వలంటీర్లకు ఓకే కానీ, కండిషన్లు: చంద్రబాబు
అయితే.. ఎన్నికల సమయంంలో మాత్రం.. వలంటీర్లను కూడా వచ్చే ప్రభుత్వంలో తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు.
By: Tupaki Desk | 31 July 2024 5:00 PM GMTఏపీలో ఎన్నికలకు ముందు తీవ్ర రచ్చకు దారి తీసిన వలంటీర్ల వ్యవహారం.. తర్వాతకూడా కొనసాగుతోం ది. వలంటీర్లు వైసీపీకి అనుబంధంగా పనిచేస్తున్నారని.. వీరిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని చంద్రబాబు అనేక ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో సిటిజన్స్ ఫర్ డెమొక్రటిక్ అనే సంస్థ తరఫున ఎన్ని కల సంఘానికి ఫిర్యాదులు వెళ్లి.. ఎన్నిక లసమయంలో వారు విధులకు దూరంగా ఉన్నారు. ఇప్పటికీ వారిని విధుల్లోకి తీసుకోలేదు. అయితే.. ఎన్నికల సమయంంలో మాత్రం.. వలంటీర్లను కూడా వచ్చే ప్రభుత్వంలో తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు.
అప్పటి వరకు వైసీపీ ఇస్తున్న రూ.5000 స్థానంలో తాము రూ.10000 ఇస్తుమని కూడా చెప్పారు. అయితే.. ఎన్నికల ఫలితాలు వచ్చే సి రెండు మాసాలు అయిపోతున్నా.. ఇప్పటి వరకు వలంటీర్ల వ్యవహారం ఒక కొలిక్కి రాలేదు. దీనిపై వలంటీర్లు.. ప్రజాదర్బార్‌లలో ప్రశ్నలు సంధిస్తున్నారు. కలెక్టర్ల కార్యాలయాల్లో విన్నపాలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు ఈ సమస్యపై స్పందించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నట్టు ఆయన అధికారులకు తెలిపారు.
అయితే.. వలంటీర్ల సేవలను ఇక నుంచి వారి విద్యను ఆధారంగా.. వారికి ఉన్న స్కిల్స్ ఆధారంగా వినియోగించుకునేందుకు సిద్ధమని చెప్పారు. అదేవిధంగా వలంటీర్ల కెపాసిటీ పెంచేలా వారికి స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిపారు. వలంటీర్ల విద్యార్హత, వయసు ఆధారంగా శిక్షణకు ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. వాటి ప్రకారమే వలంటీర్ల సేవలు ఉంటాయని.. గతంలో మాదిరిగా.. కాకుండా వారి స్కిల్స్‌ను వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు చంద్రబాబు వివరించారు. ఈ వ్యవహారంపై త్వరలో నిర్వహించే మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
వలంటీర్ల లెక్క ఇదీ..
+ వలంటీర్లలో పీజీ చేసిన వారు 5 శాతం ఉన్నారు.
+ డిగ్రీ చేసిన వారు 32 శాతం ఉన్నారు.
+ 20 -25 మధ్య వయసు ఉన్నవారు 25 శాతం మంది ఉన్నారు.
+ 25-30 మద్య వయసు ఉన్నవారు 34 శాతం మంది ఉన్నారు.
+ 31-35 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు 28 శాతం మంది ఉన్నారు.
ఇవీ కండిషన్లు..
+ ప్రతి ఒక్కరూ తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకోవాలి.
+ ప్రభుత్వం ఇచ్చే శిక్షణకు రావాల్సి ఉంటుంది.
+ ప్రజలకు మరిన్ని సేవలు అందించాలి.
+ పరిమిత సంఖ్యలోనే... పరిమిత కాలం సేవలకు సిద్దం కావాలి.