బాబు పవన్...ఏమి మాట్లాడుకున్నారు...?
ఈ భేటీని ఏపీలో పాలనా పరంగా అతి ముఖ్యమైన సమావేశంగా కూడా చూస్తున్నారు.
By: Tupaki Desk | 2 Dec 2024 12:14 PM GMTచాలా కాలం తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల మధ్య సుదీర్ఘ భేటీ జరిగింది. ఈ భేటీ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగింది. ఇది హై ప్రొఫైల్ భేటీ అని అంతా అంటున్నారు. ఈ భేటీని ఏపీలో పాలనా పరంగా అతి ముఖ్యమైన సమావేశంగా కూడా చూస్తున్నారు.
రెండు గంటల పాటు సాగిన భేటీలో బాబు పవన్ అనేక అంశాలను చర్చించారు అని అంటున్నారు. ఈ భేటీలో అనేక అంశాలు ఇద్దరి మధ్య చర్చకు వచ్చాయని చెబుతున్నారు. అందులో ప్రస్తుతం ఏపీలో భారీ చర్చకు దారి తీసిన కాకినాడ పోర్టులో అక్రమంగా బియ్యం రవాణా కావడం అన్నది.
దీని మీదపాన్ చాలా పట్టుదలగా ఉన్నారు. ఇక్కడ అక్రమ కార్యకలాపాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయని అంటున్నారు. అంతే కాదు స్మగ్లింగ్ కూడా జరుగుతోందని వీటికి అరికట్టాల్సిన అవసరం ఉందని కూడా అంటున్నారు. పైగా పవన్ స్వయంగా బీచ్ లోకి వెళ్ళి మరీ సీజ్ ది షిప్ అని అన్న తరువాత సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మొత్తం విషయాలను చంద్రబాబు పవన్ చర్చించారని కాకినాడ పోర్టులో అక్రమంగా సాగుతున్నా కార్యకలాపాలకు చెక్ పెట్టాలని చూస్తున్నారు అని అంటున్నారు.
చంద్రబాబు తన నైపుణ్యాన్ని జోడించి ఈ అంశానికి ఒక కీలకమైన ముగింపు కనుగొనాలని పవన్ కోరారని అంటున్నారు. ఈ విధంగా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలతో రంగంలోకి దిగితే కనుక కాకినాడ పోర్టులో అక్రమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో తగ్గుతాయని అంటున్నారు.
మరో వైపు రాజ్యసభ సీట్లు ఏపీలో మూడు భర్తీ కానున్నాయి. వీటిలో రెండు టీడీపీకి ఒకటి బీజేపీకి అన్న ప్రచారం సాగుతోంది. జనసేనకు ఈసారి చాన్స్ లేదని అంటున్నా ఈ విషయంలోనూ కూటమి పెద్దలుగా బాబు పవన్ కూలంకషంగా చర్చించారని అంటున్నారు. ఈ విషయంలో పవన్ తన అభిప్రాయాలను ముఖ్యమంత్రితో పంచుకున్నారని అంటున్నారు.
అదే విధంగా సోషల్ మీడియాను దుర్వినియోగం చేసిన వారి మీద ఏపీలో కేసులు పెడుతున్నారు. దీని పురోగతితో పాటు ఈ అంశంలో మరింతగా ఏమేమి చర్యలు తీసుకోవాలన్న దాని మీద కూడా ఇరువురు నేతలు చర్చించినట్లుగా తెలుస్తోంది. మరో వైపు చూస్తే సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసి పోస్టింగులు పెట్టిన వారి మీద కేసులు నమోదు చేయడంతో గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అసభ్య పోస్టింగుల తాకిడి తగ్గిందని కూడా అంటున్నారు. దాంతో ఇంకా ఏమి చేయాలన్న దాని మీద చర్చించారని అంటున్నారు.
మంగళవారం ఏపీ కేబినెట్ మీటింగ్ ఉంది. అందులో చర్చించవలసిన అంశాలు అంతే కాకుండా ఆమోదించాల్సిన అంశాల గురించి చర్చించారని అంటున్నారు. నిజానికి చంద్రబాబు పవన్ భేటీలో రాజకీయ అంశాలు కూడా అనేకం వచ్చాయని తెలుస్తొంది.
ఇటీవల పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు అనేక మంది కేంద్ర మంత్రులను కలిసారు. అదే విధంగా ప్రధాని నరేంద్ర మోడీతో అరగంటకు పైగా భేటీ అయ్యారు. ఈ విధంగా పవన్ ఢిల్లీ టూర్ కి సంబంధిచిన అంశాలను కూడా బాబుతో పంచుకున్నట్లుగా తెలుస్తోంది.
ఈ విధంగా బాబు పవన్ ల మధ్య ఆసక్తికరమైన భేటీ సాగింది అని అంటున్నారు. అటు ఢిల్లీలో నాలుగు రోజుల పాటు గడిపిన పవన్ ఒకే వారంలో బాబుతో మోడీతో భేటీలు వేశారు. మొత్తానికి ఢిల్లీలో ఎన్డీయే కూటమికి అలాగే ఏపీలో టీడీపీ కూటమికి మధ్య అనుసంధానంగా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఏది ఏమైనా ఈ భేటీలో మాత్రం అర్ధవంతమైన చర్చ సాగిందని అంటున్నారు. వాటి ఫలితాలు తొందరలోనే వస్తాయని అంటున్నారు.