బాబు తాజా నిర్ణయంతో పేదల లోగిళ్ళలో వెలుగులే !
ఇపుడు అలాంటిదే మరో వినూత్న ఆలోచన బాబు చేయబోతున్నారు అని అంటున్నారు.
By: Tupaki Desk | 31 Oct 2024 1:30 AM GMTచంద్రబాబు సరికొత్త ఆలోచన చేయబోతున్నారు అని అంటున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఇది నాలుగోసారి. గతంలో మూడు పర్యాయాలూ సీఎం గా ఉన్న టైం లో ఆయన పేదల సంక్షేమం తో పాటు సంస్కరణలకు కూడా చోటిచ్చారు. ఆ విధంగా వాటిని మిక్స్ చేయడం ద్వారా చంద్రబాబు ఎంతో ప్రగతిని సాధించారు. అనేక సంస్కరణలు కూడా బాబు హయాంలోనే వచ్చాయి. వాటి వల్ల ఎక్కువగా పేదలు లబ్ది పొందారు. ఇపుడు అలాంటిదే మరో వినూత్న ఆలోచన బాబు చేయబోతున్నారు అని అంటున్నారు.
ఏపీలోని ఏకంగా లక్షా యాభై వేల మంది పేదల కుటుంబాలకు విద్యుత్ ఉపకరణాలు పంపిణీ చేసేందుకు బాబు ఆలోచిస్తున్నారు. ఆ దిశగా నిర్ణయం అయితే జరిగిపోయింది అని అంటున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ తో ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పోరేషన్ అలాగే ఏపీ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ తాజాగా ఒక కొత్త ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలుస్తోంది. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే ఈ కీలక ఒప్పందం కుదిరింది.
దాని ప్రకారం చూస్తే ఏపీలోని లక్షా యాభై వేల ఇళ్ళకు ఎల్ఈడీ బల్బులు, ట్యూబ్ లైట్లు, బీఎల్ డీసీ ఫ్యాన్లు పంపిణీ చేయనున్నారు. వీటి వల్ల విద్యుత్ పెద్ద ఎత్తున పొదుపు చేసేందుకు వీలు పడుతుంది. ఈ ఒప్పందం మేరకు ఏపీవ్యాప్తంగా పేదల కుటుంబాలలో ప్రతీ ఇంటికీ నలుగు ఎల్ఈడీ బల్బులు, రెండు బాటిన్ ట్యూబులైట్లు, రెండు ఫైవ్ స్టార్ బీఎల్ డీసీ ఫ్యాన్లు అందిస్తారు అని అంటున్నారు.
దీంతో ప్రతీ ఇంట్లో పెద్ద ఎత్తుల విద్యుత్ ని పొదుపు చేసేందుకు వీలు అవుతుంది. ఏపీలో తొందరలోనే ఈఈఎస్ఎల్ అధికారులు ఈ విద్యుత్ ఉపకరణాలను పంపిణీ చేస్తారు అని అంటున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా విద్యుత్ ని పొదుపు చేయడం మీద దృష్టి పెడుతోంది. అలా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపడుతోంది. దాంతో కేంద్రంతో చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న నేపధ్యంలో ఏపీలో పేదల ఇంట్లో కొత్త వెలుగులు రాబోతున్నాయి.
ఇక కూటమి ప్రభుత్వం పంపిణీ చేయనున్న బి ఎల్ డీసీ ఫ్యాన్ల వల్ల కూలింగ్ పూర్తిగా ఉంటుందని అంటున్నారు. ఇది ఎంతో ఉపయోగకరం అని చెబుతున్నారు. అలాగే ఎల్ ఈడీ బల్బులు బాటన్ ట్యూబులైట్లతో అధికంగా విద్యుతు వెలుగులు ప్రసరిస్తాయని అంటున్నారు.
చంద్రబాబు ఎపుడూ సంస్కరణ నుంచి మంచి ఫలితాలు రాబట్టారు. 2014 నుంచి 2019లో బాబు సీఎం గా ఉండగా ఏపీలోని వీధి లైట్లకు ఎల్ ఈడీ దీపాలు అమర్చి విద్యుత్ పొదుపు ని తీసుకుని వచ్చారు. దాని వల్ల లోకల్ బాడీస్ కి ఎంతో ఖర్చు తగ్గింది. ఇపుడు తీసుకుంటున్న ఈ నిర్ణయంతో బాబు మరోసారి ఏపీలో విద్యుత్ ఆదాకు తెర తీస్తున్నారు. దీని వల్ల పేదలకు కూడా పూర్తిగా న్యాయం జరుగుతుంది. వారు తక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్ ప్రయోజనాలు పొందుతారు అని అంటున్నారు.