Begin typing your search above and press return to search.

వైసీపీ ఎంపీ కుమారుడికి బెయిల్.. కండిషన్స్ అప్లై!

ఢిల్లీ మద్యం కుంభకోణం లో ప్రధాన నిందితుల్లో ఒకరైన మాగుంట రాఘవ అలియాస్ రఘు కు బెయిల్ మంజూరు అయ్యింది.

By:  Tupaki Desk   |   18 July 2023 9:56 AM GMT
వైసీపీ ఎంపీ కుమారుడికి బెయిల్..  కండిషన్స్  అప్లై!
X

దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిందని చెప్పుకుంటున్న ఢిల్లీ లిక్కర్ స్కాం లో మరో అప్ డేట్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు ఎంపీ కుమారుడికి బెయిల్ మంజూరైనట్లు తెలిసింది. ఈమేరకు ఢిల్లీ హైకోర్టు తీర్పు వెళ్లడించిందని అంటున్నారు.

సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం లో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందని ఒకపక్క కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. ఆ సంగతి అలా ఉంటే మరోపక్క ఈ స్కామ్‌ లోని ఇతర కీలక పాత్రధారులు, ముఖ్యంగా సౌత్ గ్రూప్‌ కు చెందిన వారు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారనే కామెంట్లు తెరపైకి వస్తున్నాయి.

ఇందులో భాగంగా... ఢిల్లీ మద్యం కుంభకోణం లో ప్రధాన నిందితుల్లో ఒకరైన మాగుంట రాఘవ అలియాస్ రఘు కు బెయిల్ మంజూరు అయ్యింది. తనకు ఆరోగ్యం బాగాలేదని కోర్టుకు విన్నవించడంతో... ఢిల్లీ హైకోర్టు నాలుగు వారాల బెయిల్ మంజూరు చేసిందని తెలుస్తుంది.

ఈ సందర్భంగా... విచారణ కు రావాల్సి వచ్చినప్పుడల్లా ఈడీ అధికారుల ఎదుట హాజరుకావాల ని ఈ మేరకు రాఘవ ను ఢిల్లీ హైకోర్టు కోరిందని తెలుస్తుంది. ఇదే సమయం లో బెయిల్ వ్యవధిలో చెన్నై వదిలి వెళ్లవద్దని, చెన్నై లేదా ఢిల్లీలో ప్రశ్నించేందుకు ఈడీకి అందుబాటు లో ఉండాల ని కోరినట్లు సమాచారం.

అయితే... మాగుంట రాఘవ చెన్నై లోని ఎన్రికా ఎంటర్‌ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మద్యం తయారీ యూనిట్లను కలిగిఉన్నారని అంటున్నారు. అతను ఎక్సైజ్ పాలసీ 2021-22కి విరుద్ధంగా మాగుంట ఆగ్రో ఫామ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రెండు రిటైల్ జోన్‌ లను నేరుగా నియంత్రించాడని చెబుతున్నారు. ఇదే సమయంలో ఇండో స్పిరిట్స్‌ లో 32.5 శాతం వాటా ను కూడా కలిగి ఉన్నారని ఈడీ ఆరోపించిందని కథనాలొచ్చాయి.

అయితే... గతం లో రాఘవ బెయిల్ పిటిషన్‌ ను తీవ్రంగా వ్యతిరేకించిన ఈడీ ఈసారి బెయిల్‌ ను వ్యతిరేకించకపోవడం ఆసక్తికరంగా మారిందని అంటున్నారు పరిశీలకులు. అంటే... ఈ కేసు లో అప్రూవర్‌ గా మారిన తర్వాత, అరబిందో గ్రూప్ డైరెక్టర్ - వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి బంధువు పి.శరత్ చంద్రారెడ్డిని ఢిల్లీ కోర్టు వదిలిపెట్టిన దాదాపు 50 రోజుల తర్వాత రాఘవ కు బెయిల్ మంజూరు చేయబడిందన్న మాట.

అంతకంటే ముందు ఈ కేసు లో మరో నిందితుడు... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆరెస్స్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ సీఏ గోరంట్ల బుచ్చిబాబు కూడా అప్రూవర్ గా మారి బెయిల్ పొందిన సంగతి తెలిసిందే.

కాగా... ఫిబ్రవరి 10న, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అక్రమాల కు సంబంధించి మనీలాండరింగ్ విచారణ కు సంబంధించి మాగుంట రాఘవ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, జి బుచ్చిబాబుల తో పాటు సౌత్ గ్రూప్‌ లో కీలకంగా రాఘవ, కవిత పేరు ను కూడా ఈడీ పేర్కొన్న సంగతి తెలిసిందే.