Begin typing your search above and press return to search.

బజాజ్ ఫైనాన్స్ కు భారీ షాకిచ్చిన ఆర్ బీఐ!

పరిచయం చేయాల్సిన అవసరం లేని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థ బజాజ్ ఫైనాన్స్. కొన్నేళ్ల క్రితం వరకు దీని గురించి తెలిసిన వారే ఉండేవారు కాదు

By:  Tupaki Desk   |   16 Nov 2023 4:35 AM GMT
బజాజ్ ఫైనాన్స్ కు భారీ షాకిచ్చిన ఆర్ బీఐ!
X

పరిచయం చేయాల్సిన అవసరం లేని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థ బజాజ్ ఫైనాన్స్. కొన్నేళ్ల క్రితం వరకు దీని గురించి తెలిసిన వారే ఉండేవారు కాదు. అలాంటి ఈ సంస్థ అతి తక్కువకాలంలో ఎలక్ట్రికల్.. ఎలక్ట్రానిక్స్ మీద వాయిదాల పద్దతిలో రుణాలు ఇవ్వటం.. ఆయా సంస్థలతో ముందస్తుగా చేసుకున్న ఒప్పందంలో భాగంగా తేలికపాటి ఈఎంఐలతో అప్పులు ఇవ్వటం తెలిసిందే. ఈ సంస్థ జారీ చేసే కార్డులతో పలు రుణాలు ఇవ్వటం తెలిసిందే.

అయితే.. ఈ సంస్థ జారీ చేసే ఈ-కామ్.. ఇన్ స్టా ఈఎంఐ కార్డుల్ని జారీ చేసే అంశంపై తాజాగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా షాకిచ్చింది. ఈ కార్డులపై ఇచ్చే రుణాల మంజూరును తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. డిజిటల్ రుణాలకు సంబంధించిన మార్గదర్శకాల్ని పాటించకపోటమే దీనికి కారణమని చెబుతున్నారు.

బజాజ్ ఫైనాన్స్ అందిస్తున్న రెండు రుణ ఉత్పత్తులకు సంబంధించి రుణగ్రహీతలకు వాస్తవ అంశాల్ని తెలిసేలా చెప్పకపోవటాన్ని ఆర్ బీఐ తప్పు పట్టింది.అంతేకాదు.. కంపెనీ మంజూరు చేసే డిజిటల్రుణాలకు సంబంధించిన ప్రకటనల్లోనూ లోపాలు ఉన్నట్లుగా రిజర్వు బ్యాంక్ చెబుతోంది.

అందుకే.. లోపాల్ని సరిదిద్దిన తర్వాత వాటిని రివ్యూ చేసిన తర్వాత మాత్రమే రుణాలు జారీ చేసే అనుమతుల్ని ఇస్తామని చెబుతోంది. ఆర్ బీఐ తీసుకున్న తాజా నిర్ణయం మార్కెట్ వర్గాల్ని విస్మయానికి గురి చేసింది. దీని ఫలితంగా బాజాజ్ ఫైనాన్స్ షేరు ధర బుధవారం 1.84 శాతం క్షీణించి రూ.7223.95కు ముగిసింది. ఆర్ బీఐ తీసుకున్న నిర్ణయంపై బజాజ్ ఫైనాన్స్ సంస్థ ఎలాంటి ప్రకటన చేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.