Begin typing your search above and press return to search.

పదే పదే బాబు అదే మాట మైండ్ గేమ్ వారికోసమే ?

ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చామని అయితే ఆర్ధిక పరిస్థితి తలచుకుంటే భయం వేస్తోంది అని చంద్రబాబు చెప్పారు.

By:  Tupaki Desk   |   2 Aug 2024 12:30 AM GMT
పదే పదే బాబు అదే మాట  మైండ్ గేమ్ వారికోసమే ?
X

టీడీపీ అధినేత ముఖ్యమంత్రి రాజకీయం అందరికీ తెలిసిందే. ఆయన సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న నాయకుడు. ఆ విధంగా ఆయన అనుభవంతో పడిపోయారు. ఇక ఆయన నాలుగవ సారి ఏపీకి సీఎం అయ్యారు. ఇదిలా ఉంటే సీఎం అయిన దగ్గర నుంచి చంద్రబాబు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు. అన్ని రంగాలు విధ్వంశం అయ్యాయని చెబుతున్నారు. ఏపీలో ఆర్ధిక రంగం మీద అసెంబ్లీలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో కూడా బాబు వైసీపీ ప్రభుత్వం ఏపీని ఆర్ధికంగా కోలుకోలేని దెబ్బ తీసింది అని హాట్ కామెంట్స్ చేశారు.

ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చామని అయితే ఆర్ధిక పరిస్థితి తలచుకుంటే భయం వేస్తోంది అని చంద్రబాబు చెప్పారు. ఇది ఒక విధంగా అసెంబ్లీ నుంచి ఇచ్చిన ఒక సందేశమే అని అంతా అన్నారు. దానికి ముందూ తరువాత కూడా ఆయన అదే మాట మాట్లాడుతున్నారు. ఏపీ ఖజానాలో ఏమీ లేదని బాబు అంటున్నారు.

తాజాగా శ్రీశైలం పర్యటనలో బాబు ఏపీ ఖజానా ఖాళీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కూటమిని ఆదరించి అంతా ఓట్లేశారు కానీ ఖజానాలో చిల్లి గవ్వ లేదంటూ బాబు చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు తావిస్తున్నాయి. చంద్రబాబు ఈ విధంగా కామెంట్స్ చేయడం అంతా ఒక వ్యూహం ప్రకారమే అని అంటున్నారు.

ఆయన పదే పదే ఈ రకంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మీద జనంలోకి వచ్చినపుడు కానీ మీడియా ముందు కానీ ప్రభుత్వ పార్టీ సమావేశాలలో కానీ స్టేట్మెంట్స్ ఇవ్వడం ఒక రకంగా మైండ్ గేమ్ అని అంటున్నారు. ప్రజలకు నెమందిగా ఏపీలో ఏమీ లేదు అన్న సందేశం పంపించడం ఉద్దేశ్యమని అంటున్నారు. ఏపీ ఆర్ధికంగా సంక్షోభంలో ఉందని చెప్పడమే బాబు ఉద్దేశ్యం అన్నారు.

దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలో రెండు సార్లు ఓటాన్ అకౌంట్ తెచ్చారు. అది కూడా దారుణమైన ఏపీ ఆర్ధిక పరిస్థితులను జనాలకు తేటతెల్లం చేసేందుకే అని అంటున్నారు. ఏపీలో టీడీపీ కూటమిని జనాలు 164 సీట్లతో గెలిపించారు. అంటే ప్రజల ఆశలు ఏ రేంజిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. అలా ఆకాశమంత ఉన్న ఆశలను నేలకి దించే ప్రయత్నమే బాబు చేస్తున్నారు అని అంటున్నారు.

ఏపీ ఆర్ధికంగా బాగా లేదు అని చెప్పి సం థింగ్ బెటర్ దాన్ నఘింగ్ అన్న ఆలోచనా ధోరణిని అటు సాధారణ ప్రజలతో పాటు ఉద్యోగ వర్గాలు ఇతర వర్గాలలో కలిగించడమే బాబు లక్ష్యమని అంటున్నారు. ఒక విధంగా జనాలు ఏపీ ఆర్ధికంగా బాగు లేదని అర్థం చేసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం పని సులువు అవుతుంది.

హామీలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని చేసినా జనాలకు నూరు శాతం సంతృప్తి కనిపిస్తుంది. అలాగే కొంతకాలం హామీలను వాయిదా వేసినా జనాలు కూడా సర్దుకుని అర్ధం చేసుకుంటారు అని అంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు మాత్రం ఎన్నడూ లేని విధంగా ఖజానా ఖాళీ అని ఎక్కడికి వెళ్ళినా చెబుతున్నారు. అంతే కాదు కూటమి మంత్రులు అదే చెబుతున్నారు. ఆర్ధిక సంక్షోభం రాష్ట్రంలో ఉందని తమ ప్రసంగం మొదట్లో చివరిలో చెబుతున్నారు.

నిజానికి చూస్తే ఏపీ ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఏమీ లేదు. ఏటా రెండు లక్షల కోట్ల ఆదాయం ఖజానాకు వస్తుంది. అది ఏటేటా పది నుంచి పదిహేను శాతం పెరుగుతుంది కూడా. అయితే హామీలు భారీగా ఇచ్చేసి పార్టీలు తప్పు చేస్తున్నాయి. అది చంద్రబాబు 2014లో మొదలెడితే జగన్ దాన్ని పీక్స్ కి చేర్చారు. ఆ హామీల కోసమే అప్పులు చేసి ఇపుడు వాటికి వడ్డీలు అసలు కడుతూ ఏపీ ఆదాయం అంతా అటు మళ్ళించేస్తున్నారు.దాని వల్లనే ఏపీలో బీద ఏడుపులు ఏడవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటున్నారు.

సామాజిక పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఏకమొత్తంలో పెంచడం కూడా తప్పే అన్న మాట ఉంది. అప్పట్లో జగన్ చేసినట్లుగా అయిదేళ్ళకు విడతల వారీగా ఏడాదికి రెండు వందల వంతున పెంచితే సరిపోతుంది అని కూడా అంటున్న వారు ఉన్నారు. ఇక ఉచిత బస్సు సదుపాయం కానీ 18 ఏళ్ళు నిండిన మహిళలకు నెలకు 1500 ఆర్ధిక సాయం కానీ నిరుద్యోగ యువతకు భృతి కానీ ఏపీ లాంటి వ్యవసాయిక రాష్ట్రం ఉన్న చోట సాధ్యపడని హామీలు అని తెలిసినా బాబు ఇచ్చేశారు.

అలా అధికారం అందుకున్న బాబు ఇపుడు ఏపీ ఖజానా ఖాళీ అని రోజూ ప్రకటనలు చేస్తున్నారు. దీనిని జనాలు అర్ధం చేసుకున్న వారు చేసుకుంటారు. కానీ ఉచిత హామీలు ఎందుకు ఇవ్వాలి అన్నది తలపండిన బాబు లాంటి వారికే తెలియకపోతే ఎలా అన్న చర్చ వస్తోంది. జగన్ కి రాజకీయ అనుభవం లేదు కాబట్టి నవ రత్నాలు హామీలు ఇచ్చి ఏపీని అప్పుల కుప్పగా మార్చారు అని నిందిస్తూ టీడీపీ అదే పని చేసింది అని అంటున్నారు. మొత్తానికి బాబు ఆడుతున్న మైండ్ గేం సక్సెస్ అయితే ఓకే కానీ బూమరాంగ్ అయితే మాత్రం ఇబ్బందే అని అంటున్నారు.