మడత పెట్టేసి : బాబు వర్సెస్ జగన్ మమమ్మాస్ కౌంటర్స్...!
ఆయన ఎన్నికల సంగ్రామంలోకి ఉత్సాహంగా పాలుపంచుకోవాలని కార్యకర్తలను కోరుతూ ఈ మాస్ డైలాగ్ వేశారు.
By: Tupaki Desk | 15 Feb 2024 5:31 PM GMTఈ మధ్యనే వచ్చిన గుంటూరు కారం మూవీలో కుర్చీ మడతెట్టి అని ఒక పక్కా మాస్ డైలాగ్ తో సాంగ్ ఉంది. అది ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు. ఇపుడు ఆ సాంగ్ లోని డైలాగ్ ఏపీలో పాలిటిక్స్ కి తెగ కనెక్ట్ అవుతోంది. వాలంటెర్లకు వందనం సభలో జగన్ ఒక మాస్ డైలాగ్ వాడారు. చొక్కా చేతులు మడత బెట్టి రంగంలోకి దిగాలని ఆయన వైసీపీ క్యాడర్ ని కోరారు.
ఆయన ఎన్నికల సంగ్రామంలోకి ఉత్సాహంగా పాలుపంచుకోవాలని కార్యకర్తలను కోరుతూ ఈ మాస్ డైలాగ్ వేశారు. విజయవాడలో జరిగిన విధ్వంసం పుస్తకావిష్కరణ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ మాస్ డైలాగ్ కి అదే రేంజిలో కౌంటర్ ఇచ్చారు. మీరు చొక్కా చేతులు మడత బెట్టి వస్తే మేము ఊరుకుంటామా అంటూ టీడీపీ జనసేన కార్యకర్తలు కుర్చీలు మడత పెట్టి వస్తారని అపుడు జగన్ కూర్చున్న సీఎం కుర్చీయే గల్లంతు అవుతుంది అని పక్కా మాస్ టోన్ తో చెప్పారు. బాబు ఈ డైలాగ్ చెబుతూంటే ఆ సభకు హాజరైన టీడీపీ జనసేన క్యాడర్ లో ఫుల్ జోష్ కనిపించింది.
బాబు కూడా ఈ ఏజ్ లో మమమ్మాస్ అంటూ ఇలా తనలోని న్యూ షేడ్ ని పరిచయం చేయడంతో ఈసారి పొలిటికల్ వార్ కొత్త స్టైల్ లో ఉండే చాన్స్ ఉందని అంటున్నారు ఎర్లీ సెవెంటీస్ నుంచి పాలిటిక్స్ చేస్తూ వస్తున్న చంద్రబాబు అప్డేట్ అయినట్లుగా ఆయన తాజా స్పీచెస్ బట్టి అర్ధం అవుతోంది.
యూత్ కి కనెక్ట్ కావడంతో పాటు మాస్ కి దగ్గర అయ్యేందుకు బాబు ఈ స్టైల్ ని అలవాటు చేసుకున్నారు అని అంటున్నారు. ఎన్నికలు అంటే యుద్ధం కాదు జగన్ రెడ్డి గుర్తు పెట్టుకో. మీరు సీఎం సీటులో ఉన్నారు. హుందాగా మీరు ఉంటే మేమూ ఉంటామని మాస్ వార్నింగ్ ఒకటి ఈ సందర్భంగా బాబు ఇచ్చేసారు. మొత్తానికి ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ టీడీపీ వైసీపీల మధ్య డైలాగ్ వార్ కొత్త రూపు సంతరించుకుంటోంది.
దానితో పాటు జగన్ ఒకటి అంటే మేము నాలుగు అప్ప చెబుతామని టీడీపీ అధినేత చంద్రబాబు అంటున్నారు. మరో వైపు టీడీపీ జనసేన పొత్తు వల్ల మాస్ క్యాడర్ కి రీచ్ అయ్యేందుకు బాబు కొత్త అవతార్ లోకి మారుతు న్నారు అని అంటున్నారు. జగన్ సైతం చొక్కాలు మడతపెట్టి అని మాస్ గా స్టార్ట్ చేస్తే కుర్చీలు మడతెడదామని బాబు దాన్ని వేరే సౌండ్ తో ముగించారు. ఇపుడు జగన్ ఏమి అంటారో. ఈ మాస్ డైలాగ్ వార్ ఎందాక వెళ్తుందో చూడాల్సిందే.