Begin typing your search above and press return to search.

ఆంధ్రాలో ఆధ్యాత్మిక పరిమళం...బాబుతో ఆ ఇద్దరూ...!

అదే విధంగా పేరు గడించిన విద్యా సంస్థలు కూడా ఏపీకి క్యూ కడుతున్నాయి.

By:  Tupaki Desk   |   14 Nov 2024 4:23 PM GMT
ఆంధ్రాలో ఆధ్యాత్మిక పరిమళం...బాబుతో ఆ ఇద్దరూ...!
X

ఏపీలో పెట్టుబడులు పెద్ద ఎత్తున తీసుకుని రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలు కేవలం అయిదు నెలలలోనే ఫలవంతం అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 65 వేల కోట్లతో రిలయెన్స్ పెట్టుబుడుల మీద ఒప్పందాలు జరిగాయి. టాటా, అదానీ వంటి వారు ఏపీ వైపు చూస్తున్నారు

అదే విధంగా పేరు గడించిన విద్యా సంస్థలు కూడా ఏపీకి క్యూ కడుతున్నాయి. ఈసారి తప్పకుండా ఏపీలో బాబు మార్క్ విజన్ తో అభివృద్ధి జరుగుతుందని అంతా నమ్ముతున్నారు. అమరావతి రాజధానికి కూడా నిధులు సమకూరుతూండడంతో బాబు చెప్పిన తీరుగా రానున్న కాలంలో ప్రపంచ రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటుంది అంతా విశ్వసిస్తున్నారు

ఈ క్రమంలో మేధావులు పారిశ్రామికవేత్తలతో పాటు ఆధ్యాత్మిక వేత్తలు కూడా ఏపీ వైపు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. వారు కూడా తన సంస్థలను ఏపీలో ఏర్పాటు చేయడం ద్వారా ఏపీకి ఆధ్యాతిక పరిమళాన్ని తీసుకుని రావాలని చూస్తున్నారు.

బాబు సీఎం అయ్యాక మొదటిగా ఆధ్యాత్మిక గురువు బాబా రాందేవ్ ఏపీకి వచ్చారు. ఆయన చంద్రబాబుతో భేటీ అయి చర్చలు జరిపారు. ఆయన ఏపీలో పెట్టుబడులు పెట్టి ఏపీ ప్రజలకు యోగా నేర్పిస్తామని ప్రతిపాదించారని అంటున్నారు.

ఇక చూస్తే తాజాగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు అయిన రవిశంకర్ చంద్రబాబుని లేటెస్ట్ గా కలిశారు. ఈ సందర్భంగా యాభై నిముషాలకు పైగా చంద్రబాబు రవిశంకర్ మధ్య సమావేశం జరిగింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఏపీలో కూడా ఏర్పాటు చేయడానికి రవిశంకర్ చూస్తున్నారు అని అంటున్నారు.

ఇక ఏపీలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థని ఏర్పాటు చేయడం ద్వారా ఆధ్యాత్మిక శోభ వస్తుందని అంటున్నారు. అంతే కాదు ప్రపంచ స్థాయి గుర్తింపు కూడా ఏపీకి వస్తుందని అంటున్నారు. అలాగే యోగా గురువు రాందేవ్ బాబా ఏర్పాటు చేసే యోగా నిలయం వల్ల కూడా ఏపీకి కొత్త హంగులు వస్తాయని అంటున్నారు.

దీని వల్ల ఏపీకి మంచి సంకేతాలే వస్తున్నాయని అంటున్నారు. చంద్రబాబు తనదైన దార్శనికతతో పెట్టుబడిదార్లనే కాకుండా ఆధ్యాత్మిక గురువులను కూడా ఆకట్టుకుంటున్నారు అని అంటున్నారు. దీంతో రానున్న రోజులలో మరింత మంది ఆధ్యాత్మిక పరులు ఏపీకి పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది అని అంటున్నారు. మొత్తానికి బాబు తనదైన విజనరీతో ఏపీకి అన్ని రంగాలలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుందని అంటున్నారు.