Begin typing your search above and press return to search.

కవితకు బెయిల్ వస్తుందని ముందే ఎలా తెలుసు?

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితకు సరిగ్గా ఆగస్టు 27న బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులకు ఎలా తెలుసు.

By:  Tupaki Desk   |   28 Aug 2024 6:00 AM GMT
కవితకు బెయిల్ వస్తుందని ముందే ఎలా తెలుసు?
X

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితకు సరిగ్గా ఆగస్టు 27న బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులకు ఎలా తెలుసు. ఇది పెద్ద చర్చగా ఇపుడు నడుస్తోంది. అంతే కాదు బీఆర్ఎస్ కీలక నేతలు అంతా ఢిల్లీ వెళ్లడం కూడా చాలా అర్ధాలను సూచిస్తోంది అని అంటున్నారు. ఇప్పటికి ఎన్నో సార్లు కవిత కోర్టులో బెయిల్ పిటిషన్ వేయడం దానిని కోర్టులు కొట్టేయడం జరుగుతూ వస్తోంది.

ఈసారి కూడా అలా ఎందుకు జరగకూడదని అని బీఆర్ఎస్ శ్రేణులు భావించలేదు అన్నది పెద్ద ప్రశ్న. అంతే కాకుండా డ్యాం ష్యూర్ గా కవితకు బెయిల్ రావడం ఖాయమని అంతా కలసి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కడం వెనక ఏమి జరిగి ఉంటుంది తెర వెనక ఎవరు ఉన్నారు ఇత్యాది విషయాలు ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి.

నిజానికి చూస్తే కవిత తీహార్ జైలులో సరిగ్గా అయిదున్నర నెలలుగా ఉన్నారు. ఆమె ఎన్నో సార్లు బెయిల్ కోసం అడిగినా నో అన్న ఆన్సర్ వచ్చింది. ఆమెకు అలా బెయిల్ దక్కకుండా పోయింది. కానీ ఈసారి మాత్రం బెయిల్ వచ్చింది. అంతే కాదు ఆమె ప్రతీ సారీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసినపుడల్లా బీఆర్ఎస్ శ్రేణులు ఎవరూ ఢిల్లీ గడప తొక్కలేదు.

కానీ చిత్రంగా ఈసారి టాప్ టూ బాటమ్ ముఖ్య నేతలు అంతా ఢిల్లీ టూర్ చేశారు. అంతే కాదు కవితలు బెయిల్ రావడం ఖాయమని క్యాడర్ కి కూడా రెండు రోజుల ముందు నుంచే మ్యాటర్ లీక్ అయింది అని కూడా ప్రచారం సాగుతోంది. దాంతో జై జై నినాదాలతో కోసం క్యాడర్ ని కూడా ఢిల్లీకి వెంటబెట్టుకుని వెళ్ళారు బీఆర్ఎస్ అగ్ర నేతలు.

బెయిల్ అనేది కోర్టు పరిధిలోని అంశం. వాదనలలో పస ఉంటే బెయిల్ రావచ్చు. అది విచారణ సందర్భంగా తేలే విషయం. కానీ కచ్చితంగా కవితకు బెయిల్ వస్తుంది అని బీఆర్ఎస్ అగ్ర నేతలకు ఎలా తెలుసు అన్నదే ఇక్కడ వాలీడ్ పాయింట్. కవితకు బెయిల్ వస్తుందన్న నమ్మకం బీఆర్ఎస్ నేతలకు ఉండొచ్చు కానీ జడ్జీలకే ఆ విషయం తెలియదు అని అంటున్నారు.

మరి బీఆర్ఎస్ హై కమాండ్ కి ఈ విషయాలు ఎల తెలుస్తాయని కూడా అంటున్నారు. ఒకేసారి కూడబలుక్కున్నట్లుగా కట్టకట్టుకున్నట్లుగా అంతమంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఇతర ముఖ్య నేతలు పోలోమంటూ ఢిల్లీకి వెళ్లారు అంటే కచ్చితంగా బీఆర్ఎస్ పెద్దలకు కవితకు బెయిల్ వస్తుందన్నది ముందుగానే తెలుసు అన్న డౌట్లు అయితే వస్తున్నాయి.

ఇదే విషయం మీద రాజకీయ విశ్లేషకులు కూడా చర్చించుకుంటున్నారు. బెయిల్ అనేది న్యాయపరమైన విధానం. అది కోర్టులో తేలే అంశం. కానీ ముందస్తుగా ఇంతమందిని పోగు చేసుకుని మరీ ఢిల్లీకి వెళ్ళగలిగారు అంటే బీఆర్ఎస్ ఏమైనా ఈ విషయంలో ఉప్పు అందిందా అన్నదే చర్చగా ఉంది. దీంతోనే ముందే బీఆర్ఎస్ పెద్దలకు ఈ బెయిల్ విషయం తెలుసునేమో అన్న అనుమానాలు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

ఇక కేంద్ర మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ అయితే కాంగ్రెస్ ఉంది దీని వెనకాల అని అంటున్నారు. అయితే ఈ ఆరోపణలను తిప్పుకొడుతున్న కాంగ్రెస్ నేతలు బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనానికి ముహూర్తం దగ్గర పడుతుంది కాబట్టే ఇదంతా అని అంటోంది. ఇలా చూసుకుంటే కనుక ఒకరిని ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు

అసలు దీని వెనకాల ఏమి జరిగి ఉంటుంది అన్నది మాత్రం రకరకాలైన స్టోరీస్ రెడీ అవుతున్నాయి. కొందరు అయితే ఇదే మ్యాటర్ మీద షార్ట్ ఫిలిం తీద్దామని అంటే మరి కొందరు వాషింగ్ పౌడర్ అయిందని సెటైర్లు పేల్చుతున్నారు.

ఈ విధంగా చూస్తే కవితకు బెయిల్ రావడం కాదు కానీ తెలంగాణా అంతటా రాజకీయంగా పెద్ద ఎత్తున డిస్కషన్ అయితే సాగుతోంది అని అంటున్నారు. బెయిల్ రావడం తప్పు కాదు, అది న్యాయ నిర్ణయం. కానీ ఆ విషయాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు దాని వెనక ప్రయోజనాల పంట పండించుకోవడం తప్పు. ఇపుడు అలాంటి తెర వెనక నిర్ణయాల మీదనే చర్చ సాగుతోంది.ఏది ఏమైనా కొన్ని దాచినా దాగవు. కాలం గడిచే కొద్దీ చిక్కు ముడులు వీడుతూ ఉంటాయి. సో ఆ విధంగా చూస్తే కనుక కచ్చితంగా ఈ ముడి కూడా ఏదో నాడు వీడుతుందని అంటున్నారు. సో అంతవరకూ వెయిట్ అండ్ సీ.