Begin typing your search above and press return to search.

త‌మ్ముళ్ల సిత్రాలు: ఇవి తెలుసా బాబూ ..!

ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయిన తర్వాత 'ఇది మంచి ప్రభుత్వం' పేరుతో చంద్రబాబు పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

By:  Tupaki Desk   |   10 Oct 2024 12:30 AM GMT
త‌మ్ముళ్ల సిత్రాలు:  ఇవి తెలుసా బాబూ ..!
X

రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా అంతిమంగా పార్టీకే ఇబ్బంది అవుతుంది. పార్టీ అధినేతకే నష్టం వస్తుంది. ఇది కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం. గతంలో వైసిపి నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన కార్యక్రమాలు, అవినీతి, లంచాలు వంటివి అంతిమంగా జగన్కే చుట్టుకున్నాయి. అధికారం పోయింది. ఇతరులు పెద్దగా లెక్కచేయరు. ఎలాగూ వాళ్ళన్న‌టికీ సిద్ధమయ్యే చేశారు కాబట్టి. ఇప్పుడు ఈ పరిస్థితి టిడిపిలో కూడా వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయిన తర్వాత 'ఇది మంచి ప్రభుత్వం' పేరుతో చంద్రబాబు పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఆయన పెట్టిన పేరులోనే `ఇది మంచి ప్రభుత్వం` అని ఉండడంతో విపక్షాలు కూడా దానిమీద విమర్శలు చేయలేకపోయాయి. ఎందుకంటే ఎవరు మాట్లాడాలి అన్నా ముందు నోటు వెంట `ఇది మంచి ప్రభుత్వం` అనే రావాలి. కాబట్టి వైసిపి నాయకులు దాని జోలికి వెళ్ళలేదు. కానీ, ఇప్పుడు టిడిపి నాయకులు ఎలా ఉన్నా టిడిపిలో క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు నాయకుల వ్యవహార శైలి కారణంగా ఇది మంచి ప్రభుత్వం కాస్త వేరే రూట్ లో వెళ్ళిపోతుంది. పైకి కనిపిస్తున్న ఇసుక లిక్కర్ వంటి వాటిని పక్కన పెడితే(ఎందుకంటే వీట్లో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు వంటివి టిడిపి అనుకూల మీడియాలోనే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది)

ఎమ్మెల్యేలు దారి తప్పేసారని ఎమ్మెల్యేలు మారాలని ఎమ్మెల్యేలు కలెక్షన్ కింగ్లుగా మారిపోయారని పెద్ద ఎత్తున టిడిపి అనుకూల మీడియాలోనే గత నాలుగు రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇక పైకి కనిపించని మరో కోణం కూడా ఎమ్మెల్యేల్లో ఉండడం ఇప్పుడు టిడిపిని మరింత ఇబ్బందుల్లో పడేస్తోంది. వాలంటీర్ వ్యవస్థ లేకపోవడంతో ఏ చిన్న పని కావాలన్నా కార్పొరేటర్ దగ్గరకు లేకపోతే ఎమ్మెల్యేను లేకపోతే ఎమ్మెల్యే పీఏలను సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రాష్ట్రవ్యాప్తంగా ఏ చిన్న పని జరగాలన్న కనీసం ఒక బ‌ర్త్‌ సర్టిఫికెట్ కావాలన్నా ఒక డెత్ సర్టిఫికెట్ కావాలన్నా కూడా మంత్రులను ఎమ్మెల్యేలను సంప్రదించే పరిస్థితి వచ్చింది. ఇలా ఎందుకు జరిగిందో ఎవరికి తెలియట్లేదు. సాధారణంగా ఇలాంటివి కావలసి వచ్చినప్పుడు మున్సిపాలిటీ లేదా పంచాయతీ ఆఫీసులను కలిసి తెచ్చుకునే సౌలభ్యం ఉండేది. కానీ ఇప్పుడు అనూహ్యంగా ప్రతిదీ త్రు ఎమ్మెల్యే, త్రు మంత్రి అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. దీంతో తమకు అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టకుండా ప్రతిదానికి నాయకులు రేట్ కట్టేశారు.

ఇటీవల కర్నూలు జిల్లాలోని ఒక కీలక నియోజకవర్గం లో మహిళా ఎమ్మెల్యేగా ఉన్నచోట రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆక్సిడెంట్ కేసులో ఎఫ్ఐఆర్ కట్టాలంటే ఎమ్మెల్యే నుంచి అనుమతి కావాలని ఒక పోలీస్ స్టేషన్ అధికారి పేర్కొన్నారు. ఇది నిజం. దీంతో బాధిత కుటుంబం వెళ్లి ఎమ్మెల్యేను కలిశారు. ఆమె తన పీఏను కలవాలని సూచించారు. కలిసిన తర్వాత పరిస్థితి మరింత మారిపోయింది. అక్కడ పిఏ కి 5000 నుంచి 10000 వరకు డిమాండ్ చేసినట్టు బాధితు కుటుంబమే ఆరోపించింది,

దీంతో వారు నేరుగా జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఎఫ్ఐఆర్ నమోదు చేసేలాగా ఆదేశాలు తెచ్చుకున్నారు. మరోచోట బ‌ర్త్‌ సర్టిఫికెట్ కి కూడా ఓ టిడిపి కార్పొరేటర్ డబ్బులు డిమాండ్ చేయడం గ‌మ‌నార్హం. ఇలా ఎక్కువ మంది ప్రజలు ప్రభావితమయ్యేటటువంటి ప‌నులు చేస్తే.. టీడీపీ న‌ష్ట పోయే అవకాశం కనిపిస్తోంది. దీనివల్ల అంతిమంగా నష్టపోయేది పార్టీ నాయకులు కన్నా చంద్రబాబు అనేది విశ్లేషకులు మాట.