తమ్ముళ్ళకు బాంబు లాంటి న్యూస్ చెప్పిన బాబు...
అంతే కాదు పార్టీ వీక్ అయింది తెలిసిన మరుక్షణం ఆ ప్లేస్ లో కొత్త ఇంచార్జి వచ్చేస్తారు అని కూడా బాబు భవిష్యత్తు కూడా తమ్ముళ్ల కళ్ల ముందుంచారు
By: Tupaki Desk | 10 Dec 2023 12:30 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబు ఈసారి రొటీన్ కి భిన్నంగా వెళ్లాలని చూస్తున్నారు. బాబు అంటే మామూలుగా మొహమాటానికి పోతారు అని పేరు. ఆయన చివరి నిముషంలో వత్తిళ్లకు లొంగి టికెట్లు ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దాని వల్లనే గత ఎన్నికల్లో ఓటమి ఎదురైంది అని కూడా అంటారు. కానీ 2024 ఎన్నికలు అలాంటివి కావు. ఈసారి మాత్రం చంద్రబాబు నో మొహమాటం అంటున్నారు. అసలు ఎవరి మాటా వినను అని కూడా క్లారిటీగా చెబుతున్నారు.
గెలిచే వారికే టికెట్లు. ఈ విషయంలో రెండవ మాట లేనే లేదు. పనిచేసే వారికే టికెట్ అదే వస్తుంది. అంతే తప్ప మిగిలిన వాటిని పట్టుకుని పని చేయకుండా ఉంటే నో టికెట్ అని బాబు వార్నింగ్ ఇచ్చేశారు. తుపాను బాధితులను పరామర్శిస్తున్న చంద్రబాబు ఈ నేపధ్యంలో పార్టీలో రిపేర్లను కూడా చేస్తున్నారు.
గెలిచే వారే తనకు కావాలని వారికే పిలిచి మరీ టికెట్లు ఇస్తామని బాబు స్పష్టంగా చెప్పేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో మాట్లాడుతూ ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ పనితీరు బాగా లేదు అని వస్తే అక్కడ ఇంచార్జిలకు టికెట్లు లేనట్లే అని బాబు చెప్పేశారు. సర్వేల ద్వారా ఎప్పటికపుడు పార్టీ పనితీరుని సమీక్షిస్తామని ఎవరైతే పనిచేయరో వారికి టికెట్లు దక్కవని హెచ్చరించారు.
అంతే కాదు పార్టీ వీక్ అయింది తెలిసిన మరుక్షణం ఆ ప్లేస్ లో కొత్త ఇంచార్జి వచ్చేస్తారు అని కూడా బాబు భవిష్యత్తు కూడా తమ్ముళ్ల కళ్ల ముందుంచారు. ఆ మీదట మీ ఇష్టం అని ఆయన కుండబద్దలు కొట్టారు. పార్టీ మాత్రమే తనకు ముఖ్యమని బాబు పదే పదే చెప్పుకు వచ్చారు. ఎవరి కోసమో పార్టీని ఫణంగా పెట్టేది లేనే లేదు అని బాబు అంటున్నారు.
రాష్ట్ర ప్రజలకు టీడీపీ అవసరం ఉందని, దాన్ని గ్రహించి అంతా పనిచేయాలని బాబు అనడం విశేషం. ఇక ఎప్పటికపుడు పార్టీని పరుగులు పెట్టించాలని నియోజకవర్గం ఇంచార్జి అంటే తాను అన్ని బాధ్యతలు తీసుకుని దూకుడుగా ముందుకు సాగాలని బాబు దిశా నిర్దేశం చేశారు. ప్రతీ దానికీ అధినాయకత్వం చూసుకుంటుందని భావించకూడదని అన్నారు. ఇలాంటి ఉదాశీనతను ప్రదర్శిస్తే కనుక నష్టపోతారని కూడా వార్నింగ్ ఇచ్చేశారు.
ఉన్న నాలుగు నెలల కాలంలో నిరంతరం ప్రజలలో ఉంటూ ప్రజా సమస్యల మీద పోరాడాలని బాబు సూచించారు. మొత్తానికి చూస్తే చంద్రబాబు ఇదివరకులా అయితే లేదు. ఏ చిన్న చాన్స్ ని ఆయన వదులుకోవడంలేదు. పార్టీని గెలిపించుకోవాలన్నదే బాబు టార్గెట్ గా ఉంది. దాంతో బాబు మాటలు విన్న తమ్ముళ్ల గుండెలలో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఏదో విధంగా ఇంచార్జి అయిన వారు తమకు తప్పకుండా టికెట్లు వస్తాయని ధీమాగా ఉన్న వారికి బాబు తాజా స్టేట్మెంట్స్ తో కళ్ళు తెరిపించేశారు అని అంటున్నారు.
ఇంచార్జి అయినంతమాత్రామ టికెట్ దక్కదని కూడా బాబు సందేశం ఇచ్చారు. అనేక సందేహాలను ముందుంచారు. దాంతో తమ్ముళ్ళు ఇక జనంతో మమేకం కావాల్సిందే అని తేల్చేశారు. ఈ పరిణామంతో ఎవరికి టికెట్లు వస్తాయన్నది మాత్రం అర్ధం కావడం లేదు అంటున్నారు. గెలుస్తారు అనుకుంటే వారికే ఇస్తామని బాబు చెప్పడంతో చాలా మందికి టెన్షన్ మొదలైంది.
ఏది ఏమీనా చంద్రబాబులో వచ్చిన ఈ మార్పు పార్టీకి చాలా మంచిదని సీనియర్లు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవాలీ అంటీ ఇలాగే కఠినంగానే ఉండాలని అంటున్నారు. ఇంతకీ టీడీపీలో గెలుపు గుర్రాలు ఎవరు వారిని ఎలా డిసైడ్ చేస్తారు అన్నది మాత్రం బాబు సరైన సమయంలో చెబుతారు. తమ్ముళ్ళు మాత్రం తమకు అప్పగించిన పనిని తుచ తప్పకుండా చేస్తూ ఆయా నియోజకవర్గాలలో పార్టీని పరుగులెత్తించాల్సిందే అంటున్నారు.