మోడీ పరిచయం చేసిన గగన్ యాన్ వ్యోమగాముల బ్యాక్ గ్రౌండ్ ఇదే!
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. హ్యాట్రిక్ ప్రధానిగా తన పేరును నమోదు చేసుకోవాలన్న తపనతో ఉన్న ఆయన.. అనూహ్య అంశాల్ని ప్రస్తావిస్తూ.. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ను అంతకంతకూ పెంచుకుంటూ వెళుతున్నారు.
By: Tupaki Desk | 28 Feb 2024 5:07 AM GMTఎప్పుడేం చేయాలన్న అంశంపై అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వ్యక్తుల్లో సరైన స్పష్టత లోపిస్తూ ఉంటుంది. అయితే.. అందుకు భిన్నంగా కనిపిస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆయన వేసే అడుగులు.. తీసుకునే నిర్ణయాలు.. ప్రకటించే ప్రకటనలు చూస్తే.. ఆయన తీరుకు ఫిదా కావాల్సిందే. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. హ్యాట్రిక్ ప్రధానిగా తన పేరును నమోదు చేసుకోవాలన్న తపనతో ఉన్న ఆయన.. అనూహ్య అంశాల్ని ప్రస్తావిస్తూ.. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ను అంతకంతకూ పెంచుకుంటూ వెళుతున్నారు. మొన్నటికి మొన్న సముద్ర గర్భంలోని ద్వారకను సందర్శించిన ఆయన.. తాజాగా రాబోయే రోజుల్లో అంతరిక్షయాత్ర చేసే భారత వ్యోమగాముల్ని పరిచయం చేయటం ద్వారా.. తమ ప్రభుత్వ సత్తా ఏమిటన్న విషయాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేశారు.
గగన్ యాన్ ప్రాజెక్టులో భాగంగా 2019లో నలుగురిని ఇస్రో ఎంపిక చేసింది. వైమానిక దళానికి చెందిన ఈ నలుగుర్ని తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పరిచయం చేశారు. ఈ నలుగురిలో ఇద్దరు ఉత్తరప్రదేశ్ కు చెందిన వారు కాగా మిగిలిన ఇద్దరిలో ఒకరిది చెన్నై అయితే.. మరొకరిది కేరళ. నాలుగేళ్లుగా కఠోర శిక్షణను ఎదుర్కొన్న వీరిని వ్యక్తులుగా కాకుండా.. ప్రజల ఆకాంక్షల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లే శక్తులుగా ప్రధాని మోడీ అభివర్ణించారు. అంతేకాదు.. 20235 నాటికి భారత్ తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందన్న విషయాన్ని ప్రకటించి.. దేశ ప్రజలకు తియ్యటి కబురును అందించటం తెలిసిందే. ఇంతకూ గగన్ యాన్ ఎప్పుడు నిర్వహిస్తున్నారు? అంటే.. వచ్చే ఏడాదిగా చెప్పాలి. 2025ను లక్ష్యంగాపెట్టుకున్నారు. ఈ ప్రయోగంలో నలుగురు వ్యోమగాముల్ని మూడు రోజుల పాటు 400 కిలోమీటర్ల కక్ష్యలోకి ప్రవేవ పెడతారు. అనంతరం వారిని సురక్షితంగా కిందకు తీసుకొస్తారు.
మూడు రోజులపాటు సాగే ‘గగన్‌యాన్’లో వ్యోమగాములను 400 కిలోమీటర్ల కక్ష్యలోకి ప్రవేశ పెడతారు. అనంతరం వారిని సురక్షితంగా కిందికి తీసుకువస్తారు. 2025లో ఈ ప్రయోగాన్ని చేపట్టాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకొంది.
ఇదంతా ఓకే కానీ.. గగన్ యాన్ ప్రాజెక్టుకు ఎంపికైన ఆ నలుగురు వ్యోమగాములు.. వారి బ్యాక్ గ్రౌండ్ ఏమిటన్న విషయం ఆసక్తికరంగా మారింది. ఇంతకూ ఆ నలుగురి బ్యాక్ గ్రౌండ్ లోకి వెళితే..
1. గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ నాయర్
2. గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్
3. గ్రూప్ కెప్టెన్ అజిత్ క్రిష్ణన్
4. గ్రూప్ కెప్టెన్ సుభాంశు శుక్లా
కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ తుంబాలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. రోదసీలోకి వెళ్లనున్న నలుగురు వ్యోమగాముల్ని ప్రత్యేకంగా అభినందించారు. నలభై ఏళ్ల తర్వాత భారతీయులు అంతరిక్షంలోకి వెళ్లనున్నారని.. సమయం మనదే.. కౌంట్ డౌన్ మనదే అంటూ భావోద్వేగాన్ని టచ్ చేసేలా వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.
నలుగురి వ్యోమగాముల బ్యాక్ గ్రౌండ్ లోకి వెళితే..
ప్రశాంత్ నాయర్: 1976లొ కేరళలో జన్మించిన ఆయన నేషనల్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థి. మొత్తం టీంలో ఇతనే పెద్ద వయస్కుడు. ఖడ్గ సత్కార గ్రహీత. 1998లో ఐఏఎఫ్ యుద్ధ విమానాల విభాగంలో రిక్రూట్ అయ్యారు. ఎస్‌యూ-30 ఎంకేఐ, మిగ్-21, మిగ్-29, హాక్, డార్నియర్, ఏఎన్-32లను నడిపిన అనుభవంతోపాటు.. దాదాపు 3వేల గంటలు నడిపిన అనుభవజ్ఖుడు.
అజిత్ కృష్ణన్: 1982లో చెన్నైలో జిన్మించిన ఇతను.. నేషనల్ డిఫెన్స్ అకాడమీ విద్యా ర్థి. రాష్ట్రపతి బంగారు పతకంతో సహా వైమానిక అకాడమీలో ఖడ్గ సత్కార గ్రహీత. 2003 లో ఐఏఎఫ్ యుద్ధ విమానాల విభాగంలో రిక్రూట్ అయ్యారు. 2900 గంటల అనుభవంతో పాటు..ఎస్‌యూ-30 ఎంకేఐ, మిగ్-21, మిగ్-29, హాక్, డార్నియర్, ఏఎన్-32లను నడపగలరు.
అంగద్ ప్రతాప్: 1982లో ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో పుట్టారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థి. 2004లో ఐఏఎఫ్ యుద్ధ విమానాల విభాగంలో రిక్రూట్ అయ్యారు. 2000 గంటల అనుభవంతో పాటు.. ఎస్‌యూ-30 ఎంకేఐ, మిగ్-21, మిగ్-29, హాక్, డార్నియర్, జాగౌర్, ఏఎన్-32లను నడుపుతారు.
సుభాంశు శుక్లా: ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవులో 1985లో పుట్టారు. మొత్తం నలుగురిలో ఇతనే చిన్న వయస్కుడు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ స్టూడెంట్. 2006లో ఐఏఎఫ్ యుద్ధ విమానాల విభాగంలో రిక్రూట్ అయిన ఆయన.. ఇప్పటివరకు 2000 గంటలు వివిధ ఎయిర్ క్రాఫ్ట్స ను నడిపిన అనుభవం ఉంది. ఎస్‌యూ-30 ఎంకేఐ, మిగ్-21, మిగ్-29, హాక్, డార్నియర్, జాగౌర్, ఏఎన్-32లను నడుపుతారు.