Begin typing your search above and press return to search.

బీజేపీకి బై బై... షాకింగ్ ఆరోపణలు చేసిన బాబూ మోహన్!

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో బీజేపీకి షాక్ తగిలింది. సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   7 Feb 2024 10:11 AM GMT
బీజేపీకి బై బై... షాకింగ్  ఆరోపణలు చేసిన బాబూ మోహన్!
X

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో బీజేపీకి షాక్ తగిలింది. సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా... భారతీయ జనతాపార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన కిషన్ రెడ్డి, బండి సంజయ్ మొదలైన నేతలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. బీజేపీలో నాలుగు గ్రూపులు ఉన్నాయని.. వాటిలో రెండు కాంగ్రెస్, రెండు బీఆరెస్స్ కు పనిచేసినట్లు తెలిపారు.

అవును... మాజీమంత్రి మోహన్ బాబు బీజేపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తనను ఎంతో అవమానించారని చెబుతూ.. తెలంగాణ బీజేపీ నేతలపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇందులో భాగంగా... బీజేపీ పెద్దల వైఖరి పొమ్మనకుండా పొగపెడుతున్నట్లుగా ఉందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా... ఏ, బీ, సీ, డీ సెక్షన్లుగా నాయకులను విభజించి అత్యంత అవమానకరంగా తనను "డి కేటగిరి"లో పెట్టారంటూ బాబూమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కోసం చాలా కష్టపడినట్లు చెప్పిన బాబూమోహన్... తెలంగాణ రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నికల్లో తిరిగి ప్రచారం చేసినట్లు వెళ్లడించారు. ఇక తన ఫోన్ ని అటు కిషన్ రెడ్డి కానీ, ఇటు బండి సంజయ్ కానీ రిసీవ్ చేసుకోలేదని.. దీంతో తనను అవమానించడానికే రాష్ట్ర బీజేపీ పెద్దలు నిర్ణయించుకున్నారని తనకు అర్థమైందని అన్నారు.

అందువల్లే తాను బీజేపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు బాబూమోహన్ తెలిపారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీచేస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించారని తెలుస్తుంది! అయితే ప్రస్తుతానికి బీజేపీకి తాను రాజీనామా చేసినట్లు తెలిపిన ఆయన... అనంతరం ఏ పార్టీలో చేరేదీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు.

కాగా... వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు బాబూ మోహన్ ప్రయత్నాలు చేస్తున్నారంటూ కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. అయితే... నిన్నమొన్నటివరకూ టిక్కెట్ పై ఆశలు చూపించిన పెద్దలు.. వరంగల్ టికెట్ ఇచ్చేందుకు తాజాగా నిరాకరించినట్లు తెలుస్తుంది. దీంతో హర్ట్ అయిన బాబూ మోహన్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.