Begin typing your search above and press return to search.

బాలయ్య ముందు భీషణ ప్రతిజ్ఞ చేసిన బాబు

ఆయన ఇంతటి సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ఎన్నో ఇంటర్యూలను ఫేస్ చేశారు.

By:  Tupaki Desk   |   22 Oct 2024 4:25 PM GMT
బాలయ్య ముందు భీషణ ప్రతిజ్ఞ చేసిన బాబు
X

టీడీపీ అధినేత చంద్రబాబు అపర చాణక్యుడు. రాజకీయ దురంధరుడు. ఆయనది అక్షరాలా అయిదు దశాబ్దాల అనుభవం. చంద్రబాబు మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. ఆయన ఇంతటి సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ఎన్నో ఇంటర్యూలను ఫేస్ చేశారు. జాతీయ ప్రాంతీయ స్థాయిలలో ఢక్కామెక్కీలు తిన్న ఎంతో మంది జర్నలిస్టులు చంద్రబాబుని కొరుకుడు పడని ప్రశ్నలు అడిగారు.

వాటిని ఎంతో చాకచక్యంగా బాబు జవాబులు చెప్పి తప్పించుకున్నారు. తాను చెప్పిందే రైట్ అని ఒప్పించారు కూడా. అలాంటి చంద్రబాబు తన బావమరిది కం వియ్యంకుడు టాప్ సినీ హీరో నందమూరి బాలకృష్ణ ముందు మనసు పరచేశారా. తనలో ఏముందో చెప్పేశారా. నవ్వుతూనే బాలయ్య అడిగిన అనేక ప్రశ్నలకు బాబు సరదాగానే జవాబులు చెబుతూ అసలు గుట్టు చెప్పేశారా అంటే పూర్తి ఎపిసోడ్ కోసం ఒక ప్రముఖ ఓటీటీ చానల్ లో ఈ నెల 25న వాచ్ చేయాల్సిందే.

ఆ సంగతి అలా ఉంటే బాలయ్య కొంటెగా చిలిపిగా తన బావ అయిన బాబుని ఎన్నో ప్రశ్నలు అడిగారు, ఒక విధంగా ఆటపట్టించారు. అదే సమయంలో రాజకీయంగా కూడా ఆయన అనేక ప్రశ్నలు వేశారు. అవన్నీ జనం మదిలో ఉన్నవే. మరి బాలయ్య ప్రశ్నలకు బాబు కచ్చితమైన సమాధానాలు చెప్పారా బాలయ్య తన బావ మనసులో మాటలను రాబట్టారా అంటే వాటికి కూడా సమాధానం ఈ నెల 25నే దొరుకుతుంది.

అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ప్రోమోస్ చూస్తే కనుక బాలయ్య చంద్రబాబులోని ఒక సరికొత్త కోణాన్ని మాత్రం తన ఇంటర్వ్యూ ద్వారా బయటపెట్టారు అనే అంటున్నారు. అదేంటి అంటే బాబు ఎపుడూ రివెంజ్ పాలిటిక్స్ తన టోటల్ పొలిటికల్ లైఫ్ లో చేయలేదు. కానీ తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదు అంటూ ఫుల్ ఎమోషనల్ అవుతూ బాబు చెప్పిన ఈ డైలాగ్ మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది.

ఇంతకీ బాబు ఎవరి మీద ఈ డైలాగ్ వేశారు. ఎవరిని వదిలిపెట్టను అంటున్నారు, అసలు బాబు విషయంలో అంత పెద్ద తప్పు చేసిన వారు ఎవరూ అంటే ఏపీ రాజకీయాల గురించే అందరి దృష్టి పడుతుంది. ఇదే ఎపిసోడ్ ప్రోమోలో చూస్తే కనుక బాబు రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ప్రతీకార రాజకీయాలు జరుగుతున్నాయని అన్నారు. సో దానికి దీనికీ లింక్ పెట్టి చూసుకుంటే కనుక బాబు చేసిన ఈ శపధం ప్రత్యర్థుల మీదనే అని అర్ధం అవుతోంది.

బాబు ఎపుడూ ఈ విధంగా ఎక్కడా ఇంత ఓపెన్ గా చెప్పి ఉండలేదు. మరి బాబు ఇలా చెప్పారూ అంటే ఆయన వూహాలు ఏమిటో అన్న చర్చ కూడా సాగుతోంది. సినిమాల్లో తొడ కొడుతూ విలన్ల మీద వీర లెవెల్ లో సవాళ్ళూ శపధాలూ చేయడం బాలయ్యకే చెల్లు. అటువంటి బాలయ్య ముందు బాబు చేసిన ఈ శపధం ఏపీ రాజకీయాలను మలుపు తిప్పుతుందా కొత్త పరిణామాలకు చోటు ఇస్తుందా అంటే అది ఆలోచించాల్సిందే.

ఇక తన జైలు జీవితం గురించి. అలాగే జైలులో తాను పవన్ కళ్యాణ్ కలసి మాట్లాడుకున్న దానిని గురించి చంద్రబాబు బాలయ్య అన్ స్టాపబుల్ తో పంచుకున్నట్లుగా ప్రోమోస్ చెబుతున్నాయి. అంతే కాదు రాజకీయాల్లో పవన్ తనది అన్ స్టాపబుల్ జర్నీ అని ఒక కొత్త విషయమూ చెప్పారు. ఇలా ఎన్నో ఆసక్తి కలిగించే విషయాలు చంద్రబాబు జైలు జీవితం ఆయన 53 రోజులు కటకటాల వెనక ఉన్నప్పుడు మదిలో మెదిలే అనేక విషయాలు ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నట్లుగా అర్ధం అవుతోంది. ఏది ఏమైనా బాబు పట్టిన శపధం మీద మాత్రం చర్చ అయితే సాగుతోంది. పూర్తి ఇంటర్వ్యూతో దాని మీద ఫుల్ క్లారిటీ అయితే రావచ్చేమో.