Begin typing your search above and press return to search.

బోల్డ్ గా సర్కార్ గురించి చెప్పిన చంద్రన్న

ఆ మాత్రం లౌక్యం లేకపోతే బాబు సుదీర్ఘమైన రాజకీయ జీవితం కొనసాగించలేరు కదా.

By:  Tupaki Desk   |   1 Nov 2024 1:24 PM
బోల్డ్ గా సర్కార్ గురించి చెప్పిన చంద్రన్న
X

టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏది బాహాటంగా చెప్పాలి, ఏది సీక్రెట్ గా ఉంచాలి అన్నది బాగా తెలుసు. ఆ మాత్రం లౌక్యం లేకపోతే బాబు సుదీర్ఘమైన రాజకీయ జీవితం కొనసాగించలేరు కదా. ఆయన చాలా విషయాల్లో ఈ భేదాలు చూసుకుంటారు.

ఏది జనాలకు చెప్పాలి అలా చెప్పడం వల్ల ఎంత ఉపయోగం అనంది కూడా బేరీజు వేసుకుంటారు. ఇపుడు బాబు ఒకటే మాట చెబుతున్నారు. అది కూడా పదే పదే చెబుతున్నారు. ఎందుకు అంటే జనాల బుర్రలలో ఎక్కాలని. తద్వారా తన ప్రభుత్వం మీద ఒత్తిడి తగ్గించుకోవాలని ఆయన చూస్తున్నారు.

అందుకే బాబు బోల్డ్ గా చెప్పాల్సింది చెప్పేసారు. ప్రభుత్వం వద్ద డబ్బులు అయితే లేవు అని ఆయన నిక్కచ్చిగా చెప్పేశారు. ఖజానాలో సొమ్ములు లేవు అని గద్దెనెక్కిన మరుసటి రోజు నుంచే బాబు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన శ్రీకాకుళం జిల్లాకు తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో వచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు అని మరో మారు క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో మానవత్వం మాత్రం చాలానే ఉంది అని ఆయన చెప్పారు. అందుకే ఎంతో భారమైనా కూడా ఉచిత పధకాలను పంటి బిగువున అమలు చేస్తున్నామని అన్నారు. అంటే డబ్బులు ఉంటే ఎవరైనా ఏ పధకం అయినా ఇవ్వడం సులువు.

కానీ లేని టైం లో కూడా తాము అమలు చేస్తున్నామంటే అర్థం చేసుకోవాలని జనం రెట్టింపు మార్కులు ఇవ్వాలని బాబు కోరుకుంటున్నారన్నమాట. అంతే కాదు బాబు మరో మాట అన్నారు. ఇది కూడా కూటమి ప్రభుత్వానికి క్రెడిట్ ఇచ్చేదే. దేశంలోనే నాలుగు వేల రూపాయల సామాజిక పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఒక్క ఏపీ తప్ప మరోటి లేదని అన్నారు. ఆ విధంగా తాము మంచి చేస్తూ అందరినీ ఆదుకుంటున్నామని ఆయన చెప్పుకొచ్చారు.

టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక్కో హామీని నెరవేరుస్తోందని బాబు చెప్పారు. అందులో భాగమే ఉచిత సిలిండర్ పధకం అని ఆయన అన్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి ఎంతో ఆర్థిక భారం అయినప్పటికీ ప్రజల మేలు కోసం అమలు చేస్తున్నామని అన్నారు.

ఉచిత గ్యాస్ సిలిండర్ కి చెల్లించిన డబ్బులను 48 గంటలలోనే రిఫండ్ చేస్తామని బాబు చెప్పారు. దీని కంటేముందు అసలు సిలిండర్ కి డబ్బులు కట్టే పరిస్థితి లేకుండా చూస్తున్నామని అన్నారు. అంతే కాదు డ్వాక్రా మహిళలకు పూర్వ వైభవం తీసుకుని వస్తామని అన్నారు. వారికి రివాల్వింగ్ ఫండ్, అలాగే వడ్డీలేని రుణాలు చెల్లించామని కూడ ఆయన గుర్తు చేశారు.

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో బాబు దీపం పధకం 2 ని ప్రారంభించిన సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేస్తుందో వివరించారు. సంక్షేమమంలో ది బెస్ట్ గా ఏపీని తీర్చిదిద్దుతున్నామని అన్నారు. వైసీపీ హయాంలో పాడైన వ్యవస్థలను ఒక్కో దానిని గాడిన పెడుతున్నామని కూడా బాబు చెప్పుకొచ్చారు.

మొత్తానికి బాబు బోల్డ్ గా మాట్లాడారు అంటే ఆ మాటలు జనం చెవిలో ఎక్కాలని వారు ప్రభుత్వానికి అవసరమైనంత టైం ఇస్తే అన్నీ ఒక్కోటి అమలు చేసి పెడతామని కూడా అంటున్నారు. మొత్తానికి బాబు బోల్డ్ నెస్ కి జనాలు మెచ్చుకుంటారా లేక ఖజానా గోల మాకెందుకు పధకాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తారో. ఏమో చూడాల్సి ఉంది మరి.