బాబు జనవరి పొలిటికల్ డైరీ ఫుల్...జోరు పెంచేశారుగా...!
ఏపీలో ప్రధాన ప్రతిపక్షం జోరు పెంచేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయి బయటకు వచ్చి డిసెంబర్ నెలాఖరు నాటికి రెండు నెలలు దాటుతోంది.
By: Tupaki Desk | 29 Dec 2023 3:57 AM GMTఏపీలో ప్రధాన ప్రతిపక్షం జోరు పెంచేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయి బయటకు వచ్చి డిసెంబర్ నెలాఖరు నాటికి రెండు నెలలు దాటుతోంది. ఈ మధ్యలో బాబు ఒకటి రెండు బహిరంగ సభలు నిర్వహించారు. యువగళం ముగింపు సభ అందులో హైలెట్ గా నిలిచింది. అయితే అది లోకేష్ ని హైలెట్ చేసేదిగానే సాగింది.
ఇక ఏపీ పాలిటిక్స్ ని తమ వైపునకు తిప్పుకునేందుకు టీడీపీ జోరు పెంచాల్సిన అవసరం ఉంది అని అంతా అంటున్న నేపధ్యం ఉంది. దాంతోనే ఇపుడు టీడీపీ చంద్రబాబు మీటింగ్స్ ని డిజైన్ చేస్తూ ఏపీలో భారీ పొలిటికల్ షెడ్యూల్ ని ఖరారు చేసింది. జనవరి నెల అంతా చంద్రబాబు వరస మీటింగ్స్ జరగబోతున్నాయి.
అవి కూడా ఏపీలోని పాతిక పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో జరగనున్నాయి. ఒక్కో ఎంపీ స్థానంలో ఒక బహిరంగ సభను నిర్వహించేలా టీడీపీ ప్లాన్ చేసింది. ఈ సభను జనవరి 5 నుంచి మొదలవుతాయి. జనవరి 29తో ముగుస్తాయి. ఇందులో తొలి విడతగా జనవరి 5 నుంచి 10 వరకూ చంద్రబాబు మీటింగ్స్ ఇలా ఉండబోతున్నాయి.
ఒంగోలు ఎంపీ సీటు నుంచి బాబు తొలి మీటింగ్ మొదలెడతారు. జనవరి 5న కనిగిరిలో స్టార్ట్ చేసి భారీ బహిరంగ సభతో బాబు ప్రచారానికి శ్రీకారం చుడతారు. జనవరి 7న తిరువూరు, ఆచంటలలో బాబు మీటింగ్స్ ఉంటాయి. జనవరి 9న వెంకట గిరి, ఆచంటలలో మీటింగ్స్ ఉంటాయి. జనవరి 10న పెద్దాపురం టెక్కలిలలో బాబు మీటింగ్స్ ఉంటాయి.
ఇక సంక్రాంతి పండుగ పూర్తి అయిన తరువాత బాబు రెండవ విడత సభలు ఉంటాయి. అవి జనవరి 29 దాకా సాగుతాయి. అవన్నీ కూడా జనవరి 29తో ముగుస్తాయి. అంటే జనవరి నెలాఖరు నాటికి పాతిక మీటింగ్స్ బాబు కంప్లీట్ చేస్తారు అన్న మాట.
ఇది నిజంగా భారీ పొలిటికల్ యాక్షన్ ప్లాన్ గా చెప్పాలి. రోజుకు రెండు నుంచి మూడు సభలు ఒక నెలలో పాతిక సభకు అంటే చంద్రబాబు జోరు ఏంటి అన్నది అర్ధం అవుతుంది. అదే టైం లో ఈ సభల ద్వారా ఎన్నికల వేడిని రాజేయడం కూడా టీడీపీ లక్ష్యం అని అంటున్నారు. ఏపీలో కీలకంగా ఉన్న మూడు రీజియన్స్ ని కవర్ చేయడం కూడా ఈ సభన ఉద్దేశ్యం.
ఈ విధంగా జనవరి నెలాఖరు నాటికి కీలకమైన ప్రచారాన్ని నిర్వహించాలన్నది టీడీపీ ఆలోచనగా ఉంది. మొత్తంగా చూస్తే చంద్రబాబు పొలిటికల్ డైరీ కొత్త ఏడాది కొత్త నెలలో ఫుల్ అని అంటున్నారు. మరి హెలికాప్టర్ల ద్వారా వాయు మార్గాన వాయు వేగంతో బాబు ఈ సభలను కవర్ చేస్తారు అని అంటున్నారు.