టాప్-50 ధనవంతుల్లో 49మందికి బ్యాడ్ న్యూస్... ఒక్కరికే గుడ్ న్యూస్!
అవును... మంగళవారం మొత్తం టాప్-50 అత్యంత ధనవంతుల్లో 49 మంది సంపద కరిగిపోయింది. అయితే మిగిలిన ఒక్కరు మాత్రం సేఫ్ అయ్యారు.
By: Tupaki Desk | 27 Sep 2023 11:30 PM GMTసెప్టెంబర్ 26 సెషన్ లో ప్రపంచ దిగ్గజ వ్యాపారవేత్తలు, కుబేరులకు భారీ షాక్ తగిలింది. కన్నుమూసి తెరిచేలోగా అన్నట్లుగా అతి స్వల్ప వ్యవధిలో బిలియన్ డాలర్ల సొమ్ము ఆవిరైపోయింది. దీంతో టాప్ 50 ధనవంతుల్లో సుమారు 49 మందికి భారీ దెబ్బ తగిలింది. కానీ... ఒక్కరు మాత్రం సేఫ్ అయ్యారు.. కాదు ఎర్న్ కూడా చేశారు!
అవును... మంగళవారం మొత్తం టాప్-50 అత్యంత ధనవంతుల్లో 49 మంది సంపద కరిగిపోయింది. అయితే మిగిలిన ఒక్కరు మాత్రం సేఫ్ అయ్యారు. ఆయన ఒక భారతీయుడు కావడం గమనార్హం. ఆయనే... ప్రపంచ అత్యంత ధనవంతుల జాబితాలో 40వ స్థానంలో ఉన్న షాపూర్ మిస్త్రీ! ఈయన సంపద 32.2 బిలియన్ డాలర్లుగా ఉండగా.. మంగళవారం సెషన్ లో 34.3 మిలియన్ డాలర్లు పెరిగింది.
ఇక సంపాధించిన భారతీయుడి సంగతి అలా ఉంటే... ప్రపంచ కుబేరుల జాబితాలో ఎక్కువ సంపద నష్టపోయింది మాత్రం అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్. అవును... ఒక్కరోజులోనే 5.24 బిలియన్ డాలర్ల జెఫ్ బెజోస్ సంపద ఆవిరైంది. అనంతరం లారీ ఎలిసన్ సంపద 3.02 బిలియన్ డాలర్లు పతనమైంది.
అనంతరం... ప్రపంచంలోనే రెండో అత్యంత కుబేరుడిగా ఉన్న లూయిస్ విట్టన్ బాస్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ 2.53 బిలియన్ డాలర్లు నష్టపోగా.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ కూడా మంగళవారం ఒక్క రోజులో 2.05 బిలియన్ డాలర్లు పోగొట్టుకున్నారు.
ఇక భారత దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ 2.77 బిలియన్ డాలర్లు కోల్పోగా... అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ 568 మిలియన్ డాలర్ల సంపద నష్టపోయారని తెలుస్తుంది! దీంతో ఈ ఏడాది ఎక్కువ సంపద నష్టపోయిన వారి జాబితాలో అదానీ స్థానం పదిలంగా ఉంది! ప్రస్తుతం కుబేరుల జాబితాలో అదానీ 19వ స్థానంలో ఉండగా.. అంబానీ 11వ స్థానంలో నిలిచారు.
కాగా... 228 బిలియన్ డాలర్ల సంపదతో ఎలాన్ మస్క్ అత్యంత ధనవంతుడిగా ఉండగా.. 161 బిలియన్ డాలర్ల సంపదతో బెర్నార్డ్ ఆర్నాల్ట్ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక 150 బిలియన్ డాలర్లతో బెజోస్, 124 బిలియన్ డాలర్లతో బిల్ గేట్స్, 120 బిలియన్ డాలర్లతో వారెన్ బఫెట్ లు మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.