బాబు ఆ కార్డు తీస్తే టోటల్ టర్న్ ?
ఇవన్నీ పక్కన పెడితే ఈసారి ఎన్నికల్లో ఎమోషనల్ టచ్ ఇచ్చే సీన్ ఏదీ లేదన్న మాట ఉంది.
By: Tupaki Desk | 27 April 2024 2:30 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబు కూటమికి సారధ్యం వహిస్తున్నారు. అయితే కూటమితో వస్తున్నా వైసీపీ సోలోగా వస్తున్నా ఫైట్ మాత్రం టైట్ గానే ఉంది. గెలుపు ఎవరిది అంటే ఇంకా క్లారిటీ రావడం లేదు. అయితే అటు వైసీపీకి ఇటు టీడీపీకి చేతిలో ఏమైనా కార్డులు మిగిలి ఉన్నాయా అన్నీ వాడేశారా అంటే ఎన్నికల ప్రచారానికి గట్టిగా పదిహేను రోజులు ఉంది కాబట్టి ఇంకా ఉండొచ్చు అన్నే మాట ఉంది.
ఇవన్నీ పక్కన పెడితే ఈసారి ఎన్నికల్లో ఎమోషనల్ టచ్ ఇచ్చే సీన్ ఏదీ లేదన్న మాట ఉంది. అది కనుక ఉంటే బలమైన వేవ్ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిరుగుతుందని అని అంటున్నారు. ఇక జగన్ వైపు నుంచి చూస్తే ఏమోషనల్ టచ్ ఇచ్చే కార్డు ఏమైనా ఉందా అనంది చూడాలి. వెతికి పట్టుకోవాలి.
అయితే ఉన్నంతలో జగన్ ఒక ఎమోషన్ అయితే బిల్డప్ చేయాలని చూస్తున్నారు. అదేంటి అంటే తాను ఒక్కడిని అయ్యాను ఒంటరిని అయ్యాను అని అంటున్నారు. ఎంతో మంది అటు వైపు ఉన్నారని తనను ఒక్కడిని చేసి ఢీ కొడుతున్నారు అని జనం ముందు చెప్పుకుంటున్నారు. ఒక విధంగా ఇది సానుభూతి అస్త్రమే దీనికి ఎంత మేర ఓటర్లు పడ్డారు అన్నది పక్కన పెడితే మొత్తం ఏపీ జనాలు అంతా తనవారే అంటూ జగన్ మాట్లాడుతూ కొత్త వ్యూహానికి తెర తీస్తున్నారు.
జగన్ విషయం ఇలా ఉంటే చంద్రబాబు అయితే ఏడున్నర పదుల వయసులో కష్టపడుతున్నారు అన్న చర్చ అయితే సాగుతోంది. నిజానికి చూస్తే ఈ ఏజ్ లో ఇంత ఎండలో ఎవరూ బయటకు రారు. అలా వచ్చేందుకు కూడా హడలిపోతారు. భారీగా పెరిగిన ఎండలతో అంతా ఏసీలలో ఇళ్ళలో ఉంటే చంద్రబాబు మాత్రం రోడ్డు మీదకు వస్తున్నారు.
ఆయన కష్టాన్ని చూసిన వారు పెద్దాయన ఈ ఏజ్ లో కష్టపడుతున్నారు అని అంటున్నారు. సరిగ్గా ఇక్కడే బాబు తనదైన ఎమోషనల్ కర్డు వేస్తే ప్లాన్ సక్సెస్ అవుతుంది అని అంటున్నారు. అదేంటి అంటే ఇవే నా చివరి ఎన్నికలు అని ఆయన ప్రకటిస్తే మాత్రం రూరల్ ఓటర్లు టర్న్ అయ్యే సీన్ ఉంది అని అంటున్నారు.
గత ఏడాది కర్నాటక ఎన్నికల్లో సిద్ధరామయ్య ఇదే రకమైన వ్యూహానికి పదును పెట్టారు. తనకు ఓటేయాలని ఇదే చివరి అవకాశం అని విన్నవించుకున్నారు. ఆయన ఈ రోజు అక్కడ సీఎం గా ఉన్నారు. చంద్రబాబు కూడా ఆ మాట అనాల్సిన అవసరం ఉందని సమయం వచ్చేసిందని అంటున్నారు.
రాజకీయాల్లో ఎన్నో వ్యూహాలు ఉంటాయి. వాటిని సమయం సందర్భం వచ్చినపుడు వాడేయాల్సిందే అంటున్నారు. చంద్రబాబు రెండేళ్ల క్రితం జనంలో తిరుగుతూ తనకు ఇవే చివరి ఎన్నికలు అని చెప్పేశారు. అయితే దాన్ని అప్పట్లో వైసీపీ నెగిటివ్ గా ప్రచారం చేయడంతో పాటు టీడీపీ పని అయిపోయింది అని కూడా ర్యాగింగ్ చేయడంతో బాబు మాట మార్చేశారు.
సరే అప్పటి పరిస్థితికి అది ఓకే అనుకున్నా ఇపుడు మాత్రం బాబు తనకు చివరి అవకాశం ఇవ్వాలని కోరితే మాత్రం ఓటర్లు టర్న్ అవుతారు అని అంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలోని ఓటర్లను టర్న్ చేయాలంటే బలమైన ఎమోషనల్ టచ్ ఉండాలని అంటున్నారు.
ప్రస్తుతం చంద్రబాబు వయసు డెబ్బై అయిదేళ్ళు. ఆయనకు ఒక చాన్స్ ఇస్తే ఎనభై ఏళ్ళకు చేరువ అవుతారు. అదే జగన్ వయసు 52 ఏళ్లు. ఆయనకు ఈ చాన్స్ కాకపోయినా మరో చాన్స్ కి ఏజ్ ఉంది అని ఓటర్లు భావించే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరి బాబు ఎన్నికల ప్రచారం చివరలో అయినా తనకు ఇదే లాస్ట్ చాన్స్ అని ఎమోషనల్ ఫీల్ తో అడిగితే ఏపీ పాలిటిక్స్ లో కీలకంగా సంచలంగా మారుతుంది అని అంటున్నారు. మరి బాబు ఆ మాట అన్నా ఆ కార్డు తీసినా వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుందో టీడీపీలో ఎలాంటి స్పందనలు వస్తాయో కూడా చూడాలని అంటున్నారు.