Begin typing your search above and press return to search.

బీజేపీలో బాబు యాంటీ బ్యాచ్ కి టికెట్లు దక్కవా...!?

వారు టీడీపీతో పొత్తులు వద్దు అని పదే పదే చెప్పిన వారుగా ప్రచారంలో ఉన్న మాట. పైగా బీజేపీలో మొదటి నుంచి ఉన్న వారు.

By:  Tupaki Desk   |   11 March 2024 4:12 AM GMT
బీజేపీలో బాబు యాంటీ బ్యాచ్ కి  టికెట్లు దక్కవా...!?
X

ఏపీ బీజేపీలో ముగ్గురు కీలక నేతలు ఉన్నారు వారికి టికెట్లు దక్కవని ప్రచారం ఒక లెక్కన సాగుతోంది. వారు టీడీపీని పూర్తిగా వ్యతిరేకించే టీం గా బీజేపీలో ఉన్నారు అని అంటున్నారు. వారే ఏపీ బీజేపీ మాజీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, రాయలసీమకు చెందిన విష్ణు వర్ధన్ రెడ్డి.

ఈ ముగ్గురూ చంద్రబాబు అన్నా టీడీపీ అన్నా మండిపోతారు. వారు టీడీపీతో పొత్తులు వద్దు అని పదే పదే చెప్పిన వారుగా ప్రచారంలో ఉన్న మాట. పైగా బీజేపీలో మొదటి నుంచి ఉన్న వారు. సోము వీర్రాజు బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్న టైం లో టీడీపీ పొత్తుల విషయం ఎక్కడా లేకుండా పోయింది. తమకు జనసేనతోనే పొత్తు అంటూ ఖరాఖండీగా సోము వీర్రాజు చెప్పేవారు.

ఆయన స్టైల్ అలా ఉండేది. ఇక విష్ణు వర్ధన్ రెడ్డిదీ అదే రూట్. జీవీఎల్ అయితే 2019 ఎన్నికల ముందు టీడీపీ మీద చేసిన విమర్శలు ఒక స్థాయిలో ఉన్నాయని కూడా చెబుతారు. ఇలా ఈ ముగ్గురు నేతలూ ఇపుడు టీడీపీ బీజేపీల మధ్య పొత్తు కుదరడంతో ఇరకాటంలో పడ్డారు అని అంటున్నారు.

ఇక సోము వీర్రాజు రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ సీటుని ఆశిస్తున్నారు. ఆయన మాజీ బీజేపీ ప్రెసిడెంట్. పైగా కేంద్ర పెద్దలకు సన్నిహితులు. అయితే ఆయన సీటుకు ఎసరు పెట్టేలా అక్కడ పొత్తులో ఇవ్వమని కాకినాడ అర్బన్ సీటు ఇస్తామని టీడీపీ అంటోందిట.

అలాగే విశాఖ ఎంపీగా పోటీ చేయాలని జీవీఎల్ చూస్తున్నారు. కానీ విశాఖ ఎంపీ సీటునే పొత్తులో ఇవ్వకూడదని టీడీపీ డిసైడ్ అయింది. అనకాపల్లి సీటు ఇస్తామని అంటోంది. ఇదొక ఇబ్బందిగా మారింది. అలాగే విష్ణువర్ధన్ రెడ్డి తాను ఎంపీగా పోటీ చేస్తాను అని అంటున్నారు. లేకపోయినా అసెంబ్లీకి అయినా అంటున్నారు. కానీ ఆయనకు ఎక్కడా సీటు ఇచ్చే చాన్స్ కనిపించడంలేదు.

అయితే ఈ ముగ్గురికీ బీజేపీ జాతీయ నాయకత్వంతో మంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి సీటు తెచ్చుకోవచ్చు అని అంటున్నారు. ఒక వేళ తెచ్చుకున్నా టీడీపీ జనసేన సహకారం ఉండాలి. ఓట్ల బదిలీ జరగాలి. అపుడే వారు గెలుస్తారు. అలా కాకుండా చేయడంలో టీడీపీ సిద్ధహస్తురాలు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే బీజేపీలో బాబు యాంటీ బ్యాచ్ కి టికెట్లు దక్కకుండా చేసే ప్లాన్ అయితే సాగుతోందని అంటున్నారు.