ఆ ముచ్చట ఇలా.. తీర్చుకున్న చంద్రబాబు!
దీంతో కేవలం గిరిజనులతో మాట్లాడి.. వారి బాగోగులు తెలుసుకుని సరిపుచ్చేవారు.
By: Tupaki Desk | 9 Aug 2024 10:04 AM GMTమనిషన్నాక కొన్ని ముచ్చట్లుంటాయ్! నాయకుడైనా.. మనిషికైనా అవి కామనే! ఇప్పుడు అలాంటి ము చ్చటనే సీఎం చంద్రబాబు తీర్చుకున్నారు. గిరిజనులతో ఆడిపాడాలన్నది చంద్రబాబు ఆశ.. కోరిక.. ముచ్చట. అయితే.. ఆయనకు అవకాశం చిక్కలేదా? అంటే..గ తంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చిక్కింది. అయితే.. అప్పట్లో ఆయనకు కుదరలేదు. దీంతో కేవలం గిరిజనులతో మాట్లాడి.. వారి బాగోగులు తెలుసుకుని సరిపుచ్చేవారు.
అయితే.. ఇప్పుడు నాలుగో సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. చంద్రబాబు కుదరకపోయినా.. కుదు ర్చుకుని.. తన ముచ్చట తీర్చుకున్నారు. శుక్రవారం జాతీయ ఆదివాసీ(గిరిజన) దినోత్సవం.దీనిని పురస్కరించుకుని ఆయన గిరిజన ప్రాంతాలైన మన్యం జిల్లాకువెళ్లాల్సి ఉంది. కానీ, షెడ్యూల్ బిజీగా ఉండడం.. వేరే కార్యక్రమాలు ఉండడంతో దానిని రద్దు చేసుకున్నారు. ఈ క్రమంలో విజయవాడకే పలు ప్రాంతాల నుంచి గిరిజనులను రప్పించుకున్నారు.
విజయవాడలోని ప్రముఖ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రాన్నిచిన్నపాటి మన్యం జిల్లాగా మార్చే శారు. అక్కడికి వచ్చిన వివిధ జిల్లాల గిరిజనులను చంద్రబాబు కలుసుకున్నారు. అంతేకాదు.. అరకు కాఫీ రుచిని కూడా ఆశ్వాదించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సాయాలు, ఇతర పథకాలను కూడా ఆరా తీశారు. అనంతరం.. గిరిజన సంప్రదాయ కొమ్ములు ధరించి ఫొటోలకు ఫోజులు ఇచ్చారు.
అంతేకాదు.. గిరిజనుల డ్రమ్ములను మెడలో వేసుకుని వాటిని సైతం వాయించారు. గిరిజన ఆడబిడ్డలతో కలిసి థింసా నృత్యాలు చేశారు. అనంతరం వారితో కలిసి మినీ మీల్స్ కూడా తీసుకున్నారు. గిరిజనుల సంప్రదాయ వంటకాలను కూడా చంద్రబాబురుచి చూశారు. వారి నైపుణ్యాన్ని ప్రశంసించారు. వారిని ప్రోత్సహించేందుకు త్వరలోనే ఓ పథకం తీసుకురానున్నట్టు చంద్రబాబు చెప్పారు. అయితే.. ఇన్నాళ్లకు చంద్రబాబు తన మనసులో ముచ్చటను తీర్చుకోవడంతో టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.