Begin typing your search above and press return to search.

బాబు క్వాష్ పిటిషన్ కొట్టివేత... సీఐడీ లాయర్లు లేవనెత్తిన అంశాలివే!

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   22 Sep 2023 9:05 AM GMT
బాబు క్వాష్ పిటిషన్ కొట్టివేత... సీఐడీ లాయర్లు లేవనెత్తిన అంశాలివే!
X

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. పైగా తీర్పుపై ఆధారపడే కస్టడీ పిటిషన్ కూడా ఉందనే కామెంట్ల నడుమ ఇది మరింత ఆసక్తికరంగా మారింది. దీంతో ఈ పిటిషన్ పై తాజాగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

అవును... స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ పై తాజాగా తీర్పు వెలువడింది. ఈ పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఆ క్వాష్ పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. దీంతో చంద్రబాబుకు ఇది బిగ్ షాక్ అని అంటున్నారు పరిశీలకులు.

తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు జారీ చేసిన రిమాండ్‌ ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పిటిషన్ పై ఈనెల 19న వాదనలు సాగాయి. ఇందులో భాగంగా చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాదులు హరీశ్‌ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించగా... సీఐడీ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదించారు.

అనంతరం ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఈ క్రమంలో తాజాగా శుక్రవారం అత్యంత ఉత్కంఠ నడుమ ఈ పిటిషన్ పై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పు అనంతరం హైకోర్టు అడ్వకేట్స్ స్పందించారు. ఈ క్వాష్ పిటిషన్ ఎందుకు కొట్టివేయబడింది అనే విషయాలు కూలంకషంగా వివరించే ప్రయత్నం చేశారు.

క్రిమినల్‌ కేసులో విచారణ ముఖ్యం, దర్యాప్తు తర్వాతే క్వాష్‌ కు అవకాశం అనేది బేసిక్ పాయింట్ అని చెప్పిన హైకోర్టు అడ్వకేట్లు... ఇప్పుడున్న పరిస్థితి ప్రీ మెచ్యూర్‌ మాత్రమే అని, ఇప్పటికే ఈ స్కాం లో అయిదు లేయర్లను సీఐడీ గుర్తించిందని అన్నారు. ఇదే సమయంలో రు.41 కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టడంపై కూడా సాక్ష్యాలు ఉన్నాయని తెలిపారు!

ఇదే సమయంలో పక్కాగా కేసు కట్టడంతోనే ఇందులో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు సమ్మతి చూపలేదని తెలిపిన ఉన్నతన్యాయస్థాన న్యాయవాదులు... ఈ కేసులో తీగ లాగిన కొద్దీ మరెన్నో కోణాలు బయటపడే అవకాశముందని అన్నారు.

అదే విధగా నోట్‌ ఫైల్స్‌ తో పాటు చంద్రబాబు ఎక్కడెక్కడ సంతకాలు పెట్టారో ఆధారాలున్నాయని.. నిధులు ఏ రకంగా రూట్‌ అయ్యాయో పక్కగా తేలిందని.. ఇదే సమయలో చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ ఇప్పటికే పరారీలో ఉన్నారని.. ఇదే సమయంలో జర్మనీలో ఉన్న సీమెన్స్‌ కంపెనీ వాళ్లను కూడా సంప్రదించాల్సి ఉందని తెలిపినట్లు తెలిపారు.

ఇదే సమయంలో సహ నిందితులందరూ చంద్రబాబు పేరు చెప్పారని చెబుతున్న హైకోర్టు లాయర్లు... సీమెన్స్‌ కంపెనీ పేరు చెప్పి కుంభకోణం జరిపారని అన్నారు. ప్రాథమిక సాక్ష్యాధారాలున్నట్టు న్యాయస్థానం గుర్తించిందని.. అందుకే ఇంతటి ప్రభావం ఉన్న కేసులో ప్రాథమిక దశలో హైకోర్టు జోక్యం చేసుకోలేదని.. ఫలితంగా క్వాష్ ను కొట్టేసిందని తెలిపారు!

ఆ సంగతి అలా ఉంటే... మరోపక్క అంగళ్లు కేసులో బెయిల్‌ పిటిషన్‌ ను హైకోర్టు ఈనెల 23వ తేదీకి వాయిదా వేసింది. ఇదే క్రమంలో... ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ ను 26వ తేదీకి వాయిదా వేసింది. అంతకు ముందు మరో రెండు రోజులు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించిన సంగతి తెలిసిందే!

ఇదే క్రమంలో... కేసులో చాలా లోతు ఉందని.. 17ఏ అనే ఒక్క పాయింట్‌ తో కేసు ఎలా గెలుస్తారనుకున్నారో తెలియదని.. అసలు ఇంత పెద్ద స్కాం లో అసలు విషయాన్ని పక్కనపెట్టి, అరెస్ట్ చేసిన విధానాన్ని ఎలా ప్రశ్నిస్తారని.. ఇన్ని డాక్యుమెంటరీ ఆధారాలుండగా క్వాష్‌ కోసం ఏ అడ్వొకేట్‌ ప్రయత్నించరని.. అసలు క్వాష్‌ వేసి బయటపడవచ్చని చంద్రబాబు ఎందుకు నమ్మారో తెలియదని హైకోర్టు అడ్వకేట్లు చెప్పడం గమనార్హం!