Begin typing your search above and press return to search.

భువనేశ్వరి పుత్రోత్సాహం... లోకేష్ పై కామెంట్స్ వైరల్!

శనివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పేరెంట్స్ - టీచర్స్ మీటింగ్ జరిగింది.

By:  Tupaki Desk   |   8 Dec 2024 5:32 AM GMT
భువనేశ్వరి పుత్రోత్సాహం... లోకేష్  పై కామెంట్స్  వైరల్!
X

తల్లితండ్రులంతా తమ పిల్లలు ఎలా చదువుతున్నారు.. ఏమి చేస్తున్నారు.. వారి క్రమశిక్షణ, నడవడిక, ఆలోచనా విధానం ఎలా ఉందో తెలుసుకోవాలని.. బడిలో ఉపాధ్యాయులతోనూ మమేకమవ్వాలనే ఉద్దేశ్యంతో దేశచరిత్రలో తొలిసారిగా రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఒకే రోజు 44వేల పైచిలుకు పాఠశాలలకు మెగా పేరెంట్ – టీచర్స్ సమావేశాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.

శనివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పేరెంట్స్ - టీచర్స్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులంతా హాజరయ్యారు. ఈ సమయంలో బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశానికి సీఎం చంద్రబాబు, నారా లోకేష్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన తెరపైకి వచ్చింది. దీనిపై భువనేశ్వరి స్పందించారు.

అవును... ఏపీలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన టీచర్స్ – పేరెంట్స్ సమావేశాలను పురస్కరించుకుని చంద్రబాబు, లోకేష్ లు బాపట్లలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్కూలు పిల్లలతో కలిసి అక్కడ ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజనం చేశారు. చంద్రబాబు, లోకేష్.. ఇద్దరూ నేలపైనే కుర్చుని భోజనం చేశారు.

ఈ సమయంలో... భోజనం అనంతరం చంద్రబాబు తాను తిన్న ప్లేటును అక్కడే వదిలేయగా.. నారా లోకేష్ తన భోజనం అనంతరం తన ప్లేట్ తో పాటు తన తండ్రి, సీఎం చంద్రబాబు భోజనం చేసిన ప్లేటును కూడా ఎత్తారు. వెంటనే సహాయకురాలు రావడంతో ఆమెకు ఆ రెండు ప్లేట్లు, గ్లాసులు అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.

వీటికి సంబంధించిన దృశ్యాలు చూసి తిలకించి, మురిసిపోయిన నారా భునవేశ్వరి.. తన పుత్రోత్సాహాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా తన ఆనందాన్ని వెల్లడిస్తూ.. తన సుపుత్రుడిని అభినందనలతో ముంచెత్తారు. ఇందులో భాగంగా... "వెల్ డన్ నారా లోకేష్" అంటూ ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు.

ఈ క్రమంలో... చంద్రబాబు గారు భోజనం చేసిన ప్లేట్ ను తీసుకుని శుభ్రపరిచే ప్రయత్నం చేయడం నీ ఆలోచనాత్మకమైన దృక్పథాన్ని ప్రతిభింబిస్తోందని.. భోజనం అనంతరం శుభ్రం చేస్తున్న పాఠశాల సిబ్బందికి సాయపడటం బాగుందని.. తల్లితండ్రుల పట్ల మీకున్న అత్యంత గౌరవాన్ని ఈ ఘటన చాటి చెబుతుందని అన్నారు.

ఇదే సమయంలో... ప్రతిరోజూ మనకు సహాయం చేసేవారి పట్ల మీ వినయం, గౌరవాన్ని కూడా చూపుతోందని.. ఇది నిజంగా స్ఫూర్తిదాయకం అని భువనేశ్వరి తన పుత్రోత్సాహాన్ని వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.