"ఎక్కువ మంది పిల్లల్ని కనండి"... మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు!
అవును... ఎవరు ఎంత మంది పిల్లని కనాలో కూడా ఇటీవల కాలంలో కొంతమంది మంత్రులు, మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.
By: Tupaki Desk | 11 Jan 2024 8:53 AM GMTఇటీవల కాలంలో చాలా మంది రాజకీయ నాయకులకు.. ఏమి మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం అనే సృహ ఏమాత్రం లేకుందా మాట్లాడుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. నోటికి ఏదొస్తే అది మాట్లాడటం, ప్రజలను చులకనగా చూసే విధంగా వ్యాఖ్యానించడం, వారంతా ప్రజా సేవకులు అనే విషయం ఏమాత్రం మస్థిష్కంలో ఉంచుకోకుండా స్పందించడం చూస్తూనే ఉన్నాం! ఈ క్రమంలో తాజాగా ఒక మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అవును... ఎవరు ఎంత మంది పిల్లని కనాలో కూడా ఇటీవల కాలంలో కొంతమంది మంత్రులు, మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. పథకాలు ఎక్కువగా ఇవ్వడానీకి ప్రభుత్వ సిద్ధంగా ఉంది.. ఎక్కువమందిని కనడని ఒకరంటే... ఎక్కువ మందిని కనండి ఎక్కువ మొత్తంలో డబ్బు పొందంటి అన్నట్లుగా మరికొంతమంది తమదైన ప్రత్యేక జ్ఞానంతో వ్యాఖ్యానిస్తున్నారు. .ఈ సమయంలో తాజాగా రాజస్థాన్ మంత్రి బాబులాల్ ఖరాడి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.
వివరాళ్లోకి వెళ్తే... "ఎవరూ ఆకలితో, తలపై కప్పు (ఇళ్లు) లేకుండా నిద్రపోకూడదన్నది ప్రధానమంత్రి కల. మీరు చాలా మంది పిల్లలకు జన్మనిస్తారు. ప్రధాన మంత్రి మీ ఇండ్లను నిర్మిస్తారు.. అప్పుడు సమస్య ఏమిటి?" అని అన్నారు రాజస్థాన్ మంత్రి బాబులాల్ ఖరాడి! ఉదయ్ పూర్ లో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర క్యాంప్ లో పాల్గొనేందుకు వెళ్లిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.. ఈ సమయంలో ఆ వేదికపై ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ కూడా ఉండటం గమనార్హం.
కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని, సంక్షేమ పథకాలు అమలు చేయడం మోడీ వల్లే సాధ్యమవుతుందని చెబుతూ... ఇలా పిల్లల టాపిక్ తీసుకురావడంతో అక్కడున్నవారిలో కొంతమంది షాకవ్వగా.. మరికొంతమంది నవ్వుకున్నారు! దీంతో బీజేపీ మంత్రి నవ్వులపాలయ్యారనే కామెంట్లు మొదలైపోయాయి.
కాగా... 2023లో ఐదురాష్ట్రాల ఎన్నికలో భాగంగా జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఝడోల్ నియోజకవర్గం నుంచి బాబులాల్ ఖరాడీ నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు ఇద్దరు భార్యలు, ఎనిమిది మంది సంతానం కాగా.. వీరిలో నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు.