Begin typing your search above and press return to search.

లోకేష్ కి నో చాన్స్ అంటున్న బాబు ?

ఆనాడు ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయో ఇపుడు అలాగే ఉన్నాయని బాబు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   3 July 2024 3:13 PM GMT
లోకేష్ కి నో చాన్స్ అంటున్న బాబు ?
X

చంద్రబాబు వయసు ఏడున్నర పదులు. అయితే మాత్రం ఆయన నవ యువకుడు లాగానే ఉన్నారు. తనతో ఎవరూ పరుగులు తీయలేరని కూడా చెబుతున్నారు. ముప్పయ్యేళ్ల క్రితం బాబు ఉమ్మడి ఏపీకి సీఎం అయ్యారు. ఆనాడు ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయో ఇపుడు అలాగే ఉన్నాయని బాబు చెబుతున్నారు.

తనలో మళ్లీ పాత బాబుని చూస్తారని ఆయన అంటున్నారు. పాలన విషయంలో ఎక్కడా తగ్గేది లేదని అంటున్నారు. పరుగులు పెట్టిస్తామని కూడా చెబుతున్నారు. ఎవరూ కూడా ఉదాశీనంగా ఉన్నా లేక ఏమరుపాటుగా ఉన్నా కూడా సహించబోమని అంటున్నారు. బాబు తొలిసారి సీఎం అయినపుడు పాలనను ఒక లెవెల్ లో పరుగులు తీయించారు. బాబే దానిని స్వయంగా చెప్పుకున్నారు. అప్పట్లో తాను బయటకు వస్తున్నాను అంటే ఉమ్మడి ఏపీ అంతా అలెర్ట్ అయ్యేదని చెప్పారు.

మళ్లీ పాలన గాడిలో పడాలంటే ఆ స్పీడ్ అవసరం అని అంటున్నారు. కేవలం అధికారులనే కాదు మంత్రులను పరుగులు పెట్టిస్తాను అని బాబు అంటున్నారు. ఈ సందర్భంగా ఆయన తన కుమారుడు మంత్రి లోకేష్ మీద సెటైర్లు వేశారు. నేను తొలిసారి సీఎం అయినపుడు నీవు కుర్రవాడివి. నీకు తెలియకపోవచ్చు అని అన్నారు.

కానీ ఇపుడు అంతా పాలనలో జోరు పెంచాల్సిందే అని కొడుకుకి సైతం ఏ మాత్రం మినహాయింపు లేదని తేల్చేశారు. అంతే కాదు లోకేష్ ని ఇంకా నేర్చుకోవాలని చెప్పడం ద్వారా బాబు ఆయనకు ఇప్పట్లో నో చాన్స్ అన్న సందేశాన్ని పంపించారు అని అంటున్నారు.

ఆ మధ్యన టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి లాంటి వారు లోకేష్ ఈ టెర్మ్ లోనే సీఎం కావచ్చు అంటూ తమదైన విశ్లేషణ వినిపించారు అయితే అది సాధ్యం కాకపోవచ్చు అని ఏపీ రాజకీయం చూస్తే అర్ధం అవుతోంది. ఏపీలో బాబు సీఎం గా ఉంటేనే పాలన గాడిన పడుతుంది, అభివృద్ధి సాధ్యపడుతుంది.

ఏపీలో ఇపుడు సీఎం సీటు ముళ్ళ కిరీటం. బాబు లాంటి అనుభవం ఉన్న వారు అయితేనే ఆ పదవిలో నెట్టుకుని వస్తారని అంటున్నారు. అందువల్ల బాబు ఫుల్ టెర్మ్ సీఎం గా కొనసాగాల్సిన అనివార్యత అయితే ఉంది. మరో వైపు చూస్తే లోకేష్ కి ఈ అయిదేళ్ళూ బాబు పర్యవేక్షణలో ఆయన మార్గదర్శకత్వంలో ఒక రకమైన దిశా నిర్దేశం ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద బాబుకు అన్నీ తెలుసు అంటున్నారు.

ఈ నేపధ్యంలో బాబుకు వారసులుగా ఎవరూ ముందుకు ఇప్పట్లో రాలేరనే అంటున్నారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వేదిక మీద

తండ్రీ కొడుకుల సంభాషణ వింటే బాబు లోకేష్ కి ఇప్పట్లో నో చాన్స్ అని చెప్పేశారా అని అంతా విశ్లేషించుకుంటున్నారు.