Begin typing your search above and press return to search.

టీడీపీ సీనియర్లకు బాబు మార్క్ షాక్...!

ఇవన్నీ ఆలోచించిన మీదట ఫార్టీ ఇయర్స్ ఓల్డెస్ట్ ప్రాంతీయ పార్టీ టీడీపీలో మార్పు చేర్పులు జోరుగానే సాగుతున్నాయని అంటున్నారు.

By:  Tupaki Desk   |   16 Dec 2023 12:30 PM GMT
టీడీపీ సీనియర్లకు బాబు మార్క్ షాక్...!
X

సీనియర్లు అంటే అనుభవం పండి ఉన్నవారు. అయితే వారి సేవలు గతంలో ఓకే కానీ ఇపుడున్న తరంలో యూత్ కే ఎక్కువ చాన్స్ ఇవ్వాల్సి వస్తోంది. పైగా జనరేషన్ గ్యాప్ కూడా ఉంది అని అంటున్నారు. అంతే కాదు ఫ్రెష్ లుక్ కోసం రాజకీయ పార్టీలు ట్రై చేస్తున్నాయి. జనాలు సైతం కొత్తదనం కావాలని అంటున్నారు. ఇవన్నీ ఆలోచించిన మీదట ఫార్టీ ఇయర్స్ ఓల్డెస్ట్ ప్రాంతీయ పార్టీ టీడీపీలో మార్పు చేర్పులు జోరుగానే సాగుతున్నాయని అంటున్నారు.

వైసీపీలో టికెట్ల మీద కసరత్తు అయితే సాగుతోంది. కొందరికి కటింగ్ చెప్పేస్తున్నారు. ఇపుడు టీడీపీలో కూడా అదే ట్రెండ్ ని చూడవచ్చు అని అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలు మాజీ మంత్రులు కొందరికి ఈసారి టికెట్ దక్కకపోవచ్చు అని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.

అందులో ముందుగా చెప్పుకోవాల్సింది. సీనియర్ మోస్ట్ నేత మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరి. ఆయన రాజమండ్రి రూరల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన రాజమండ్రి నుంచి పలు మార్లు గెలిచారు. 2009లో అసెంబ్లీ పునర్ విభజన తరువాత రూరల్ కి షిఫ్ట్ అయి 2014, 2019లలో రెండు సార్లు గెలిచారు. 2024లో పోటీ చేసి తన రాజకీయ జీవితాన్ని ముగించాలని బుచ్చయ్య చూస్తూంటే ఆయన్ని 2024లోనే ఆగిపొమ్మని పార్టీ ఆదేశిస్తోంది అని అంటున్నారు.

అక్కడ టికెట్ జనసేన కోరుతోంది. కందుల దుర్గేష్ పోటీకి తయారుగా ఉన్నారు. అందుకే గోరంట్లను పోటీ నుంచి తప్పుకోమని హై కమాండ్ కోరిందని అంటున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ కన్ ఫర్మ్ చేస్తారు అని అంటున్నారు. దాంతో గోరంట్ల ఈసారి పోటీలో కనిపించకపోవచ్చు అని అంటున్నారు. అదే విధంగా చూస్తే తూర్పు గోదావరి జిల్లాలో జ్యోతుల నెహ్రూ అనే మరో సీనియర్ నేత ఉన్నారు. ఆయన టీడీపీ ప్రజారాజ్యం, వైసీపీ మళ్లీ టీడీపీ ఇలా చాలా పార్టీలు తిరిగి ప్రస్తుతం పసుపు పార్టీలో ఉన్నారు.

ఆయన 2024లో జగ్గంపేట నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. ఇటీవల జరిగిన టీడీపీ జనసేన ఉమ్మడి మీటింగులో కూడా ఆయన తానే అభ్యర్ధి అని మాట్లాడారు. ఆ రోజు రచ్చ కూడా జరిగింది. అయితే ఏకంగా ఆయననే పోటీ నుంచి తప్పించే ప్రయత్నం టీడీపీ చేయాలనుకుంటోంది అని తెలుస్తోంది. ఆ సీటు జనసేనకు ఇవ్వాలని అనుకుంటోంది అని అంటున్నారు.

అలాగే పిఠాపురం నుంచి 2024లో పోటీకి రెడీగా ఉన్న ఎస్వీఎస్ ఎన్ వర్మకు కూడా టికెట్ నో అని చెప్పబోతున్నారుట. ఆయన కూడా తానే పోటీ చేస్తాను అని చెబుతున్నారు. ఇక్కడ కూడా జనసేన టీడీపీ వర్గాల మధ్య టికెట్ పోరు ఉంది. ఈ సీటుని జనసేన కోరుతోంది. దాంతో టీడీపీ వర్మకు టికెట్ ఇవ్వదని ప్రచారం అయితే సాగుతోంది.

అదే విధంగా కాకినాడ సిటీ నుంచి కొండబాబు పోటీకి తాను సిద్ధం అని చెబుతున్నారు. ఆయన దూకుడు మీద ఉన్నారు. కానీ ఆయనకు టికెట్ దక్కే అవకాశాలు లేవు అని అంటున్నారు. బహుశా ఈ సీటుని కూడా జనసేనకు ఇవ్వవచ్చు అని టాక్ నడుస్తోంది. మరి కొండబాబు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది చూడాల్సి ఉంది.

విశాఖ జిల్లా విషయానికి వస్తే పెందుర్తికి చెందిన మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి మరోసారి పోటీకి సుముఖంగా ఉన్నారు. తనతో పాటు తన కుమారుడు బండారు అప్పలనాయుడుకు టికెట్ అని ఆయన కొత్త డిమాండ్ పెడుతున్న వేళ ఏకంగా ఈ మాజీ మంత్రికే టికెట్ నో చెప్పేందుకు టీడీపీ సిద్ధం అవుతోంది అని అంటున్నారు. మరి బండారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

అయితే ఇందులో కొందరికి వేరే నియోజకవర్గాలు కేటాయించే చాన్స్ ఉంది అని అంటున్నారు. అది కుదరకపోతే పార్టీ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవులు ఇస్తామని కూడా హామీ ఇస్తారట. ఏది ఏమైనా టీడీపీ సీనియర్లకు ఈసారి టికెట్ నో చెబుతూ షాక్ ఇచ్చేలా హై కమాండ్ ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.