Begin typing your search above and press return to search.

చెప్పక జ‌గ‌ను.. చెప్పి బాబు.. త‌ప్పులు ఇవే.. !

కొన్ని కొన్ని విష‌యాల్లో అయితే.. ఇలా ఎందుకు చేస్తున్నార‌న్న ప్ర‌శ్న‌లు కూడా తెర‌మీదికి వ‌చ్చాయి.

By:  Tupaki Desk   |   8 Jan 2025 7:30 AM GMT
చెప్పక జ‌గ‌ను.. చెప్పి బాబు.. త‌ప్పులు ఇవే.. !
X

కొన్ని కొన్ని విష‌యాలు ప్ర‌జ‌ల‌కు చెప్ప‌కుండా ఉంటేనే మంచిద‌న్న ధోర‌ణితో వైసీపీ అధినేత జ‌గ‌న్ త‌న పాల‌నా కాలంలో వ్య‌వ‌హ‌రించారు. దీంతో దాదాపు అన్ని విష‌యాలు కూడా.. చాలా ర‌హస్యంగానే సాగాయి. కొన్ని కొన్ని విష‌యాల్లో అయితే.. ఇలా ఎందుకు చేస్తున్నార‌న్న ప్ర‌శ్న‌లు కూడా తెర‌మీదికి వ‌చ్చాయి. ఇలాంటివాటిలో కీల‌క‌మైన అంశాలు.. అప్పులు, ల్యాండ్‌టైటిలింగ్ యాక్ట్‌, ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం ప్రాజెక్టు, అమ‌రావ‌తి వంటి అంశాలు ఉన్నాయి.

ఈ విష‌యాల్లో అప్ప‌టి ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ చాలా గోప్యత పాటించారు. ఒక ర‌కంగా చెప్పాలంటే అంతః పుర ర‌హ‌స్యాలు అన‌ద‌గ్గ విధంగా ఆయ‌న వ్య‌వ‌హ‌రించారు. దీంతో అస‌లు ఆయా ప్రాజెక్టుల విష‌యంలో ఏం జ‌రిగింద‌న్న విష‌యంపై ప్ర‌జ‌ల‌కు తెలియ‌కుండా పోయింది. ఇది చాలా వ‌ర‌కు వ్య‌తిరేక‌త‌ను పెం చింది. ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు అప్పులు చేస్తున్నార‌న్న ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌లు.. వైసీపీ పుట్టి ముం చాయి. దీనిపై ఇప్ప‌టికీ స్ప‌ష్ట‌త లేదు. ఎంత అప్పు చేశారంటే అసెంబ్లీలో ఒక‌ర‌కంగా.. బ‌య‌ట మ‌రో విధంగా అధికార ప‌క్షం చెబుతూనే ఉంది. దీంతో ప్ర‌జ‌ల్లోనూ దీనిపై క‌న్ఫ్యూజ‌న్ కొన‌సాగుతోంది. ఏదేమైనా జ‌గ‌న్ ను అధికారంలోకి రాకుండా చేసింది ఈ గోప్య‌తే!

ఇక‌, ప్ర‌స్తుత కూట‌మి ప్ర‌భుత్వం విష‌యానికి వ‌స్తే.. కొన్ని కొన్ని విషయాల‌ను ఓపెన్‌గా చెబుతున్నారు. అటు సీఎం చంద్ర‌బాబు, మంత్రులు నారా లోకేష్ వంటివారు.. బ‌హిరంగంగానే ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉంద‌ని.. నెల‌కు రూ.4000 కోట్ల లోటును ఎదుర్కొంటోంద‌ని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. ఇక‌, పార్టీ ప్ర‌భుత్వం వ‌చ్చి ఏడు మాసాలైనా ఇంకా వ్య‌వ‌స్థ‌ల‌ను గాడిలో పెడుతున్నామ‌ని.. జ‌గ‌న్ చేసిన త‌ప్పులు స‌రిదిద్దుతున్నామ‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు. అంతేకాదు.. ఈయ‌న బాట‌లోనే మంత్రులు కూడా న‌డుస్తున్నారు.

ఇటీవ‌ల విశాఖ సెంట్ర‌ల్ జైల్లో గంజాయి మొక్క క‌నిపించింది. ఇది చిన్న‌పాటి రెండు అంగుళాల మొక్క. ఇది పెరిగేందుకు 20-30 రోజులు ప‌ట్టి ఉంటుంద‌ని పోలీసులే చెప్పారు. కానీ, మంత్రి అనిత మాత్రం ఈ పాపం జ‌గ‌న్‌దేన‌ని తీర్పు చెప్పారు. ఇక‌, అప్పులు చేయాల్సి వ‌స్తుంటే.. దీనిని దాస్తున్నారు. కానీ.. లోటును మాత్రం చెబుతున్నారు. ఇలా.. కొన్ని విష‌యాలు చెప్ప‌డం త‌ప్పుకాదు. కానీ, వీటి వెనుక సంక్షేమ ప‌థ‌కాల‌ను నిలిపివేస్తున్నార‌న్న సంకేతాల‌ను ప్ర‌జ‌ల్లోకి పంపుతున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అంటే.. అప్ప‌ట్లో జ‌గ‌న్ చెప్ప‌కుండా త‌ప్పులు చేస్తే.. ఇప్పుడు కూట‌మి స‌ర్కారు కొన్ని విష‌యాలు చెప్పి త‌ప్పు చేస్తోంద‌న్న అభిప్రాయం ఉంది.