Begin typing your search above and press return to search.

కస్టడీ కహానీ : బాబే సీఐడీని ఎదురు ప్రశ్నించారట... !

ఈ సందర్భంగా బాబు తన భార్యతో కస్టడీ సంగతులు పంచుకుని ఉంటారు. దానికి ఆమె ఈ రోజు రాజమండ్రిలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో రివీల్ చేశారు.

By:  Tupaki Desk   |   27 Sep 2023 3:20 PM GMT
కస్టడీ కహానీ : బాబే సీఐడీని ఎదురు ప్రశ్నించారట... !
X

సాధారణంగా పోలీసులు ఎవరిని అయినా నిందితుడుగా చూపించి కస్టడీకి తీసుకుంటే వారిని అనేక రకాలుగా ప్రశ్నలతో వేధిస్తారు అని అంటారు. తమ సందేహాలు కేసులో ఉన్న అనుమానాలు నిందితునికి వాటితో ఉన్న సంబంధాలు అన్నీ కూడా ప్రశ్నల రూపంలో సంధిస్తారు. కకావికలు చేస్తారు. చివరికి ఏదో రకంగా జవాబులు రాబడతారు. తాము అనుకున్న విధంగా కోరుకున్న విధంగా విచారణను పూర్తి చేస్తారు.

కానీ సీఐడీ కస్టడీకి వెళ్ళిన చంద్రబాబు సీన్ ని రివర్స్ చేశారా. ఏమో ఎవరికీ ఆ కస్టడీ గురించి విచారణ గురించి తెలియదు. ఎందుకంటే ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు అంతా సీల్డ్ కవర్ లో పెట్టి మరీ జడ్జికి సమర్పించారు. అయితే సీఐడీ కస్టడీ తరువాత చంద్రబాబుని ములాఖత్ ద్వారా ఆయన సతీమణి నారా భువనేశ్వరి కలిసారు.

ఈ సందర్భంగా బాబు తన భార్యతో కస్టడీ సంగతులు పంచుకుని ఉంటారు. దానికి ఆమె ఈ రోజు రాజమండ్రిలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో రివీల్ చేశారు. చంద్రబాబు నా భర్త. ఆయన గురించి నాకు తెలుసు. ఆయన ఏ తప్పూ చేయలేదు. ఆయన అందుకే ధైర్యంగా ఉన్నారు అని భువనేశ్వరి చెప్పుకొచ్చారు.

నా భర్తను నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేసినా ఆయన చేసిన తప్పు ఏంటో పోలీసులు చెప్పలేకపోతున్నారు అని విమర్శించారు. సాధారణంగా ఒక కేసు విషయంలో ముందు విచారణ జరిపి ఆ మీదట అరెస్ట్ చేస్తారు. కానీ చంద్రబాబు విషయంలో ముందు అరెస్ట్ చేసి ఆ తరువాత జైలులో విచారించారని ఆమె విమర్శించారు.

అయితే బాబుని ప్రశించేందుకు సీఐడీ దగ్గర ఏముందని ఆయన అంటున్నారు. అందుకే చంద్రబాబే వారిని ఎదురు ప్రశ్నించారు అని ఆమె అంటున్నారు. తాను ఏ తప్పు చేయలేదని, తాను ఏమి చేశానో చెప్పాలంటూ బాబు కోరారని ఆమె అన్నారు. చంద్రబాబు గురించి ప్రజలకు అంతా తెలుసు అని అన్నారు. చంద్రబాబు ప్రజల కోసం ఏమైనా చేస్తారు. ఆయన ఊపిరి ప్రజలు, ఆయనకు అభివృద్ధి చేయడమే తెలుసు. అంతే తప్ప దోచుకుని దాచుకోవడం తెలియదు అని ఆమె అన్నారు.

ఇదిలా ఉంటే సీఐడీ చెబుతున్న 371 కోట్ల రూపాయలు ఎక్కడ పోయాయో ఎవరి ఖాతాలలోకి పోయాయో పోలీసులు విచారించాలని ఆమె అనడం విశేషం. తమకు అయితే ఆ సొమ్ము అవసరం లేదని, తాము ఎపుడూ అలాంటి తప్పుడు పనులు చేయమని అన్నారు. ఈ సందర్భంగా రెండేళ్ల క్రితం అసెంబ్లీలో తన గురించి వైసీపీ నేతలు చేసిన కామెంట్స్ గురించి కూడా ఆమె తలచుకున్నారు.

నా మీద అవాకులు చవాకులు మాట్లాడారు, అయితే నేను మౌనంగానే ఉన్నాను, ఎందుకంటే నేను ఎందుకు బయటకు వచ్చి వారికి వివరణ ఇవ్వాలని ఆమె ఎదురు ప్రశ్నించారు. నేను నా భర్తకు మాత్రమే జవాబు చెప్పాలి. మా ఇద్దరి మధ్యన నమ్మకం ఉంది అది చాలు అని ఆమె అన్నారు.

నా ఒక్క విషయంలో కాదు ప్రతీ ఆడపడుచు విషయంలో ఇలాగే ధైర్యంగా ఉండాలని ఆమె పిలుపు ఇచ్చారు. పనీ పాటా లేని వారు ఏదో మాట్లాడుతూంటారని, వారి మాటలను పట్టించుకోవద్దని, బాబుని అరెస్ట్ చేసినా టీడీపీ ఎక్కడా అగదని, అందువల్ల చేయి చేయి కలిపి అంతా ముందుకు సాగాలని ఆమె కోరడం విశేషం. మొత్తానికి భువనేశ్వరి చెప్పినది ఏంటి అంటే రెండు రోజుల కస్టడీఓ చంద్రబాబే సీఐడీని ప్రశ్నించారు అని.