బాబు కస్టడీ పిటిషన్ : తీర్పు మీద సర్వత్రా ఉత్కంఠ
చంద్రబాబుని సీఐడీ కస్టడీ కోరుతోంది. అయిదు రోజుల పాటు తమకు కస్టడీ ఇస్తే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కాం విషయంలో వాస్తవాలను విచారణలో మరిన్ని తెలుసుకుంటామని అంటోంది.
By: Tupaki Desk | 21 Sep 2023 1:22 PM GMTచంద్రబాబుని సీఐడీ కస్టడీ కోరుతోంది. అయిదు రోజుల పాటు తమకు కస్టడీ ఇస్తే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కాం విషయంలో వాస్తవాలను విచారణలో మరిన్ని తెలుసుకుంటామని అంటోంది. ఈ మేరకు ఏసీబీ కోర్టులో సీఐడీ వేసిన పిటిషన్ మీద విచారణ వాడిగా వేడిగా బుధవారం జరిగింది. తీర్పు ని గురువారం ప్రకటిస్తారని అనుకున్నారు. అయితే గురువారం కూడా వాయిదా పడింది.
శుక్రవారం అంటే ఈ నెల 22న తీర్పు వస్తుంది అని భావిస్తున్నారు. దీంతో ఈ తీర్పు ఎలా వస్తుందో అన్న ఉత్కంఠ సర్వత్రా పెరిగిపోతోంది. చంద్రబాబు ప్రసుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఆయనకు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ ని విధించింది ఏసీబీ కోర్టు. ఆ గడువు ఈ ఈ నెల 24తో ముగియనుంది.
సీఐడీ కస్టడీకి బాబుని తీసుకోవాలంటే ఆదివారం లోగా జరగాలి. ఎందుకంటే అప్పటితో ఆయన జ్యూడీషియల్ గడువు ముగుస్తుంది కాబట్టి. రెండవసారి జ్యూడిషీఇయల్ కస్టడీ ఇచ్చినా అపుడు సీఐడీ కస్టడీకి ఇవ్వడం అంటే ఎంతవరకూ కుదురుతుంది అన్న చర్చ వస్తోంది. మరో వైపు ఈలోగా హై కోర్టులో క్వాష్ పిటిషన్ మీద రిజర్వ్ లో ఉన్న తీర్పు వెలువడితే బాబు రిమాండ్ నే కొట్టేస్తూ తీర్పు వస్తే అపుడు సీఐడీ కష్టడీ అన్నదే ఉండదు.
ఎలా చూసుకున్నా ఈ నెల 22 చాలా ముఖ్యమైన డేట్ అంటున్నారు. అలా బాబు కస్టడీ మీద అటు సీఐడీ వర్గాలు ఎదురుచూస్తూంటే ఇటు చంద్రబాబు తరఫున వారు కూడా ఎంతో ఆత్రంగా తీర్పు మీద ఉన్నారు బాబు కస్టడీ పిటిషన్ ని ఏసీబీ కోర్టు తిరస్కరిస్తే భారీ ఊరట తమకు కలుగుతుందని టీడీపీ వారు భావిస్తున్నారు.
అయితే ఏసీబీ తీర్పు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. సాధారణంగా జ్యూడీషియల్ రిమాండ్ లో ఉన్న వారిని సంబంధిత క్రైమ్ ఏజెన్సీలకు కస్టడీకి ఇస్తూంటారు. కేసు విచారణ కోసమే కస్టడీ కాబట్టి కోర్టు ఆ విధంగా కేసులో నిందితుని ప్రమేయం ఉందని భావించినా విచారణకు ఇంకా పూర్తి సమాచారం రాబట్టాలని ఆయా దర్యాప్తు సంస్థలు కోర్టుని కోరినా తమ వాదనలు కన్వీనియెన్స్ గా వినిపించినా కస్టడీకి ఇస్తారు.
ఇదిలా ఉంటే చంద్రబాబు కేసులో కీలకమైన ఆధారాలు ఉన్నాయని ఏపీ సీఐడీ అంటోంది. మరిన్ని వివరాలు బాబు నుంచి రాబట్టాలని సీఐడీ అనుకుంటోంది. దాంతో కస్టడీ కోరుతోంది. అయితే దీని మీద చంద్రబాబు తరఫున న్యాయవాదులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ బుధవారం ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించారు.
బాబుని సిట్ ఆఫీసులో ఒక తడవ విచారించారని, ఇపుడు మళ్లీ కొత్తగా అవసరం లేదని చెబుతున్నారు. అదే విధంగా బాబు ప్రమేయమే ఈ కేసులో లేదు కాబట్టి ఎందుకు సీఐడీ కస్టడీ అని లాజికల్ గా ప్రశ్నిస్తున్నారు ఇలా గంటల తరబడి సాగిన ఇరు పక్షాల వాదనలు విన్న తరువాతనే కోర్టు తీర్పుని వాయిదా వేసింది.
గురువారం తీర్పు వస్తుంది అనుకున్నా అది 22కి మారింది. ఒక వేళ 22న రాకపోతే మాత్రం ఇది రిజర్వ్ తీర్పు కాబట్టి సోమవారం నాటికి రావొచ్చునని న్యాయనిపుణులు చెబుతున్నారు. మొత్తానికి చూస్తే ఈ తీర్పు ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ అయితే పెద్ద ఎత్తున కనిపిస్తోంది అంటున్నారు.