బస్సులో బాబు...వైసీపీ మీద సర్వే!
ఈ క్రమంలో ప్రస్తుతం గోదావరి జిల్లాల టూర్ లో చంద్రబాబు సడెన్ గా బస్సులో సామాన్య ప్రయాణీకుడిగా మారిపోయారు.
By: Tupaki Desk | 17 Aug 2023 4:29 PM GMTతెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ నారా చంద్రబాబు రాజకీయం ఏమైనా వేరేగా ఉంటుందని అంటున్నారు. చంద్రబాబు 2024 ఎన్నికలలో విజయం కోసం అలుపెరగని పోరాటమే చేస్తున్నారు. గతానికి భిన్నంగా ఏడున్నర పదుల వయసులో బాబు తెగ కష్టపడుతున్నారు.
ఆయన ఈసారి జనంతో మమేకం కావడానికి అనేక మార్గాలను ఎంచుకుంటున్నారు. అందులో సామాన్యుడి మాదిరిగా టీ స్టాల్ వద్ద ఆగి టీ తాగడం నుంచి ప్రజలతో నేరుగా పొలం గట్ల వద్ద కూర్చొని మాటా మంతీ చేయడం, వారితో రచ్చ బండ మీటింగ్స్ పెట్టడం ఇలా బాబు చాలానే రాజకీయ విన్యాసాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో ప్రస్తుతం గోదావరి జిల్లాల టూర్ లో ఉనన్ చంద్రబాబు సడెన్ గా బస్సులో సామాన్య ప్రయాణీకుడిగా మారిపోయారు. కోనసీమ ఆలమూరు నుంచి ఆర్టీసీలో చంద్రబాబు ప్రయాణం చేయడం విశెషం. కండక్టర్ నుంచి బస్సు టికెట్ తీసుకుని రావులపాలెం వరకు బస్సులో చంద్రబాబు ప్రయాణించారు.
అంతే కాదు సామాన్యుడిగా మారి ప్రయాణీకులతో ముచ్చటించారు. వైసీపీ ప్రభుత్వ పనితీరును వారిని అండిగి తెలుసుకున్నారు. అలాగే కోనసీమలో రోడ్ల పరిస్థితిపై ప్రయాణికుల నుంచి చంద్రబాబు నేరుగా ఆరా తీశారు. ఏపీలో ప్రభుత్వం చెప్పేవి కబుర్లు తప్ప ఆచరణలో ఏమీ లేదని బాబు విమర్శిస్తున్నారు.
ఇక సామన్యుడికి ఈ ప్రభుత్వం ఎంత తొందరగా పోతే బాగుంటుంది అన్నది ఉందని బాబు ప్రసంగాలలో చెబుతున్నారు. అయితే జాతీయ స్థాయిలో వస్తున్న సర్వేలు అన్నీ కూడా వైసీపీకి పట్టం కట్టడంతో బాబు తాను సొంతంగా సర్వేలు నిర్వహిస్తున్నారా అన్న డౌట్లు వస్తున్నాయి.
బాబు సామాన్యులతో డైరెక్ట్ గా మాటా మంతీ చేస్తూ వారి నుంచి అసలైన ఫీడ్ బ్యాక్ ని తీసుకునే ప్రయత్నంలో భాగమే ఈ బస్సు ప్రయాణం అని అంటున్నారు. నిజానికి టీడీపీ పలు ఏజెన్సీల ద్వారా సర్వేలు చేయిస్తోంది. అవన్నీ బాబుకు ఎప్పటికపుడు చేరుతూ ఉంటాయి.
అయితే గ్రౌండ్ లెవెల్ లో రియాలిటీ వేరేగా ఉందా అన్న సందేహాలు అయితే జాతీయ సర్వేలను చూస్తే కలుగుతున్నాయి. దాంతో బాబు జనాల వద్ద నుంచి ప్రభుత్వ పనితీరు మీద అభిప్రాయ సేకరణ చేస్తున్నారు అని అంటున్నారు.
అయితే చంద్రబాబు వంటి సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి వచ్చి తన పక్క సీట్లో కూర్చుని ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది అంటే ఎవరైనా ఏమి చెబుతారు అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా టీడీపీ సహా విపక్షాలకు జనం నాడి ఏంటో ఇంకా స్పష్టంగా అందడం లేదని అంటున్నారు అదే టైం లో ప్రజలతో నేరుగా కనెక్ట్ అయ్యేందుకు ఈసారి బాబు సరికొత్త టెక్నిక్స్ ని కూడా వాడుతున్నారు అని అంటున్నారు మరి వీటి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.