బాబు స్పీడ్ ఆపగలమా : అపుడే అక్కడికి వెళ్ళిపోయారు !
అలాంటిది ఏపీలో బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారం చేతులలో ఉంది.
By: Tupaki Desk | 16 Sep 2024 11:30 PM GMTతెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికుడు అని అంతా అంటారు. ఆయన వ్యూహాలు అదుర్స్ అని ప్రత్యర్ధులు సైతం అంగీకరించి తీరాల్సిందే. సంక్షోభం నుంచి కూడా భవితను పునాదులు వేసుకునే నైజం బాబు సొంతం. అలాంటిది ఏపీలో బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారం చేతులలో ఉంది. అదే సమయంలో కేంద్రంలో టీడీపీ మద్దతుతో ఎన్డీయే కూటమి సర్కార్ ఉంది.
దీంతో బాబుకు ఎన్నడూ లేనంతంగా రాజకీయ అనుకూలత ఉంది. ఏపీలో వైసీపీ ప్రతిపక్షంగా ఇంకా కూడదీసుకునే పనిలోనే ఉంది. ఈ నేపథ్యంలో బాబు ఆలోచనలు ఏకంగా మరో అయిదేళ్లు ముందుకు వెళ్ళిపోయాయి అని అంటున్నారు. ఆయన ఏకంగా 2029 ఎన్నికల గురించి 2024లో ఆలోచిస్తున్నారు అంటే ఆ స్పీడ్ ఆపగలమా అన్నదే చర్చగా ఉంది.
లేటెస్ట్ గా ఢిల్లీలో జరుగుతున్న హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సదస్సులో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలే వ్యాఖ్యలు చేశారు. ఏపీలో తాము ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలిస్తున్నామని అన్నారు. అంతే కాదు తమ ఆలోచనలు అన్నీ కూడా అభివృద్ధి, సంక్షేమం రెండూ కో ఆర్డినేట్ చేసుకునే విధంగా సాగుతున్నాయని చెప్పారు
ఇక తాము 2024 ఎన్నికల్లో ఏకపక్షంగా గెలిచామని ఆయన చెప్పారు. అయితే ఇపుడు తమ ఆలోచనలు 2029 ఎన్నికల మీద ఉన్నాయని బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం అవుతున్నామని ఆయన చెప్పడం విశేషం.
ఏపీలో ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి టీడీపీ కూటమిని గెలిపించారని బాబు గుర్తు చేశారు. అయిదేళ్ల పాటు ఏపీని పాలించిన వైసీపీ ప్రభుత్వం మీద ప్రజలలో అతి పెద్ద వ్యతిరేకత వచ్చిందని, దాంతో ఎన్నికల ముందే ఈ తరహా ఫలితాలు వస్తాయని ఊహించామని అన్నారు
పైగా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా కూటమిని కట్టడంతో వన్ సైడెడ్ గా రిజల్ట్ వచ్చిందని బాబు విశ్లేషించారు. ప్రజలు కూడా చాలా స్పష్టంగా ఉన్నారని వైసీపీని పూర్తి స్థాయిలో పక్కన పెట్టాలన్న వారి ఆలోచనల ఫలితమే టీడీపీ కూటమి ఘన విజయం అన్నారు.
ఇదిలా ఉంటే అధికారంలోకి వచ్చిన తరువాత గత అయిదు నెలల పాలనలో కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కో ఆర్డినేట్ చేసుకుంటూ పనిచేస్తోందని అన్నారు. కూటమి పార్టీల మధ్య ఎలాంటి సమస్యలు లేవని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.
అందరం ఒకే మాట అనుకుని కలసి ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు. ఇదే స్పూర్తితో 2029 ఎన్నికలను కూడా ఎదుర్కోవాలని ఇప్పటి నుంచే నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు. కూటమి పాలన కేవలం ఒక ఎన్నికకూ అలాగే అయిదేళ్ల పాలనకు మాత్రమే పరిమితం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు
సుదీర్ఘ కాలం పాటు కూటమి పాలన సాగుతుందని ఆయన చెబుతూ కూటమి పార్టీలో పొత్తు ఎల్లపుడూ కొనసాగుతుందని చెప్పేశారు. అంటే 2029 ఎన్నికల్లో కూడా బీజేపీ జనసేనలతో కలసి పోటీ చేస్తామని ఆయన తేల్చారు అన్న మాట. అంతే కాదు ఈ రోజు నుంచే ఆ ఎన్నికలకు రెడీ అవుతున్నామని రాజకీయ చాణక్యుడు చంద్రబాబు చెప్పారు అంటే విపక్షంలో వైసీపీ పూర్తి స్థాయిలో అలెర్ట్ కావాల్సిందే.
కేవలం 23 మంది ఎమ్మెల్యేలతో విపక్షంలో ఉన్నపుడే బాబు వీర లెవెల్ లో వ్యూహాలు అమలు చేశారు. ఇపుడు చేతిలో అధికారం ఉంది, కేంద్రం మద్దతు దండిగా ఉంది. సో బాబుని ఎదుర్కోవడం అంత ఈజీ టాస్క్ కాదని వైసీపీ నేతలు గ్రహించాల్సి ఉందని అంటున్నారు.