కేఏ పాల్ ను నమ్ముకొని బరిలోకి బాబు మోహన్.. ఎక్కడి నుంచి పోటీ అంటే?
ప్రముఖ నటుడు, బీజేపీ నేత బాబూమోహన్ పార్టీ మారారు. కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీలో చేరారు.
By: Tupaki Desk | 26 March 2024 5:47 AM GMTప్రముఖ నటుడు, బీజేపీ నేత బాబూమోహన్ పార్టీ మారారు. కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అసలు బాబూమోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరడానికి కారణాలేంటి? ప్రస్తుతం బీజేపీకి ఉన్న ఫాలోయింగ్ ను పట్టించుకోకుండా ప్రజాశాంతి పార్టీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. అందరు కేఏ పాల్ ను జోకర్ లా చూస్తారు. అలాంటి పార్టీలో చేరి బాబూమోహన్ ఏం సాధిస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈనేపథ్యలో బాబూమోహన్ చేరిక ఆసక్తికరంగా మారింది.
కూట్లో రాయి ఏరలేనోడు ఏట్లో రాయి ఏరినట్లు ప్రధాన పార్టీలోనే కొనసాగితే ఎంతో కొంత లాభం చేకూరేది. కానీ ప్రజాశాంతిలో కార్యకర్తలు లేరు. బలం ఉండదు. అలాంటి పార్టీని నమ్ముకుని బాబూమోహన్ ఏం సాధిస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రజాశాంతి తరఫున తొలి అభ్యర్థిగా బాబూమోహన్ పోటీలో ఉంటారని ప్రకటించారు. బాబూమోహన్ చేరికతో కొంత మంది పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తోంది.
కేఏ పాల్ ను నమ్ముకుని బాబూమోహన్ ఏం సాధిస్తారు? పాల్ కే ఫాలోయింగ్ లేదు. ఇక బాబూమోహన్ కు ఎక్కడ నుంచి వస్తుంది? ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే వాదనలు వస్తున్నాయి. బాబూమోహన్ వరంగల్ నుంచి ఎంపీ బరిలో ఉంటారని చెబుతున్నారు. బాబూమోహన్ ఎంపీ బరిలో నిలిచి విజయం సాధిస్తారా? తెలుగుదేశం, బీజేపీల్లో చేరి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. కానీ ఇప్పుడు ప్రజాశాంతిలో చేరడంలో ఆంతర్యం మాత్రం అంతు చిక్కడం లేదు.
లోక్ సభ ఎన్నికల్లో బాబూమోహన్ వరంగల్ నుంచి బరిలో నిలిస్తే పాల్ విశాఖ నుంచి పోటీలో ఉంటారని అంటున్నారు. కేఏ పాల్ మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు. అప్పట్లో ఆయనకు 805 ఓట్లు వచ్చాయి. 2019 ఏపీ ఎన్నికల్లో నర్సాపురం అసెంబ్లీకి పోటీ చేసిన పాల్ పోటీలో నిలవగా 281 ఓట్లు రావడం గమనార్హం. ఈనేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ ఎలాంటి అద్భుతాలు చేస్తుందోనని అనుకుంటున్నారు.
బాబూమోహన్ వేసిన స్టెప్ రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. మంచి ఫాలోయింగ్ ఉన్న పార్టీని కాదని ఎలాంటి ప్రాధాన్యం లేని పాల్ పార్టీలో చేరి ఏం ఒరగబెడతారని చర్చించుకుంటున్నారు. బాబూమోహన్ కు ఉన్న ఫాలోయింగ్ కూడా పోతుందంటున్నారు. దీంతో బాబూమోహన్ చేరికతో ఎలాంటి మార్పులు ఉండవని చెబుతున్నారు. ప్రజాశాంతి పార్టీ లోక్ సభ బరిలో నిలిచి ఉనికి చాటుకుంటుందా? లేక ఏదైనా అద్భుతం సాధిస్తుందా అని వాదనలు వస్తున్నాయి.