Begin typing your search above and press return to search.

వైసీపీ నుంచి వచ్చిన వారికి న్యాయం చేస్తున్న బాబు!

అదే విధంగా అంగబలం అర్ధం బలం ఉన్న వారిని ఎంపిక చేసి మరీ పార్టీ కోసం ఉపయోగించుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   23 Jun 2024 2:30 AM GMT
వైసీపీ నుంచి వచ్చిన వారికి న్యాయం చేస్తున్న బాబు!
X

టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారందరికీ న్యాయం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆయన వారి సీనియారిటీ తో పాటు సమర్థతకు పెద్ద పీట వేస్తున్నారు. అదే విధంగా అంగబలం అర్ధం బలం ఉన్న వారిని ఎంపిక చేసి మరీ పార్టీ కోసం ఉపయోగించుకుంటున్నారు.

తాజాగా చంద్రబాబు పార్లమెంటరీ పార్టీ కార్యవర్గాన్ని ప్రకటించిన తీరు చూస్తే ఇది స్పష్టం అవుతుంది. లావు శ్రీక్రిష్ణ దేవరాయలుని పార్లమెంటరీ పార్టీ నేతగా చేశారు. ఆయనకు ఎంతో పెద్ద బాధ్యత ఇది. లావు వైసీపీ నుంచి తొలిసారి 2019లో ఎంపీ అయ్యారు. ఇపుడు టీడీపీ నుంచి అదే నరసన్నపేట లోక్ సభ సీటు నుంచి రెండోసారి గెలిచారు. ఆయనకు 16 మంది ఎంపీలు ఉన్న పార్టీ, ఎన్డీయేలో బీజేపీ తరువాత కీలకం అయిన పార్టీలో లీడర్ గా బాధ్యతలు ఇవ్వడం అంటే మంచి గుర్తింపు గా చూడాలి. ఇది కూడా కేబినెట్ ర్యాంక్ పదవితో తీసిపోనిదే అని కూడా భావించాలి.

అలాగే వైసీపీ నుంచి టీడీపీలోకి ఎన్నికల ముందు చేరిన నెల్లూరు జిల్లా నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి టీడీపీ పార్లమెంటరీ పార్టీ కోశాధికారిగా బాధ్యతలు అప్పగించారు. ఆయనది కూడా ప్రాధాన్యత కలిగిన బాధ్యత అని భావించాలి. ఇక, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా బైరెడ్డి శబరి, దగ్గుమళ్ల ప్రసాద్ రావులను అలాగే లోక్ సభలో పార్లమెంటరీ పార్టీ విప్ గా హరీశ్ బాలయోగిని నియమించారు.

వీరంతా యంగ్ బ్లడ్ గానే ఉన్నారు. అలా పార్టీకి కొత్త షేప్ ని కూడా బాబు తెచ్చారు. దీని కంటే ముందు ఇద్దరు మంత్రులను కూడా వైసీపీ నుంచి వచ్చిన వారిని తీసుకున్నారు. అందులో ఒకరు కొలుసు పార్ధసారధి అయితే మరొకరు ఆనం రామనారాయణరెడ్డి. ఈ ఇద్దరి విషయంలో బాబు న్యాయం చేశారు అని అంటున్నారు.

ఇలా పార్టీలో చేరిన వారికి తగిన గౌరవం ఇవ్వడమే కాకుండా టీడీపీ అందరి పార్టీ అని బాబు ఆచరణలో నిరూపిస్తున్నారు. మరో వైపు చూస్తే టీడీపీలో అంతా కొత్త రక్తాన్ని నింపుతున్నారు. పయ్యావుల కేశవ్ సమర్ధుడైన నాయకుడు. ఆయనకు రాక రాక మంత్రి చాన్స్ వచ్చింది. అటువంటి పయ్యావుల టాలెంట్ ని బాబు గుర్తించి ఏకంగా ఆర్ధిక మంత్రిని చేశారు. అలాగే శాసనసభ వ్యవహారాల మంత్రిని చేసారు. పయ్యావుల తన పదవికి కచ్చితంగా వన్నె తేగలరని అంతా అంటున్నారు.

అదే విధంగా రెవిన్యూ శాఖను అనగాని సత్యప్రసాద్ కి ఇవ్వడం కూడా యంగ్ బ్లడ్ ని గుర్తించడమే అని అంటున్నారు. బాబు పదవుల పంపకం లో స్పెషలైజేషన్ చేశారని చెబుతారు. ఆయన అందరినీ గమనిస్తారు. ఎవరి దగ్గర అయినా టాలెంట్ ఉంటే వారిని అసలు వదులుకోరు. మంచి పదవిలో కూర్చోబెడతారు. టీడీపీని బాబు మరో అర్ధ శతాబ్దం పాటు ముందుకు నడిపించేందుకు ఈ విధంగా తనదైన శైలిలో ఎంపికలు చేస్తున్నారు అని అంటున్నారు.