే `దీపం` పథకం కింద సబ్సిడీ ధరలపై సిలిండర్లను పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు.
ఇక, ఇప్పుడు పూర్తిస్థాయిలో సబ్సిడీపై మహిళలకు అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. దీనిని అర్హు లంతా వినియోగించుకోవాలని సూచించారు. హామీలను అమలు చేయడంతోపాటు.. సంక్షేమ పథకాల అమలులోనూ తమ ప్రభుత్వం ముందుంటుందన్నారు. గతంలో ఎవరూ గ్యాస్ ఉచితంగా ఇవ్వలేదని... అసలు ఈ ఆలోచనే ఎవరూ చేయలేదని అన్నారు. ఇప్పుడు ఎంత ఖర్చయినా.. ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నట్టు చెప్పారు. ప్రతి విషయాన్నీ రాజకీయం చేయడం తగదని పరోక్షంగా వైసీపీని ఆయన హెచ్చరించారు.